By: ABP Desam | Updated at : 15 Sep 2021 02:05 PM (IST)
Edited By: Sai Anand Madasu
వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ(ఫైల్ ఫొటో)
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. హంతకులను గుర్తించేందుకు అవసరమైన ఆధారాలు సేకరిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని అరెస్ట్ చేయగా మరికొందరు నిందితుల అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివేకా ఇంట్లోకి నిందితులు ఏవిధంగా ప్రవేశించారు, హత్య చేసి ఎలా పారిపోయారనే అంశంపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు.
కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో రెండో రోజు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వివేకా ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీసి కొలతలు వేశారు. నిన్న సాయంత్రం ప్రారంభించిన సీన్ రీకన్‌స్ట్రక్షన్ ప్రక్రియ కొనసాగింపుగా ఇవాళ కూడా జరిగింది. నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ఎలా వచ్చారన్న దానిపై సీబీఐ ఆరా తీస్తోంది.
వివేకా హత్య జరిగిన సమయంలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ఇంట్లోకి ప్రవేశించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. నలుగురు వ్యక్తుల పేర్లతో స్టిక్కర్లను చొక్కాలకు అంటించుకొని సీబీఐ ట్రయల్స్ చేస్తోంది.
వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని అరెస్ట్ చేయగా... డ్రైవర్ దస్తగిరిని మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించారు. హత్యాస్థలంలో దస్తగిరి ఉన్నట్లు భావిస్తే ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎర్ర గంగిరెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల కిందట ఐపీసీ సెక్షన్ 201 కింద సాక్ష్యాలు తారుమారు చేశారనే కేసులో గంగిరెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారు.
వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో పక్కా ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2019 మార్చి 15న తెల్లవారుజామున వివేకా హత్య జరిగింది. మార్చి 14వ తేదీ రాత్రి వివేకా ఇంట్లోకి ప్రవేశించిన నిందితుల వివరాలపై సీబీఐ ఆరాతీస్తోంది. వివేకా హత్య జరిగిన బాత్ రూం, బెడ్ రూం ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. హత్య జరిగిన ముందు రోజు రాత్రి వివేకా ఇంటికి సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి పల్సర్ బైకులో గొడ్డలి తీసుకుని వచ్చినట్లు ఇటీవల పులివెందుల కోర్టుకు సమర్పించిన రిమాండు రిపోర్టులో సీబీఐ పేర్కొంది. మరికొందరు నిందితులు ఇంట్లోకి వచ్చారనే సమాచారం మేరకు సీబీఐ ట్రయల్ నిర్వహించింది.
Also Read: Engineer’s Day: మూసీ వరదల నుంచి హైదరాబాద్ ను రక్షించిన మహనీయుడు... మోక్షగుండం విశ్వేశ్వరయ్య
East Godavari News : విహారయాత్రలో విషాదం, గోదావరిలో పడి అక్కాచెల్లెళ్లు మృతి
Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు
Puppalaguda Accident : పుప్పాలగూడలో ఘోర ప్రమాదం, సెల్లార్ పనుల్లో గోడ కూలి ఇద్దరు మృతి
Nizamabad News : మంచినీళ్లు అనుకుని కస్టమర్ కు యాసిడ్ ఇచ్చిన షాపింగ్ మాల్ వర్కర్, ఆ తర్వాత తాను తాగి!
Praja Vedika Demolition : చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత, ప్రజా వేదిక కూల్చివేతపై టీడీపీ శ్రేణుల నిరసన
Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్
India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్ ఎవరు?
AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?