అన్వేషించండి

దేశంలోనే అత్యంత చవకైన 7 సీటర్‌ కారు ధర రూ.5.76 లక్షలకు తగ్గిందోచ్‌, మీకు ఏకంగా రూ.1.08 లక్షలు ఆదా

Renault Triber Price Drop: GST 2.0 అమలు తర్వాత, రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ధర భారీగా తగ్గింది, ఇప్పుడు ₹5.76 లక్షల నుంచి ₹8.60 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

Renault Triber New Price After GST 2025: ఈ దీపావళికి మీ కుటుంబానికి 7-సీటర్‌ కారును గిఫ్ట్‌గా ఇవ్వండి, అది కూడా మీ బడ్జెట్‌లో & 5-సీటర్‌ కారు ధరలో. ఈ దీపావళి సమయంలో, రెనాల్ట్, తన ట్రైబర్‌ మీద పెద్ద డిస్కౌంట్ ఆఫర్‌లను (Renault Triber Diwali 2025 Discount offers) ప్రకటించింది. ఈ ఆఫర్లను మీరు సద్వినియోగం చేసుకుంటే ₹1.08 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

జులైలో రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ అయింది. అయిేత, ఫేస్‌లిఫ్ట్‌ వచ్చిన తర్వాత కూడా, దేశవ్యాప్తంగా చాలా డీలర్‌షిప్‌ల వద్ద ఇప్పటికీ ప్రి-ఫేస్‌లిఫ్ట్ MY2025 మోడల్‌ స్టాక్ ఉండిపోయింది. ఆ పాత స్టాక్‌ను అమ్మేయాడనికి, కంపెనీ, రెనాల్ట్‌ కార్లపై ₹1.08 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు & కార్పొరేట్ ఆఫర్‌లు ఉన్నాయి. 

పాత మోడల్‌ వద్దనుకుంటే, రెనాల్ట్ ట్రైబర్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా తగ్గింపు ధరల్లో మీరు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ కొనేవాళ్లకు మొత్తం ₹73,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. GST 2.0 అమలు తర్వాత, తెలుగు రాష్ట్రాల్లో రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు ₹5.76 లక్షల నుంచి ₹8.60 లక్షల వరకు (Renault Triber ex-showroom price, Hyderabad Vijayawada) ఉంది. ఇప్పుడు 5-సీటర్లు కూడా ఇంతకంటే ఎక్కువ రేటే పలుకుతున్నాయి. 

Also Read: ఈ దీపావళికి ఏ కారు కొనడం ట్రెండీగా ఉంటుంది? ధర, ఫీచర్లు వివరాలు ఇవిగో!

ఆన్‌-రోడ్‌ ధర
హైదరాబాద్‌లో మీరు రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ బేస్‌ వెర్షన్‌ కొనాలని భావిస్తే, ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 5,76,300, రిజిస్ట్రేషన్ రూ. 85,682, బీమా రూ. 29,212, ఇతర ఖర్చులు రూ. 500 అవుతాయి. మొత్తంగా, ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 6.92 లక్షలు (Renault Triber on-road price, Hyderabad Vijayawada) అవుతుంది. స్వల్ప భేదంతో, విజయవాడ సహా అన్ని తెలుగు నగరాల్లోనూ దాదాపు ఇదే ధర అమల్లో ఉంది.

రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్లు & పవర్‌ట్రెయిన్ 
7-సీటర్ అయినప్పటికీ, రెనాల్ట్ ట్రైబర్ కాంపాక్ట్ సైజును కలిగి ఉంది, సిటీ & హైవే వినియోగానికి అనువుగా ఉంటుంది. సీట్లను మడతపెట్టినప్పుడు ఇది 625 లీటర్ల వరకు బూట్ స్పేస్‌ అందిస్తుంది. ట్రైబర్ ఇంటీరియర్‌లో కొత్త డ్యూయల్-టోన్ థీమ్, మెరుగైన మెటీరియల్ ఫినిషింగ్స్‌ & కొన్ని మోడ్రన్‌ ఫీచర్‌లు సహా చాలా అప్‌డేట్స్‌ వచ్చాయి. 

రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌ మెకానికల్ సెటప్‌లో పెద్ద మార్పులు లేవు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అదే 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది పని చేస్తుంది. ఈ ఇంజిన్ సుమారుగా 72 bhp & 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్ & AMT ట్రాన్స్‌మిషన్‌లు ఉన్నాయి. పెద్ద కుటుంబం కోసం బడ్జెట్-ఫ్రెండ్లీ 7-సీటర్ కోసం చూస్తున్న కస్టమర్‌లకు రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌ అనువైనది.

Also Read: షోరూముల్లో దుమ్ము కొట్టుకుపోతున్న కొత్త కార్లు, ఒక్క బయ్యర్‌ కూడా దొరకలేదు - ఇవిగో ఆ మోడళ్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
Mega Victory Mass Song : మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
Advertisement

వీడియోలు

Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్‌ స్కోరర్‌గా గిల్
Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్‌ ముందు అభిషేక్ విధ్వంసం
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
Mega Victory Mass Song : మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
C M Nandini: బెంగళూరులో సీరియల్ నటి నందిని ఆత్మహత్య - ఆమె డైరీలో ఉన్న వాటితో సినిమానే తీయవచ్చు !
బెంగళూరులో సీరియల్ నటి నందిని ఆత్మహత్య - ఆమె డైరీలో ఉన్న వాటితో సినిమానే తీయవచ్చు !
Mohan lal : మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
Mysore: ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
Embed widget