Anantapur Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కూలీలతో వెళ్తోన్న ఆటోను ఢీకొన్న లారీ... రెండు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి
అనంతపురం జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు. పామిడిలో కూలీలతో వెళ్తోన్న ఆటోను లారీ ఢీకొట్టింది. మిడుతూరులో ఇద్దరు పాదచారులపైకి కారు ఢీకొట్టింది.
అనంతపురం జిల్లాలో రోడ్డు నెత్తురోడింది. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతిచెందారు. పామిడి శివారులో పనికోసం వెళ్తోన్న కూలీల ఆటోను లారీ ఢీట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఎనిమిది మందికి గాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన శంకరమ్మ, నాగవేణి, చిట్టెమ్మ(35), సుబ్బమ్మ(45), సావిత్రి(40)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన సమాచారం అందుకున్న సింగనమల నియోజకవర్గ వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలో ఐదుగురు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు వెల్లడించారు. ఆటో డ్రైవర్ రాంగ్ రూట్లో వెళ్లడం వెళ్తుండడం వల్లే ప్రమాదం జరిగిందని తాడిపత్రి డీఎస్పీ చైతన్య చెప్పారు.
Also Read: పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడు.. నచ్చలేదన్న యువతి, ఇంటికొచ్చాక భారీ షాక్
మరో ప్రమాదంలో ఇద్దరు మృతి
జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద జాతీయ రహదారిపై కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో యాకోబ్(62), నారాయణ(60) అనే వ్యక్తులు మృతిచెందారు. సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్న వీరిద్దరూ విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని డీఎస్పీ చైతన్య తెలిపారు.
Also Read: రోకలి బండతో కొట్టి భర్తను చంపిన భార్య.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి..
గవర్నర్, చంద్రబాబు దిగ్భ్రాంతి
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పామిడిలో కూలీలు, మిడుతూరులో ఇద్దరు పాదాచారులను చనిపోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.
Also Read: కాబోయే ఎన్నారై భర్త పాడుపని.. న్యూడ్ వీడియో కాల్స్, సూసైడ్ చేసుకున్న యువతి
Also Read: రూమ్ నెం.308 మిస్టరీ.. శృంగారంలో అపశృతి.. ప్రధాని క్షమాపణలు, అసలేం జరిగింది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి