![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
New Rules from November: ఈ నెల నుంచి కొత్త రూల్స్ - వీటి గురించి ముందే తెలుసుకుంటే మీ డబ్బు సేఫ్!
ఈ రోజు నుంచి దేశంలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 103.50 రూపాయలు చొప్పున పెరిగింది.
![New Rules from November: ఈ నెల నుంచి కొత్త రూల్స్ - వీటి గురించి ముందే తెలుసుకుంటే మీ డబ్బు సేఫ్! From LPG price to ATF price bank holidays these money rule changes will affect you from 1 november 2023 know new rules New Rules from November: ఈ నెల నుంచి కొత్త రూల్స్ - వీటి గురించి ముందే తెలుసుకుంటే మీ డబ్బు సేఫ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/3697a0a196a85ea6da151cb4bedb017f1698819268021545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Money Rules Changed from 1 November 2023: ఈ రోజు నుంచి కొత్త నెల ప్రారంభమైంది. క్యాలెండర్‌లో నెల మారగానే దేశంలోనూ కొన్ని రూల్స్ మారుతుంటాయి. నవంబర్ నెలలోనూ కొన్ని ఛేంజెస్ వచ్చాయి. ప్రస్తుతం భారత్‌లో ఫెస్టివ్ సీజన్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం/బ్యాంకులు/లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటివి తీసుకున్న నిర్ణయాలు మీ ఇంటి బడ్జెట్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి.
సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మార్పులు:
1. పెరిగిన LPG సిలిండర్ రేటు
ఈ రోజు నుంచి దేశంలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 103.50 రూపాయలు చొప్పున పెరిగింది. దీనివల్ల, ఈ పండుగ సీజన్‌లో బయటి ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి, దిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధర 1,833 రూపాయలు, ముంబైలో 1,785.50 రూపాయలు, కోల్‌కతాలో 1,943 రూపాయలు, చెన్నైలో 1,999.50 రూపాయలు, హైదరాబాద్‌లో 1,863.50 రూపాయలు, విజయవాడలో 1,796 రూపాయల వద్దకు చేరింది. ఇళ్లలో వంటకు ఉపయోగించే డొమెస్టిక్ LPG ధర మారలేదు, పాత రేటునే OMCలు కొనసాగించాయి. 14 కిలోల గ్యాస్ సిలిండర్ హైదరాబాద్‌లో రూ.955, విజయవాడలో రూ.944.50 గా ఉంది.
2. ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ఛార్జీలు పెంపు
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీల రుసుములు పెంచుతున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) అక్టోబరు 20న ప్రకటించింది. S&P BSE సెన్సెక్స్ ఫ్యూచర్స్ & ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసే పెట్టుబడిదార్లపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది.
3. ల్యాప్‌టాప్ దిగుమతి గడువు
HSN 8741 కేటగిరీ కింద ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 31, 2023 వరకు మినహాయింపు ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.
4. ల్యాప్ అయిన LIC పాలసీ రీ-ఓపెన్
మీ ఎల్‌ఐసీ పాలసీ ల్యాప్ అయితే, దాని పునఃప్రారంభానికి (Reopen lapsed LIC policy) చివరి తేదీ 31 అక్టోబర్ 2023తో ముగిసింది. లాస్ట్ డేట్‌ను పెంచుతూ ఈ రోజు కొత్త ప్రకటన రాకపోతే, లాప్స్ అయిన ఎల్‌ఐసీ పాలసీని తిరిగి కంటిన్యూ చేయడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు.
5. GST రూల్స్‌లో మార్పు
రూ. 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు నవంబర్ 1, 2023 నుంచి 30 రోజుల లోపు ఇ-వాయిస్ పోర్టల్‌లో GST ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. GST అథారిటీ సెప్టెంబర్‌లో ఈ నిర్ణయం తీసుకుంది.
6. ATF రేటులో కోత
పండుగ సీజన్‌లో విమాన ఇంధనం (ATF) ధరను తగ్గించారు. రాజధాని దిల్లీలో ATF ధర కిలోలీటర్‌కు రూ. 6,854.25 తగ్గి రూ. 1,11,344.92 వద్దకు చేరింది. ముంబైలో కిలోలీటర్ రూ.1,19,884.45, కోల్‌కతాలో రూ.1,04,121.89, చెన్నైలో కిలోలీటర్ రూ.1,15,378.97కు లభిస్తోంది.
మరో ఆసక్తికర కథనం: మరింత తగ్గిన పసిడి వెలుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)