అన్వేషించండి

డ్రగ్స్‌ సరఫరా కేసులో ఇండియన్‌కి ఉరిశిక్ష, సింగపూర్‌లో అంతే మరి

Singapore Drug Trafficking: డ్రగ్స్ సరఫరా చేసిన ఓ ఇండియన్‌ని సింగపూర్ ప్రభుత్వం ఉరి తీసింది.

Singapore Drug Trafficking:

కిలో గంజాయి సరఫరా..

డ్రగ్ స్మగ్లింగ్‌. ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న వ్యాపారం ఇదే. అన్ని దేశాలూ ఈ అక్రమ రవాణాపై నిఘా పెడుతున్నప్పటికీ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. ఏదో ఓ మూల నుంచి తప్పించుకుని వచ్చి సరఫరా చేసేస్తున్నాయి ముఠాలు. ఇలాంటి వాళ్లు చిక్కితే ప్రభుత్వాలు చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. భారత్‌లో ఇప్పుడిదే జరుగుతోంది. ఈ లిస్ట్‌లో సింగపూర్‌ కూడా చేరిపోయింది. డ్రగ్స్ ముఠాలను వెతికి పట్టుకుంటున్నారు అక్కడి అధికారులు. ప్రభుత్వం మరణ శిక్ష విధించడానికీ వెనకాడటం లేదు. ఇటీవల డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తికి ఉరి శిక్ష విధించడం సంచలనమైంది. భారత్ మూలాలాన్న తంగరాజు సుప్పియ (46) డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అతడి నుంచి దాదాపు కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్‌లోని చంగీ జైల్లో పెట్టిన అధికారులు...ఆ తరవాత ఉరి తీశారు. ఈ మేరకు సింగపూర్ ప్రిజన్ సర్వీస్‌ అధికారిక ప్రకటన చేసింది. అతడిని క్షమించి వదిలేయాని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. నిందితుడు తంగరాజు కోర్టులో రివ్యూ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ దాన్ని కొట్టేశారు. రివ్యూ చేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలను తంగరాజు కోర్టుకి ఇవ్వలేకపోయాడని, అందుకే తప్పని పరిస్థితుల్లో ఉరి శిక్ష విధించాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు అధికారులు. ఈ విషయంలో ఎలాంటి పక్షపాతమూ లేదని స్పష్టం చేశారు. 

సింపూర్‌లో ఇంతే..

సింగపూర్‌లో యాంటీ డ్రగ్స్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమాజాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి శిక్షలు పడాల్సిందేనని తేల్చి చెబుతోంది. 2018 అక్టోబర్‌లోనే ఈ కేసులో తంగరాజుని దోషిగా తేల్చింది కోర్టు. అప్పటి నుంచి రివ్యూ పిటిషన్‌లు పెట్టుకున్నప్పటికీ దేన్నీ కోర్టు పట్టించుకోలేదు. సరైన ఆధారాలు లేవని  ఆ పిటిషన్‌లను కొట్టి వేసింది. 2019 ఆగస్టులో అప్లై చేసినా లాభం లేకుండా పోయింది. ఫోన్‌ ద్వారా కొందరితో కమ్యూనికేట్ అవుతూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. గతేడాది నవంబర్ నుంచి తనను విడుదల చేయాలంటూ వరుస పిటిషన్‌లు వేస్తూనే ఉన్నాడు తంగరాజు. కేసు నుంచి తప్పించుకునేందుకు అవసరం లేదని వాదనలన్నీ వినిపిస్తున్నారంటూ కోర్టు మండి పడింది. అయితే...సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు సోషల్ యాక్టివిస్ట్‌లు తప్పు పడుతున్నారు. అమాయకుడిని చంపేశారంటూ విమర్శిస్తున్నారు. సింగపూర్‌లో ఇలా ఉంటే...థాయ్‌లాండ్‌లో గంజాయి సరఫరాను అధికారికంగా చేసుకోవచ్చని ప్రభుత్వమే అనుమతినిచ్చింది. చట్టాల్లో అలా మార్పులు కూడా చేసింది.  

Also Read: Bihar News: 40 మంది మహిళలకు ఒక్కడే భర్త - కులగణనకు వెళ్లిన అధికారులు షాక్!

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget