Hyderabad: పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!

Father Beats His Son: ఓ తండ్రి కన్న కొడుకుపై పాశవికంగా కర్రతో దాడి చేశాడు. పిల్లలకు బుద్ధులు నేర్పించి, వారిని మంచిగా చూసుకోవాల్సిన తండ్రి క్రూరంగా ప్రవర్తించాడు. ఛత్రినాక పీఎస్ పరిధిలో ఘటన జరిగింది.

FOLLOW US: 

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ తండ్రి కన్న కొడుకుపై పాశవికంగా కర్రతో దాడి చేశాడు. పిల్లలకు బుద్ధులు నేర్పించి, వారిని మంచిగా చూసుకోవాల్సిన తండ్రి చేసిన ఈ పని విమర్శలకు దారితీసింది. కుమారుడ్ని కర్రతో దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం శనివారం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

అశోక్, జిజా బాయి దంపతులు ఛత్రినాక పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్నారు. వీరికి 10 సంవత్సరాల కుమారుడు, ఓ కూతురు ఉంది. అయితే కుమారుడు అల్లరి చేస్తున్నాడని కన్న తండ్రి దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఇంట్లో కూతురు, కుమారుడు ఉన్న సమయంలో శనివారం మధ్యాహ్నం కర్రతో బాలుడిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తన తప్పు అయ్యిందని.. పప్పా క్షమించు అని కాళ్లావేళ్లా పడినా తండ్రి అశోక్ కనికరించలేదు. లావుగా ఉన్న కర్రతో విచక్షణా రహితంగా కుమారుడ్ని చితకబాదాడు. 

కర్ర విరిగినా పట్టించుకోకుండా బాలుడిని తీవ్రంగా దండించి గాయపరిచాడు తండ్రి అశోక్. ఇక నుంచి తను అల్లరి చేయనని, ఇబ్బంది పెట్టనని.. వదిలేయాలంటూ విలపిస్తున్నా అతడి మనసు కరగలేదు. మంచం కిందకు వెళ్లి దాక్కుంటున్నా బయటకు తీసుకొచ్చి దాడిచేశాడు. సోదరుడిని తండ్రి కొడుతుండగా బాలిక వీడియో తీసింది. ఇంటికి వచ్చాక విషయం తెలుసుకున్న తల్లి జిజా బాయి ఛత్రినాక పోలీసులను ఆశ్రయించింది. కుమారుడిపై భర్త విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Also Read: పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

లాల్ దర్వాజ దగ్గర అశోక్, జిజా బాయి నివాసం ఉంటున్నారు. జిబా బాయి ప్రైవేట్ జాబ్ చేస్తోంది. అయితే వీరి కుమారుడు అల్లరి చేస్తున్నారని చుట్టుపక్కల వారు తండ్రి అశోక్ కు ఫిర్యాదు చేశారు. కోపంతో రగిలిపోయిన తండ్రి 10 ఏళ్ల బాలుడ్ని కర్రతో చితకబాదాడు. కుమారుడిపై దాడి చేయడాన్ని కుమార్తెకు చెప్పి తండ్రి అశోక్ వీడియో తీయించాడు. ఇతరులకు చూపించేందుకు వీడియో తీయించి ఉండొచ్చునని ఛత్రినాక పోలీసులు తెలిపారు. 
Also Read: Hyderabad: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్‌ మామూలుగా ఉండదు!!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Nov 2021 08:58 AM (IST) Tags: Hyderabad Boy father beats son Old City Chatrinaka Police Station Man Beats His Son

సంబంధిత కథనాలు

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే

Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే

Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !

Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!