Andhra Pradesh Viral Accident: మందుబాబు అంటే వీడే-రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొట్టింది కాక రచ్చరచ్చ చేశాడు !
Drunk driver: ఫుల్లుగా తాగాడు. ఎదురు లేదనుని రాంగ్ రూట్‌లో వెళ్లాడు.కానీ ఎదురొచ్చిన కారును ఢీకొట్టేశారు. ఆ తర్వాతే అసలు సినిమా స్టార్ట్ చేశాడు.

Drunk driver Road Accident: అసలే మందు బాబు ఆ పైన కిక్కు మీద ఉన్నాడు అంటే.. ఇక కంగారు పడాల్సిందే. అలాంటితదే ఏపీలో జరిగింది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా చొప్పళ్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం డకిదింజియ మద్యం సేవించి రాంగ్ రూటులో బైక్ పై వేగంగా వచ్చి కారును ఢీకొన్న యువకుడు ..ఎగిరి కారు బానెట్ పడ్డాడు. అయితే అక్కడ్నుంచి దిగలేదు. కావాల్సినంత రచ్చ చేశాడు.
Konaseema Dist, A.P NH216 🚨 ⚠️
— Dave (Road Safety: City & Highways) (@motordave2) October 5, 2025
“Whiskey is Risky” 🥃
- Drunk Rider (6 Peg?)
- Wrong Side Riding
- HeadON with Alto
- Rider landed on Alto’s Roof@DriveSmart_IN @dabir @kirankumargoli @InfraEye
pic.twitter.com/RzDyw7EoqI
అతను పూర్తిగా మైకంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడో.. ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని స్థితిలో బైక్ పై రోడ్డు మీదకు వచ్చాడు. కారును ఢీకొట్టిన తర్వాత బోనెట్ మీద పడి అక్కడే కూర్చుని, చుట్టూ ఉన్నవారితో ఏదేదో మాట్లాడటం ప్రారంభించాడు. ఈ వ్యక్తి చేసిన పని వల్ల రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
View this post on Instagram
చుట్టూ ఉన్నవారు అతన్ని కారు మీద నుంచి దిగమని అనేకసార్లు చెప్పినా అతడు పట్టించుకోలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొంతసేపటికి స్థానిక పోలీసులు స్థలానికి చేరుకుని, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.





















