Delhi School Bomb Threat: స్కూల్‌లో బాంబు పెట్టామంటూ మెయిల్,బయటకు పరుగులు తీసిన విద్యార్థులు
Delhi School Bomb Threat: ఢిల్లీలోని ఓ స్కూల్‌లో బాంబు పెట్టామంటూ మెయిల్ రావడం కలకలం రేపింది.
Delhi School Bomb Threat:
ఢిల్లీలోని స్కూల్‌లో ఘటన..
ఢిల్లీలోని ఓ స్కూల్‌కి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. స్కూల్‌కి నేరుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. బాంబు పెట్టామంటూ బెదిరించాడు. దీంతో ఒక్కసారిగా స్కూల్ యాజమాన్యం టెన్షన్ పడిపోయింది. వెంటనే విద్యార్థులందరినీ బయటకు పంపేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మధుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిందీ ఘటన. వెంటనే పోలీసులు స్కూల్‌కి వచ్చి చాలా సేపు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వస్తువులేమీ దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, ఆంబులెన్స్‌లు వచ్చాయి. చాలా సేపటి వరకు సెర్చ్ ఆపరేషన్ జరిగింది. అక్కడ ఎలాంటి బాంబు లేదని తేల్చి చెప్పాక కాస్త రిలాక్స్ అయ్యారు. ఉదయం స్కూల్ నుంచి తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే స్కూల్‌కి వచ్చి తనిఖీలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.
"స్కూల్ ప్రాంగణంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్వాట్ టీమ్‌లు కూడా ఇక్కడికి వచ్చాయి. స్కూల్ అంతా శానిటైజ్ చేస్తున్నారు"
- పోలీసులు
ఢిల్లీలో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఆకతాయిలు కావాలనే స్కూల్స్‌కి బెదిరింపు మెయిల్స్ పంపుతున్నారు.
Delhi Public School, Mathura Road receives bomb threat via e-mail; investigation underway, says Delhi Fire Service. pic.twitter.com/MxbfoshrOs
— ANI (@ANI) April 26, 2023
సాదిక్ నగర్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కి ఏప్రిల్ 12న ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. స్కూల్‌లో బాంబు పెట్టామని బెదిరించారు. ఇది చూసి టెన్షన్ పడిన యాజమాన్యం విద్యార్థులను బయటకు పంపింది. మీ పిల్లల్ని తీసుకెళ్లండి అంటూ తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపింది. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తల్లిదండ్రులు కంగారు పడి స్కూల్‌కు వచ్చారు. బయట విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. "వెంటనే స్కూల్‌కి వచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్లండి అంటూ స్కూల్ నుంచి మాకు మెసేజ్‌లు వచ్చాయి. ఏమైందో అని కంగారు పడిపోయి వచ్చేశాం" అని తల్లిదండ్రులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్కూల్‌లో తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని స్పష్టం చేశాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ ఇదే స్కూల్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి.
"ఈ స్కూల్‌కి బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది నవంబర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి అడ్మిన్‌కు మెయిల్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈ సమాచారం అందిన వెంటనే మేము బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో వచ్చాం"
- చందన్ చౌదర్, పోలీస్ ఉన్నతాధికారి
The Indian School in Sadiq Nagar received an bomb threat via email. As a precautionary measure, the school has been vacated. Bomb Detection and Disposal Squad informed: Delhi police
— ANI (@ANI) April 12, 2023
More details awaited. pic.twitter.com/p6DKKeSXsl
Also Read: డ్రగ్స్ సరఫరా కేసులో ఇండియన్‌కి ఉరిశిక్ష, సింగపూర్‌లో అంతే మరి