Road Accident: చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా... 27 మందికి తీవ్రగాయాలు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు బోల్తా పడి 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం దాదంవారి పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తోన్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులను హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో వారిని బెంగుళూరుకి తరలించారు. సింగమానుబురుజు నుంచి కాండ్లమడుగుకు పెళ్లికి వెళ్తోన్న గోల్డన్‌వ్యాలీ కాలేజీకి చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదంపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Hyderabad పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!
పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 18 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. దాదాపు 35 మందికి పైగా బంధువులు మినీ ట్రక్కులో చక్దా నుంచి నబద్వీప్‌లోని బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరింది. ఆదివారం తెల్లవారుజామున హన్స్‌ఖాలీలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో, చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని స్థానిక పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పొగమంచు కారణంగా దారి కనిపించక ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్ మామూలుగా ఉండదు!!
Also Read: Omicron symptoms: కోవిడ్-19 కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’.. ఇది డేల్టా కంటే డేంజరా? లక్షణాలేమిటీ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి