Lost in love: డేటింగ్ యాప్‌లో సోల్‌మేట్ దొరికిందనుకుంటే ఖాతా ఖాళీ చేసింది - ఆ పెళ్లి కాని ప్రసాద్‌కు ఎంత కష్టం వచ్చిందో !
Bengaluru: డేటింగ్ యాప్‌లో పరిచయమైన అమ్మాయి తియ్యటి కబుర్లు చెప్పింది. మన భవిష్యత్ కోసం ఓ యాప్‌లో పెట్టుబడులు పెట్టమని కోరింది. అప్పటికే మైకంలో ఉన్న ఆ వ్యక్తి చేయకుండా ఉంటాడా ?
Bengaluru software engineer scammed of Rs 50 lakh via dating app : దేశంలో పెళ్లి కాని ప్రసాద్‌లు పెరిగిపోతున్నారు. వారి ఆశల్ని ఆసరగా చేసుకుని వారిని నిట్టనిలువుగా ముంచేసే వారు కూడా పెరిగిపోతున్నారు. ఇలా మోసాల బారిన పడుతున్న వారికి అలా పెళ్లి కావడం లేదు.. ఇలా ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి మోసం ఒకటి వెలుగు చూసింది.
బెంగళూరలో ఉండే సురేష్ ( పేరు మార్చాం ) సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. చాలా రోజుల నుంచి పెళ్లి చేసుకుందామని చూస్తున్నాడు కానీ సంబంధాలు రావడం లేదు. మ్యాట్రిమొని సైట్లలో సహా అన్ని ప్రయత్నాలు చేశాక విసుగుపుట్టేసింది. ఇక ఏం చేయాలో తెలియక చివరి ప్రయత్నంగా ఓ డేటింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో ప్రోఫైల్ క్రియేట్ చేసుకున్నాయి. ఓ ఫైన్ మార్నింగ్ అతనికి మంచి సందేశం వచ్చింది. మీరు కోరుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి ఉంది.. మాట్లాడండి అంటూ నెంబర్ వచ్చింది. అంతే ఎగిరి గంతేసిన సురేష్.. మాట్లాటం ప్రారంచారు.
అసలే లైఫ్ పార్టనర్ దొరుకుతుందా లేదా అన్న అశ నిరాశల్లో ఉన్న సురేష్ కు ఆ అమ్మాయి మాటలు విన్న తర్వాత సోల్ మేట్ దొరికిందని సంబరపడ్డాడు. ఎంతగా అంటే తనకు ఇంత కాలం పెళ్లి కాకపోవడానికి కారణం ఇలాంటి సోల్ మేట్ దొరకకపోవడమేనని గట్టిగా నమ్మాడు. వారిద్దరూ పెళ్లికి ప్రణాళికలు కూడా వేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె మన భవిష్యత్ కు గ్యారంటీ ఏమిటి.. ఆర్థిక పరమన సుస్థిరత ఎలా వంటి చర్చలు తీసుకు వచ్చింది. ఆ సమయంలో తనకు తెలిసిన పెట్టబడి యాప్ ఉందని.. పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయని చెప్పింది. అప్పటికే సోల్ మేట్ ఏదంటే అది చేసే పరిస్థితికి వెళ్లిన ఆయన .. పెట్టుబుడులు ప్రారంభించాడు.
మొదట పదివేలు పెడితే వెంటనే ఇరవై వేలు వచ్చాయి. అలా పెట్టుబడులు పెట్టడం.. రావడం జరుగుతూ వస్తోంది. అలా ఆ అమ్మాయి ప్రోత్సహిస్తూండటం ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నట్లుగా కనిపిస్తూండటంతో మొత్తంగా యాభై లక్షలు పెట్టుబడి పెట్టాడు. అది కాస్తా నెలల్లోనే 73 లక్షలు అయినట్లుగా లెక్క చూపిస్తోంది. ఓ సారి ఆ డబ్బును డ్రా చేసుకుందామని అనుకున్నాడు సురేష్ . డ్రా చేసుకోవాలంటే 32 లక్షల ఫీజు చెల్లించాలన్నారు ఆ యాప్ కస్టమర్ కేర్ సర్వీస్ అధికారులు. తన సోల్ మేట్ కూడా కట్టేయమని చెప్పడంతో మొదటి సారి అనుమానపడ్డాడు.
తన దగ్గర చిల్లి గవ్వ కుండా పెట్టుబడి పెట్టానని ఇప్పుడు తన డబ్బులు వెనక్కి రాకపోతే ఇబ్బంది పడతానని సోల్ మేట్‌కు చెప్పుకున్నాడు. ఆ అమ్మాయి కూడా ఎంత వస్తే అంత పిండుకుందామని.. ఎనిమిది లక్షలైనా కట్టమని ఒత్తిడి తెచ్చింది. తర్వాత అసలు ఫోన్ చేయడం మానేసింది. ఫోన్ నెంబర్ కూడా పని చేయడం లేదు. ఆ యాప్ సురేష్ ను బ్లాక్ చేసింది. దీంతో లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది సురేష్. అందుకే ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.