By: ABP Desam | Updated at : 05 Nov 2021 01:52 PM (IST)
Edited By: Venkateshk
నిందితుడు కార్తీక్ (ఫైల్ ఫోటో)
ఎన్నారై సంబంధాల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో చాటే ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నిశ్చితార్థం జరిగిన అనంతరం యువకుడు ప్రవర్తించిన తీరును తట్టుకోలేక యువతి తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఎవరికి చెప్పుకోవాలో పాలుపోక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు అందడంతో వారు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటికి వచ్చింది. నిశ్చితార్థం జరిగిన అనంతరం యువకుడు యువతిని లొంగదీసుకొని, తద్వారా ఎలా బెదిరింపులకు పాల్పడ్డాడనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాలివీ..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ఓ యువతికి తల్లిదండ్రులు అమెరికా పెళ్లి సంబంధం చూశారు. ఆ పెళ్లి విఫలం కావడంతో యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పెండ్యాలకు చెందిన యువతికి.. పక్కనే ఉన్న గ్రామం అమీర్‌పేటకు చెందిన కార్తీక్‌తో గతేడాది పెళ్లి కుదిర్చారు. ఆ వెంటనే నిశ్చితార్థం కూడా జరిగింది. కొద్ది రోజులకు పెళ్లి జరిగేలోపే ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో వారి పెళ్లి కూడా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 17న పెళ్లి జరగాల్సి ఉంది.
Also Read: Anantapur: రోకలి బండతో కొట్టి భర్తను చంపిన భార్య.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి..
ఈలోపు యువకుడు కాస్త అతిగా ప్రవర్తించాడు. కాబోయే భార్యాభర్తలనే ఉద్దేశంతో ఇద్దరు చనువుగా మెలిగారు. యువతితో కలిసి వాట్సాప్‌లో నగ్నంగా మాట్లాడాలని బలవతంగా చేయగా.. యువతి కూడా ఒప్పుకుంది. ఇద్దరు నగ్నంగా మాట్లాడుకోగా.. కార్తీక్ తన ఫోన్‌లో మొత్తం రికార్డు చేసుకున్నాడు. చివరికి కట్నకానుకల విషయంలో తేడా వచ్చి రెండు కుటుంబాల వారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. కానీ, కార్తీక్ వద్ద ఆ నగ్న దృశ్యాలు ఉండటంతో ఆయన కట్నం కోసం వాటిని అడ్డం పెట్టుకొని బెదిరించాడు.
Also Read: Hyderabad: పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడు.. నచ్చలేదన్న యువతి, ఇంటికొచ్చాక భారీ షాక్
కట్నం అడిగినంత ఇవ్వకపోతే ఆన్‌లైన్‌లో వాటిని పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ కారణంగానే వివాహం రద్దయినట్లుగా తెలుస్తోంది. చివరికి అవమానం తట్టుకోలేక యువతి గత నెల 19న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని యువతిని అరెస్టు చేశారు. సెక్షన్ 306 కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: CID Murders : ముసలామెను చంపి డబ్బు, నగలు దోచుకెళ్లిన మైనర్లు ! ఈ నేరం నేర్పింది ఆ టీవీ షోనే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్‌డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
Maharashtra News : భార్యకు చీర ఆరేయడం రాదని భర్త ఆత్మహత్య, సూసైడ్ కు కారణాలు చూసి పోలీసులు షాక్
Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మిత్రులు సజీవదహనం
Palnadu Students Fight : అచ్చంపేట వర్సెస్ క్రోసూరు స్టూడెంట్స్ - పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థుల గ్యాంగ్ వార్ !
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్
AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు
Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?