By: Ram Manohar | Updated at : 16 Apr 2023 04:45 PM (IST)
అతిక్, అష్రఫ్ హత్యలు ఎలా జరిగాయో పోలీసుల విచారణలో తేలింది.
Atiq Ahmed Murder:
జర్నలిస్ట్‌ల్లా సెటప్
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అష్రఫ్ హత్య యూపీలోనే కాదు. దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. మీడియాతో మాట్లాడుతుండగానే పాయింట్ బ్లాంక్‌లో కాల్చి పారేశారు ముగ్గురు దుండగులు. వెంటనే పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే...అంత మంది పోలీసులుండగా వాళ్లు అంత ధైర్యంగా ఎలా చంపగలిగారు..? అన్నదే అనుమానాస్పదంగా ఉంది. అంత దగ్గరకు వచ్చే వరకూ పోలీసులు పట్టించుకోలేదా..అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. కానీ...ఆ ముగ్గురు నిందితులు చాలా ప్రీప్లాన్డ్‌గా ఈ మర్డర్ చేసినట్టు విచారణలో తేలింది. హత్య చేయాలని ప్లాన్ చేసిన వెంటనే పోలీసుల దగ్గరి వరకూ వెళ్లాలంటే ఏం చేయాలని ఆలోచించారు. జర్నలిస్ట్‌లకైతే ఈజీ యాక్సెస్ ఉంటుందని అదే వేషంలో వచ్చారు. ఎక్కడా అనుమానం రాకుండా ఫేక్ ఐడీ కార్డులు తయారు చేసుకున్నారు. వెంట ఓ కెమెరా కూడా తెచ్చుకున్నారు. జర్నలిస్ట్‌లు ఎలా బిహేవ్ చేస్తున్నారు..? డౌట్ రాకుండా ఎలా కవర్ చేసుకోవాలి..? అని తెలుసుకున్నారు. అతిక్‌పైనా ఓ కన్నేసి ఉంచారు. మీడియాతో ఎలా మాట్లాడుతున్నాడో గమనించారు. కరెక్ట్ టైమ్ కోసం వేచి చూశారు.
నేరుగా తలకే టార్గెట్
ఎప్పుడైతే ప్రయాగ్ రాజ్‌లోని హాస్పిటల్‌కి అతిక్, అష్రఫ్‌లను తీసుకొచ్చారో వెంటనే అలెర్ట్ అయ్యారు. మీడియా వాళ్లు చేసినట్టే హడావుడి చేశారు. నీట్‌గా టక్ చేసుకుని ఐడీ కార్డులు మెడలో వేసుకున్నారు. గన్స్ మాత్రం టక్ లోపల దాచేశారు. అతిక్ దగ్గరకు వెళ్లి ఏదో ప్రశ్న అడుగుతున్నట్టుగా నటించి వెంటనే షర్ట్‌లోపల నుంచి తుపాకీ తీసి కాల్చేశారు. నేరుగా అతిక్ తలకే గురి పెట్టి షూట్ చేశారు. ముగ్గురు నిందితులు దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇక్కడ మరో డౌట్ ఏంటంటే పోలీసులు ఈ నిందితులపై అసలు కాల్పులే జరపలేదు. అతిక్, అష్రఫ్ స్పాట్‌లోనే ప్రాణాలొదిలారు. ఆ తరవాత ముగ్గురు నిందితులనూ అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి ఫేక్ మీడియా ఐడీ కార్డులు, మైక్రోఫోన్, కెమెరా స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పులు జరిపే క్రమంలోనే ఓ నిందితుడికి కాల్లోకి తూటా దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
అతిక్‌ను చంపినందుకు ఎలాంటి రిగ్రెట్ లేదని నిందితులు చెప్పినట్టు సమాచారం. ఈ నేరం చేసినందుకు ఉరి శిక్ష వేసినా సిద్ధమే అని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. తాము చేసిన పని సరైందే అని చాలా గట్టిగా వాదిస్తున్నారట. "హద్దులన్నీ దాటారు. ఇక తట్టుకోలేకపోయాం. అందుకే చంపేశాం" అని చెబుతున్నారు. అయితే ఎవరూ ఈ హత్య చేయించారన్న విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీళ్లు ముగ్గురూ ఈ హత్యను మతంతో ముడి పెట్టారు.
"మేం చేసింది ధర్మమే. అన్యాయాన్ని అంతం చేశాం. దీనిపై మాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. మమ్మల్ని ఉరి తీస్తారని చెప్పినా నవ్వుకుంటూ లోపలకు వెళ్లిపోతాం. మేం చేయాల్సిన పనిని పూర్తి చేశాం."
- నిందితులు
Also Read: Women Teachers Arrested: స్కూల్‌లోనే విద్యార్థులతో "ఆ పనులు", ఆరుగురు మహిళా టీచర్‌లు అరెస్ట్
Hyderabad Lady Death: బెంగళూరులో హైదరాబాద్ యువతి మృతి, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు!
Online Games Fraud: గల్ఫ్ నుంచి డబ్బు పంపిన మేనత్త, ఆన్ లైన్ గేమ్స్ ఆడి స్వాహా! భయంతో యువకుడి ఆత్మహత్య
Visakha Crime News: అనకాపల్లి జిల్లాలో మద్యం వ్యాన్ బోల్తా, బీర్ బాటిళ్ళ కోసం పోటీపడ్డ జనం
NCB Biggest Drug Seizure: అతి భారీ స్థాయిలో 15 వేల ఎల్ఎస్‌డీ బ్లాట్స్ పట్టివేత- క్రిప్టోకరెన్సీ, డార్క్ వెబ్ ద్వారా లావాదేవీ
Vemulavada Crime News: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తురాలు మృతి - గుండెపోటే కారణం
Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్- హడలిపోయిన అధికారయంత్రాంగం!
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?