తగ్గిన GSTతో ఈ దీపావళికి Hyundai Creta రేటు దిగొచ్చింది - ఇప్పుడు కేవలం ₹10.72 లక్షల నుంచి ప్రారంభం
Hyundai Creta Rival Cars: హ్యుందాయ్ క్రెటా, భారత మార్కెట్లో కియా సెల్టోస్, మారుతి సుజుకి విక్టోరియాస్, టయోటా హైరైడర్ & హోండా ఎలివేట్ వంటి కార్లతో పోటీ పడుతుంది.

Hyundai Creta New Prioce 2025 After GST Cut: హ్యుందాయ్ ఫ్లాగ్‌షిప్ SUV, క్రెటా, గత నెల (సెప్టెంబర్ 2025) లో 18,861 యూనిట్లను అమ్మింది. ఇది, ఏడాది క్రితం ఇదే కాలం (సెప్టెంబర్ 2024) తో పోలిస్తే 2,959 యూనిట్లు ఎక్కువ. GST తగ్గింపు తర్వాత, తెలుగు రాష్ట్రాల్లో, హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు కేవలం ₹10,72,589 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు (Hyundai Creta ex-showroom price, Hyderabad Vijayawada) అందుబాటులో ఉంది, ఇది కొత్త కస్టమర్లకు మరింత ఆకర్షణీయంగా మారింది.
క్రెటా ఆన్-రోడ్ ధర
ఆంధ్రప్రదేశ్ &తెలంగాణలో, హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹10,72,589 కాగా; ఈ కారును కొనేవాళ్లు రిజిస్ట్రేషన్ కోసం దాదాపు ₹2,02,000, బీమా కోసం దాదాపు ₹54,000, ఇతర అవసరమైన ఖర్చులు చెల్లించాలి. ఈ మొత్తాలన్నీ కలుపుకుని, హ్యుందాయ్ ఆన్-రోడ్ ధర దాదాపు ₹13.39 లక్షలు (Hyundai Creta on-road price, Hyderabad Vijayawada) అవుతుంది.
హ్యుందాయ్ క్రెటా ఫీచర్లు
హ్యుందాయ్ క్రెటాలో ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, బోస్ 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ AC, వైర్‌లెస్ ఛార్జింగ్ & కీలెస్ ఎంట్రీ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కారులో ప్రయాణించే వారి భద్రత కోసం క్రెటా ఆరు ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా & లెవల్-2 ADAS సూట్‌తో వచ్చిది. ఇంకా, ఈ SUV లీటరుకు 21 km వరకు మైలేజీని అందించగలదు, ఈ సెగ్మెంట్‌లో ఇది మంచి మైలేజ్.
హ్యుందాయ్ క్రెటా ఏ కార్లతో పోటీ పడుతుంది?
మన మార్కెట్లో - Kia Seltos, Maruti Suzuki Victorious, Toyota Hyryder, Honda Elevate, MG Astor & Nissan లో రాబోయే కొత్త SUV లతో సహా పాపులర్ ఎస్‌యూవీలతో హ్యుందాయ్ క్రెటా పోటీ పడుతోంది. GST 2.0 తగ్గింపు ద్వారా Kia Seltos కూడా ప్రత్యక్షంగా ప్రభావితమైంది, దీని ధర ₹39,624 నుంచి ₹75,371 వరకు తగ్గింది. ముఖ్యంగా X-Line వేరియంట్ సుమారు 3.67% చౌకగా మారింది, ఇది వినియోగదారులకు చాలా డబ్బు సేవ్ చేస్తోంది.
GST 2025 తగ్గుదల & పండుగ సీజన్ కారణంగా, 2025 సెప్టెంబర్ నెల Hyundai India కు ఎప్పటికీ మరిచిపోలేని రికార్డ్ మంత్‌గా నిలిచింది. క్రెటా సెప్టెంబర్ సేల్స్ కంపెనీకి కొత్త బలాన్ని అందించాయి, ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. GST తగ్గింపు వల్ల కొత్త కారు కొనుగోలు సులభం అయింది. ఫలితంగా... ఈ పండుగ సీజన్‌లో క్రెటా & సెల్టోస్ వంటి SUVల మధ్య పోటీ మరింత తీవ్రంగా ఉంటుంది.
"పరివర్తనాత్మక GST 2.0 సంస్కరణలను అమలు చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది లక్షలాది మంది కస్టమర్ల ఆకాంక్షలకు కొత్త రెక్కలు ఇచ్చింది. క్రెటా & వెన్యూ అసాధారణమైన పనితీరును కనబరిచాయి & ఎగుమతులు దాదాపు మూడు సంవత్సరాలలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి" అని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) హోల్ టైమ్ డైరెక్టర్ & COO తరుణ్ గార్గ్ చెప్పారు.





















