అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Kakinada Crime: అసలే మద్యానికి బానిస, ఆపై కన్న కూతురిపై అఘాయిత్యం - తల్లికి తెలియడంతో షాక్!
కన్న కూతురనే కనికరం కూడా లేకుండా మృగంలా ప్రవర్తించిన ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు.. కాకినాడ జిల్లాలో వెలుగు చూసిన ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
సమాజంలో అమానవీయ సంఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. కన్న కూతురనే కనికరం కూడా లేకుండా మృగంలా ప్రవర్తించిన ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కన్న కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. కాకినాడ జిల్లాలో వెలుగు చూసిన ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కాకినాడ జిల్లా దుమ్ములపేటలో వెలుగు చూసిన ఈ సంఘటన కన్న తల్లి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. దుమ్ముల పేటకు చెందిన తిరిది రాము(40), జయమ్మకు చాలా ఏళ్ల కిందటే వివాహామైంది. వీరికి 15, 10 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన రాము ఎటువంటి పనులకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటున్నాడు. దీంతో భార్య జయమ్మ చేపలు అమ్మి జీవనం సాగిస్తొంది. కుటుంబ బాధ్యతలు జయమ్మ మోస్తుండగా.. భార్య తెచ్చే సొమ్ముతో రోజు తాగుతుండేవాడు రాము. భర్త నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం లేకపోవడం, ఒక్కరే కుటుంబాన్ని పోషిస్తూ ఉండడంతో ఆర్ధిక ఇబ్బందులతో ఇల్లు గడవడం కష్టమైంది. దీంతో ఇద్దరు ఆడ పిల్లలను ఉప్పాడలోని తల్లి ఇంటి వద్ద ఉంచి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. వేసవి సెలవులు కావడంతో గురువారం పిల్లలు తమ ఇంటికి వచ్చారు. ఎప్పటిలానే .. చేపలు అమ్మడానికి తల్లి జయమ్మ వెళ్లిపోయింది. సొంత ఇంటికి ఎంతో ఆనందంగా వచ్చిన పెద్ద కూతురుపై కన్నేసిన తండ్రి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
భార్యను బయటికి పంపి మరీ మరోసారి అఘాయిత్యం...
భార్య ఇంట్లో లేని సమయంలో అదను చూసి పెద్ద కుమార్తె పై తండ్రి మరో సారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో భార్యను పని మీద బయటకు పంపి మరోసారి అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా బెదిరింపులకు దిగాడు. అఘాయిత్యానికి పాల్పడిన విషయం తల్లితో చెబితే చంపేస్తానని కూతుర్ని బెదిరించాడు. కుమార్తె పరిస్థితి చూసిన జయమ్మకు అనుమానం వచ్చి అడిగితే పెద్ద కుమార్తె కన్న తండ్రి చేసిన దారుణాన్ని బోరున ఏడుస్తూ తల్లికి తన బాధను చెప్పుకుంది. జరిగిన దారుణాన్ని తల్లి జీర్ణించుకోలేకపోయింది. ఆపై భర్తను ఆమె నిలదీసింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించి ఇంటిలో ఉన్న వస్తువులు, బట్టలు అన్నింటినీ నిప్పు పెట్టి కాల్చి వేశాడు. దీంతో భయబ్రాంతులకు గురైన ఆమె కూతురిని తీసుకుని కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన డిఎస్‌పి మురళీ మోహన్ విచారణ చేపట్టారు. బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement