అన్వేషించండి

Reliance SBI Card: రిలయన్స్‌, ఎస్‌బీఐ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌ - వెల్‌కమ్‌ ఓచర్‌ సహా చాలా స్పెషల్‌ బెనిఫిట్స్‌

అన్ని రిలయన్స్‌ రిటైల్‌ ఔట్‌లెట్లలో చేసే కొనుగోళ్లపై రివార్డులు పొందొచ్చు.

Reliance SBI Credit Card: దేశంలోని అతి పెద్ద ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ కంపెనీ SBI కార్డ్‌, దేశంలోని అతి పెద్ద రిటైల్ ప్లేయర్ రిలయన్స్ రిటైల్ జట్టు కట్టాయి, కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్‌ కార్డ్‌ను లాంచ్‌ చేశాయి. దీనిని రిలయన్స్-ఎస్‌బీఐ కార్డ్‌గా పిలుస్తున్నారు. ఇది, లైఫ్‌ స్టైల్‌-ఫోకస్డ్‌ క్రెడిట్ కార్డ్. కస్టమర్‌ చేసే విభిన్న రకాల షాపింగ్‌ అవసరాల్లో ఇది ఉపయోగపడుతుంది.

రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్‌తో జరిపే లావాదేవీల్లో యూజర్‌ చాలా రకాల రివార్స్‌, బెనిఫిట్స్‌ అందుకోవచ్చు. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌ నుంచి రిటైల్ వరకు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ నుంచి ఫార్మా వరకు, ఫర్నీచర్ నుంచి ఆభరణాల వరకు చాలా లావాదేవీల్లో ఈ బెనిఫిట్స్‌ వర్తిస్తాయి. అంతేకాదు, రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ వినియోగదార్లు SBI కార్డ్ అందించే ఆఫర్లను కూడా ఎప్పటికప్పుడు ఎంజాయ్‌ చేయవచ్చు. అన్ని రిలయన్స్‌ రిటైల్‌ ఔట్‌లెట్లలో చేసే కొనుగోళ్లపై రివార్డులు పొందొచ్చు. 

రెండు ఇండస్ట్రీ లీడర్స్‌ కుదుర్చుకున్న ఈ ఒప్పందం మార్కెట్‌లో చాలా ఆసక్తిని కలిగిస్తోంది. SBI కార్డ్ విస్తృతమైన యూజర్‌ బేస్‌ను, రిలయన్స్ స్టోర్లను ప్రభావితం చేయడం ఈ ఒప్పందం లక్ష్యం. 

రిలయన్స్ SBI కార్డ్‌ రెండు రకాలు
రిలయన్స్ SBI కార్డ్, రిలయన్స్ SBI కార్డ్ ప్రైమ్ పేరితో రెండు రకాల కో-బ్రాండెడ్ కార్డులను లాంచ్‌ చేశారు. వీటిని రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ఈ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌లు రూపే నెట్‌వర్క్‌పై పని చేస్తాయి. కాబట్టి, వాటిని UPIకి లింక్‌ చేసుకోవచ్చు.

కార్డ్‌ జాయినింగ్‌ ఫీజ్‌, యాన్యువల్‌ ఛార్జీలు
రిలయన్స్ SBI కార్డ్ జాయినింగ్‌ ఫీజుగా రూ. 499 + GST చెల్లించాలి. అయితే, వెల్‌కమ్‌ బెనిఫిట్‌ రూపంలో ఈ డబ్బును వెనక్కు ఇస్తున్నారు. వెల్‌కమ్‌ బెన్‌ఫిట్‌ కింద 500 రూపాయల విలువైన రిలయన్స్‌ రిటైల్‌ ఓచర్‌ అందుతుంది. ఈ కార్డుతో చేసే కొనుగోళ్ల విలువ ఒక సంవత్సరంలో లక్ష రూపాయలు దాటితే, మరుసటి ఏడాది ఫీజ్‌ కట్టాల్సిన అవసరం ఉండదు. రిలయన్స్‌ స్టోర్లతో ఈ కార్డుతో చేసే ప్రతి 100 రూపాయల కొనుగోలుకు 5 రివార్డు పాయింట్లు యాడ్‌ అవుతాయి.  ఒక రివార్డు పాయింటు 25 పైసలకు సమానం. ట్రెండ్స్‌, అజియో, సెంట్రో, జివామె, అర్బన్‌ లేడర్‌, జియో మార్ట్‌లో కొంటే 5 శాతం డిస్కౌంట్‌ వస్తుంది. 

రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్‌ కోసం జాయినింగ్‌ ఫీజుగా రూ. 2999 + GST కట్టాలి.  వెల్‌కమ్‌ బెన్‌ఫిట్‌ కింద 3000 వేల రూపాయల విలువైన రిలయన్స్‌ రిటైల్‌ ఓచర్‌ ఇస్తారు. ఈ కార్డుతో చేసే కొనుగోళ్ల విలువ ఒక సంవత్సరంలో 3 లక్షల రూపాయలు దాటితే తర్వాతి ఏడాదికి యాన్యువల్‌ ఫీజ్‌ ఉండదు. ఈ కార్డ్‌తో రిలయన్స్‌ స్టోర్లలో చేసే ప్రతి 100 రూపాయల కొనుగోలుపై 10 రివార్డు పాయింట్లు లభిస్తాయి. 

ఇతర ప్రయోజనాలు
రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్‌తో బుక్‌మైషోలో ప్రతి నెలా రూ.250 విలువ చేసే మూవీ టికెట్‌ను ఉచితంగా పొందొచ్చు. దేశీయ విమానాశ్రయాల్లో ఏడాదిలో 8 కాంప్లిమెంటరీ లాంజ్‌ యాక్సెస్‌లు (త్రైమాసికానికి రెండు చొప్పున) ఉంటాయి. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుల్లో 4 కాంప్లిమెంటరీ లాంజ్‌ యాక్సెస్‌లు (త్రైమాసికంలో గరిష్టంగా రెండు) లభిస్తాయి.

ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు
రిలయన్స్ SBI కార్డ్‌తో అన్ని పెట్రోల్ బంకుల్లో 1 శాతం ఫ్యూయల్‌ సర్‌ఛార్జ్‌ మినహాయింపు లభిస్తుంది. అయితే, పెట్రోల్ బంక్‌లో చేసే ఖర్చు రూ. 500 నుంచి రూ. 4000 మధ్య ఉండాలి. 

మరో ఆసక్తికర కథనం: ఈ నెల నుంచి కొత్త రూల్స్‌ - వీటి గురించి ముందే తెలుసుకుంటే మీ డబ్బు సేఫ్‌!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget