అన్వేషించండి

Pawan Kalyan Fans: ఏపీలో టికెట్ల ధరలపై కొత్త జీవో - అంతలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు

Chittoor Pawan Kalyan Fans: సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ జీవో వచ్చిన రోజే పవన్ కళ్యాణ్ అభిమానులకు పోలీసులు షాకిచ్చారు. చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ అభిమానులపై కేసు నమోదైంది. 

Case Filed Against Pawan Kalyan Fans : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లపై సవరింపు జీవోను తీసుకొచ్చింది. గరిష్టంగా రూ.150, రూ.250 వరకు సినిమా టికెట్లు పెంచుకునేలా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో ఏసీ, నాన్ ఏసీ థియేటర్లలో సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ జీవో వచ్చిన రోజే పవన్ కళ్యాణ్ అభిమానులకు పోలీసులు షాకిచ్చారు. చిత్తూరు జిల్లా పీలేరులో పవన్ కళ్యాణ్ అభిమానులపై కేసు నమోదైంది. 

పవన్ కళ్యాణ్ అభిమానులపై కేసు నమోదు.. 
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం గత నెలలో విడుదలైంది. భీమ్లా నాయక్ రిలీజ్ రోజున ఓ మేకను జంతుబలి ఇచ్చారు. పీలేరు సిఎస్.ఎన్ థియేటర్‌లో గొర్రెపిల్లను బలి ఇచ్చారని జంతు ప్రేమికుడు, న్యాయవాది అసర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. జంతుబలికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాద్యమాలలో వైరల్ అయినట్టు ఫిర్యాదులో అసద్ పేర్కొన్నారు. ఏపీలో సినిమా టికెట్ల వివాదం సద్దుమణిగింది అనుకున్న రోజే, కొన్ని రోజుల కిందట ఇచ్చిన జంతు బలి వివాదం తెరమీదకు రావడం పవన్ ఫ్యాన్స్‌ను ఇరుకున పెడుతోంది.

చిక్కుల్లో థియేటర్ యాజమాన్యం.. 
న్యాయవాది అసర్ మహరాష్ట్ర నుంచి ట్విటర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రూయల్టీ, బర్డ్స్ ఆర్మ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సీఎస్ఎన్ థియేటర్ వద్ద  జంతు బలి జరిగిందని థియేటజర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు పవన్ అభిమానులను గుర్తించే పనిలో పడ్డారు. పవన్ కళ్యాణ్ అభిమానులను గుర్తించేందుకు వైరల్ అయిన వీడియోలను పరిశీలిస్తున్నారు.

లాయర్ ఫిర్యాదు..
సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'భీమ్లానాయక్'. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందించిన ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది కానీ 'ఆర్ఆర్ఆర్' కోసం వాయిదా పడింది. ఆపై కొత్త రిలీజ్ డేట్ ప్రకారం ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడులైంది. మూవీ రిలీజ్ రోజు పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఓ జంతువును బలి ఇచ్చారు. కానీ ఇన్ని రోజుల తరువాత జంతుబలికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, దీనిపై జంతు ప్రేమికుడు, లాయర్ మహారాష్ట్ర నుంచి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: Prabhas Thanks To YS Jagan: జగన్‌కు ‘డార్లింగ్’ థ్యాంక్స్ - టికెట్ రేట్ల జీవోపై స్పందించిన ప్రభాస్!

Also Read: AP Cinema Ticket Rates GO: రూ.20 నుంచి రూ.150 వరకు - రూ.250 ఆప్షన్ వాటికి మాత్రమే - ఏపీలో సినిమా టిక్కెట్ ధరల జీవో వచ్చేసింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
West Godavari Viral News: పార్శిల్‌లో డెడ్‌బాడీ-షాక్ తిన్న మహిళ- పశ్చిమగోదావరిలో ఘటన 
పార్శిల్‌లో డెడ్‌బాడీ-షాక్ తిన్న మహిళ- పశ్చిమగోదావరిలో ఘటన 
Dinga Dinga: జ్వరం వచ్చినా జలుబు చేసినా డ్యాన్స్ చేస్తారట, ఉగాండాను షేక్ చేస్తున్న డింగ డింగ వైరస్‌
జ్వరం వచ్చినా జలుబు చేసినా డ్యాన్స్ చేస్తారట, ఉగాండాను షేక్ చేస్తున్న డింగ డింగ వైరస్‌
Bangladesh China Frienship: బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
Embed widget