Vikarabad News: దుస్తులు ఆరేస్తుండగా కరెంట్ షాక్ - దంపతులు మృతి, ఎక్కడంటే?
Couple Died: దుస్తులు ఆరేస్తుండగా కరెంట్ షాక్ తో దంపతులు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
Couple Died Due to Electric Shock in Vikarabad: వికారాబాద్ (Vikarabad) జిల్లాలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఆరేస్తుండగా కరెంట్ షాక్ కు గురై దంపతులు ప్రాణాలు కోల్పోయారు. బొంరాస్ పేట మండలం బురాన్ పూర్ గ్రామానికి చెందిన దంపతులు బోయిన లక్ష్మణ్ (48), లక్ష్మి (42) దంపతులు వారి ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు వద్ద దుస్తులు ఆరేసేందుకు వైరు తీగలు ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం బట్టలు ఆరేసే క్రమంలో వారు కట్టిన తీగకు విద్యుత్ ప్రసరించింది. దీంతో విద్యుత్ షాక్ కు గురై ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ కాలనీకి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ ఫార్మర్ లో సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతులకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. తమ వారి మృతితో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Also Read: Hyderabad News: నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత - బీజేపీ నేత కుమారుడు అరెస్ట్?