Bengaluru techie: పానీపూరి అమ్మడానికి ఒరాకిల్ జాబ్ వదిలేశాడు - ఇప్పుడు కట్న వేధింపుల కేసులో అరెస్ట్ - దారి తప్పిన టెకీ !
Techie Husband: బెంగలూరులో ఓ టెకీని పోలీసులు అరెస్టు చేశారు. అతని ప్రెగ్నెంట్ భార్య వరకట్న వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంది.

Bengaluru techie arrested in dowry death case : ఒరాకిల్ లో మంచి ఉద్యోగం చేసే వ్యక్తి.. ఎంత కాలం ఈ బానిస బతుకు అనుకుని పానీపూరి అమ్మాలని డిసైడయ్యాడు. అదే కారణంతో ఉద్యోగం మావేశాడు. ఇప్పుడు అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్య.. ఇన్ఫోసిస్‌లో పనిచేస్తుంది. వరకట్న వేధింపులు తీవ్రం కావడంతో .. గర్భంతో ఉన్నప్పటికీ ఆమె ప్రాణాలు తీసుకుంది.
హుబ్బళ్లికి చెందిన శిల్పా, తన వివాహానికి ముందు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసింది. ఆమె డిసెంబర్ 5, 2022న మాజీ ఒరాకిల్ ఇంజనీర్ అయిన ప్రవీణ్‌ను వివాహం చేసుకుంది. తర్వాత ఇద్దరూ కలిసి పానీపూరి స్టార్టప్ పెట్టాలనుకున్నారు. అలాగే ప్రారంభించారు కూడా. కానీ వారికి కలసి రాలేదు. తర్వాత వరకట్న వేధింపులు ఎక్కువ కావడంతో ప్రవీణ్ భార్యను టార్చర్ పెట్టం ప్రాంభించాడు. తమ వద్ద ఉన్న డబ్బును అడిగినప్పుడల్లా ఇచ్చామని శిల్పా తల్లిదండ్రులు వాపోతున్నారు.
వివాహానికి దాదాపు రూ.35 లక్షలు ఖర్చు చేశారు, 150 గ్రాముల బంగారం , గృహోపకరణాలను అందించారు . ప్రవీణ్ డిమాండ్ చేసినప్పుడు ఎక్కువ డబ్బు ఇచ్చారు. "హుబ్బళ్లిలో మా ఇంటిని రూ.40 లక్షలకు అమ్మి పెళ్లి చేశామని... ఇటీవల, మా దగ్గర ఉన్న చిట్ ఫండ్ల ద్వారా మరో రూ.10 లక్షలు చెల్లించాం. అతను ఇంజనీర్ అని చెప్పాడు, కానీ ఇప్పుడు పానీపూరీ అమ్ముతాడు. అతను మా కుటుంబానికి అబద్ధం చెప్పాడు" అని శిల్ప మామ ఆవేదన వ్యక్తంచేశారు.
శిల్ప తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ , అతని తల్లి శాంతవ్వ తమ పానీపూరి వ్యాపారాన్ని విస్తరించడానికి రూ.5 లక్షలు డిమాండ్ చేస్తూ డబ్బు కోసం ఆమెను వేధించారని ఆరోపించారు. డిమాండ్ నెరవేరకపోవడంతో, శిల్పపై దాడి చేసి తల్లిదండ్రుల వద్దకు పంపారని ఆరోపించారు. శారద తర్వాత డబ్బు ఏర్పాటు చేసుకుని తన కుమార్తెను తిరిగి పంపించిందని, కానీ వేధింపులు కొనసాగాయని చెప్పింది. నా నువ్వు నల్లగా ఉన్నావు , నా కొడుకుకు తగిన జత కాదు. అతన్ని వదిలేయండి, మేము అతనికి మంచి వధువును చూసుకుంటామని వేధించినట్లుగా పోలీసులకు చెప్పారు.
STORY | Techie-turned-Panipuri seller held in dowry death case in Bengaluru
— Press Trust of India (@PTI_News) August 29, 2025
A man who quit his software job to sell panipuri was arrested for allegedly driving his 27-year-old wife to suicide at their residence in Suddaguntepalya, police said.
READ: https://t.co/GXZookdbD8 pic.twitter.com/xV7WzdeUfs
వరకట్న మరణ నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ACP స్థాయి అధికారి దీనిని నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. శిల్ప మృతదేహాన్ని పోస్ట్‌మార్టం తర్వాత ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఒరాకిల్ లో నిజంగా పని చేశాడా లేకపోతే.. ఒరాకిల్ లో పని చేస్తున్నట్లుగా అబద్దం చెప్పి పెళ్లిచేసుకుని.. తర్వాత పానీపూరి స్టార్టప్ పేరుతో.. మోసచేశాడా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





















