అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AP Cinema Ticket Rates GO: రూ.20 నుంచి రూ.150 వరకు - రూ.250 ఆప్షన్ వాటికి మాత్రమే - ఏపీలో సినిమా టిక్కెట్ ధరల జీవో వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లకు సంబంధించిన ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది.

తెలుగు సినిమా రంగం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కొత్త సినిమా టికెట్ల జీవోను ప్రభుత్వం జారీ చేసింది. గరిష్టంగా రూ.20 నుంచి రూ.150 వరకు టికెట్ రేట్లను ఇందులో నిర్ణయించారు. రిక్లెయినర్ సీట్లు ఉంటే వాటికి రూ.250 వరకు టికెట్ ధరను వసూలు చేయవచ్చు. దీంతోపాటు కొన్ని నియమ నిబంధనలను కూడా ఏపీ ప్రభుత్వం జారీ చేసింది.

మొత్తం థియేటర్లను నాలుగు విభాగాల్లో విభజించారు. ఏ కేటగిరీ థియేటర్లలో ఎంత రేట్లు నిర్ణయించుకోవచ్చు అనేది కింద చూడండి.

నాన్ ఏసీ థియేటర్స్
1. మున్సిపల్ కార్పొరేషన్లు
ప్రీమియం - రూ.60
నాన్ ప్రీమియం -  రూ.40
2. మున్సిపాలిటీ
ప్రీమియం - రూ.50
నాన్ ప్రీమియం -  రూ.30
3. నగర పంచాయతీలు/గ్రామ పంచాయతీలు
ప్రీమియం - రూ.40
నాన్ ప్రీమియం -  రూ.20

ఏసీ థియేటర్లు
1. మున్సిపల్ కార్పొరేషన్లు
ప్రీమియం - రూ.100
నాన్ ప్రీమియం -  రూ.70
2. మున్సిపాలిటీ
ప్రీమియం - రూ.80
నాన్ ప్రీమియం -  రూ.60
3. నగర పంచాయతీలు/గ్రామ పంచాయతీలు
ప్రీమియం - రూ.70
నాన్ ప్రీమియం -  రూ.50

ప్రత్యేక థియేటర్లు (స్పెషల్ కేటగిరీ)
1. మున్సిపల్ కార్పొరేషన్లు
ప్రీమియం - రూ.125
నాన్ ప్రీమియం -  రూ.100
2. మున్సిపాలిటీ
ప్రీమియం - రూ.100
నాన్ ప్రీమియం -  రూ.80
3. నగర పంచాయతీలు/గ్రామ పంచాయతీలు
ప్రీమియం - రూ.90
నాన్ ప్రీమియం -  రూ.70

మల్టీప్లెక్స్
1. మున్సిపల్ కార్పొరేషన్లు
రెగ్యులర్ సీట్లు - రూ.150
రిక్లెయినర్ - రూ.250
2. మున్సిపాలిటీ
రెగ్యులర్ సీట్లు - రూ.125
రిక్లెయినర్ - రూ.250
3. నగర పంచాయతీలు/గ్రామ పంచాయతీలు
రెగ్యులర్ సీట్లు - రూ.100
రిక్లెయినర్ - రూ.250

జీవోలో ఉన్న మరిన్ని కీలకాంశాలు

నాన్-ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు... వాటి సీటింగ్ కెపాసిటీలో 25 శాతాన్ని నాన్ ప్రీమియం విభాగంలో ఉంచాలి.
ఎయిర్ కూల్ థియేటర్లను కూడా ఏసీ థియేటర్ల కేటగిరీలో చేర్చారు. రెండు సంవత్సరాల్లో పూర్తి స్థాయి ఏసీ థియేటర్లుగా వీరు అప్‌గ్రేడ్ చేసుకోవాలి. లేని పక్షంలో ఆ తర్వాత వీటిని నాన్-ఏసీ కేటగిరీకి మారుస్తారు.
డిజిటల్ సరౌండ్ సిస్టం, 7.1, 2కే ప్రొజెక్షన్ వంటి మల్లీఫ్లెక్స్ స్థాయి ప్రమాణాలున్న థియేటర్లను స్పెషల్ కేటగిరీగా నిర్ణయించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా ఉన్న ఒక జిల్లా స్థాయి కమిటీ ద్వారా స్పెషల్ కేటగిరీ థియేటర్లను నిర్ణయిస్తారు.
హీరో, హీరోయిన్లు, దర్శకుల పారితోషికాలు కాకుండా కేవలం నిర్మాణ వ్యయం మాత్రమే రూ.100 కోట్లు దాటిన సినిమాలను సూపర్ హై బడ్జెట్ సినిమాల కేటగిరిలోకి వస్తాయి. వీటికి ప్రభుత్వం ప్రత్యేక రేట్లను నిర్ణయిస్తుంది. ఆ రేట్లు మొదటి 10 రోజుల వరకు అమల్లో ఉంటాయి. దీంతోపాటు ఈ సినిమాలు కనీసం 20 శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకుని ఉండాలన్న నిబంధన కూడా విధించారు.
రోజుకు ఐదు షోలకు ప్రత్యేకమైన అనుమతి అందించనున్నారు. అయితే వీటిలో ఒక షో కచ్చితంగా చిన్న సినిమా వేయాల్సిందే. అందరి రెమ్యునరేషన్లతో కలుపుకుని రూ.20 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన సినిమాలను చిన్న సినిమాలుగా నిర్ణయించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget