News
News
వీడియోలు ఆటలు
X

Women Teachers Arrested: స్కూల్‌లోనే విద్యార్థులతో "ఆ పనులు", ఆరుగురు మహిళా టీచర్‌లు అరెస్ట్

Women Teachers Arrested: అమెరికాలో విద్యార్థులతో పాడు పనులు చేసిన మహిళా టీచర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

FOLLOW US: 
Share:

Women Teachers Arrested:  

అమెరికాలో వరుసగా ఘటనలు..

అమెరికాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రెండ్రోజుల వ్యవధిలోనే ఆరుగురు మహిళా టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల విద్యార్థులతో శృంగారంలో పాల్గొన్న కేసులో అదుపులోకి తీసుకున్నారు. థర్డ్ డిగ్రీ రేప్‌ కింద వాళ్లపై కేసు నమోదు చేశారు. వీరిలో ఓ టీచర్ ఇద్దరు విద్యార్థులతో దాదాపు మూడు సార్లు శృంగారంలో పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎలెన్ షెల్ అనే 38 ఏళ్ల మహిళ ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో టీచర్‌గా పని చేసింది. ఆ తరవాత మరో ఎలిమెంటరీ స్కూల్‌లో చేరింది. ఇక్కడి విద్యార్థులతోనే ఆ పని చేసినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే తల్లిదండ్రులను అలెర్ట్ చేసిన అధికారులు టీచర్లను అరెస్ట్ చేస్తున్నట్టు లెటర్ పంపారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఓ మహిళా ఎడ్యుకేటర్ విద్యార్థిపై ఫస్ట్ డిగ్రీ రేప్‌కు పాల్పడింది. ఈమెనూ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఓ 15 ఏళ్ల అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న లేడీ టీచర్‌ని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ బిల్డింగ్‌లోనే కొన్ని సార్లు శృంగారం చేసినట్టు తెలుస్తోంది. స్నాప్‌చాట్‌లో తరచూ ఇద్దరూ మాట్లాడుకునే వాళ్లు. మరోచోట ఇంగ్లీష్ టీచర్ ఓ టీనేజ్ కుర్రాడితో స్కూల్‌లోనే సెక్స్ చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ పోస్ట్ వెల్లడించింది. ఇలా చాలా చోట్ల విద్యార్థులతో మహిళా టీచర్‌లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు అమెరికా అంతటా సంచలనం సృష్టిస్తున్నాయి. 

గతంలోనూ..

అమెరికాలోనూ కాదు. ఇండియాలోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌లో ఓ టీచర్ స్టూడెంట్‌తో ప్రేమాయణం నడిపిన వ్యవహారం సంచలనమైంది. హైదరాబాద్  చందానగర్ లో స్కూల్ విద్యార్థితో టీచర్ ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థితో అదే స్కూల్ లో టీచర్ గా విధుల నిర్వహిస్తున్న యువతి ప్రేమాయణం నడిపింది. 27 సంవత్సరాల స్కూల్ టీచర్ పదో తరగతి చదువుతున్న విద్యార్థితో ప్రేమించినట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి టీచర్, విద్యార్థి అదృశ్యమయ్యారు. మైనర్ అయిన తమ కుమారుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిందని  టీచర్ పై విద్యార్థి తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ యువతి తల్లిదండ్రులు కూడా చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చందానగర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లలో ఇద్దరిపై మిస్సింగ్ కేసు నమోదు అయింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరినీ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.  ఏడాదిగా టీచర్, విద్యార్థి మధ్య ప్రేమాయణం నడుస్తోందని పోలీసులు చెప్పారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే ఇలా దారి తప్పి పిల్లల్నీ తప్పుదోవ పట్టిస్తుండటం తల్లిదండ్రులను కలవర పెడుతోంది. 

Also Read: Atiq, Ashraf Shot Dead: అతిక్, అష్రఫ్ హత్యపై రిపోర్ట్ - హోం శాఖకు పంపిన యూపీ సర్కార్

Published at : 16 Apr 2023 12:57 PM (IST) Tags: USA Women Teachers Arrested Female Teachers Arrested Misconduct

సంబంధిత కథనాలు

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు

Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు

Gangster Shot Dead: కోర్టులోనే గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య, లాయర్ల వేషంలో వచ్చి దుండగుల కాల్పులు

Gangster Shot Dead: కోర్టులోనే గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య, లాయర్ల వేషంలో వచ్చి దుండగుల కాల్పులు

Cardiologist Death: 16 వేల హార్ట్ సర్జరీలు చేసిన కార్డియాలజిస్ట్‌కి గుండెపోటు, నిద్రలోనే మృతి

Cardiologist Death: 16 వేల హార్ట్ సర్జరీలు చేసిన కార్డియాలజిస్ట్‌కి గుండెపోటు, నిద్రలోనే మృతి

స్వీట్‌లు, కేక్‌లు ఇష్టంగా తినేవారికి హెచ్చరిక- హైదరాబాద్‌లో నకిలీ దందా గుట్టురట్టు

స్వీట్‌లు, కేక్‌లు ఇష్టంగా తినేవారికి హెచ్చరిక- హైదరాబాద్‌లో నకిలీ దందా గుట్టురట్టు

టాప్ స్టోరీస్

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!