(Source: ECI | ABP NEWS)
Andhra Techie: మైనర్ శృంగారానికి పిలిచిందని వెళ్లాడు - కానీ అమెరికా పోలీసుల ట్రాప్ - ఏపీ టెకీకి జైలు!
US telugu Techie: ఆన్ లైన్ ఓ అమ్మాయి కలిసింది. తాను మైనర్‌నని చెప్పింది. శృంగారానికి సిద్ధమన్నది. ఆ తెలుగు యువకుడు అక్కడే దొరికిపోయాడు.

Andhra Techie Arrested in US: విజయవాడకు చెందిన నల్లా లిఖిత్ అనే వ్యక్తిని అమెరికాలోని ఒహియో రాష్ట్రం, సిన్సినాటి నగరంలో పోలీసులు అరెస్టు చేశారు. 15 ఏళ్ల బాలిక అని భావించిన వ్యక్తితో లైంగిక చర్యకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిఖిత్‌ను సెప్టెంబర్ 26న హామిల్టన్ కౌంటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఇంపోర్ట్యూనింగ్ (మైనర్‌తో లైంగిక చర్యకు సంబంధించిన నేరం) ఆరోపణలు నమోదయ్యాయి. అతను ప్రస్తుతం 20,000 డాలర్ల బాండ్‌పై ఉన్నాడు. విడుదల కోసం 2,000 డాలర్లు చెల్లించాల్సి ఉంది. బెయిల్ మంజూరైతే, అతను ఎలక్ట్రానిక్ యాంకిల్ మానిటర్ ధరించాలని కోర్టు ఆదేశించింది.
Yet another Indian NRI Dudebro caught doing the sort of things that our Dudebros have become notorious for!
— 𝔻𝕙𝕒𝕣𝕞𝕒𝕒 (@KaleshiBua) October 5, 2025
24 year old Nikhith Nalla has been arrested for attempting to approach a 13 year old minor girl for sex. pic.twitter.com/LdOvQvql8q
కోర్టు రికార్డుల ప్రకారం, లిఖిత్ 15 ఏళ్ల బాలికగా నటించిన సీక్రెట్ పోలీసు అధికారితో ఆన్‌లైన్‌లో సంభాషించాడు. ఈ సంభాషణలో అతను ఆ "బాలిక"కు లైంగిక చర్య కోసం 100 డాలర్లు ఆఫర్ చేశాడు. ఆ తర్వాత, అధికారి అతనిని కలవడానికి ఏర్పాటు చేసి, అరెస్టు చేశారు. ఒహియో చట్టం ప్రకారం, ఇంపోర్ట్యూనింగ్ అనేది ఫెలోనీ నేరం, ఇది మైనర్ లేదా పెద్దవారితో లైంగిక సంబంధాల కోసం డబ్బు ఆఫర్ చేయడాన్ని నేరంగా చూపిసతుంది.
🚨 Update on Likhith Nalla Case
— KumarXclusive (@KumarXclusive) October 5, 2025
24-year-old Likhith Nalla was arrested in Cincinnati / Hamilton County, accused of soliciting an undercover officer he believed to be 15, and offering $100 for sex.
Charges: importuning + possession of criminal tools. Bond set at $20,000 (or… pic.twitter.com/WBxdRCUuNx
లిఖిత్ యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్, స్ప్రింగ్‌ఫీల్డ్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలోని SRM యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అరెస్టు సమయంలో అతను అమెరికా ఆధారిత కంపెనీలో సీనియర్ డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు అతని ఆన్‌లైన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు తెలుగు యువకులు ట్రాప్‌లో పడితే ఇలాగే ఉంటుందని .. జాగ్ర్తతగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.





















