(Source: ECI | ABP NEWS)
Maruti Baleno vs Tata Altroz - ఈ దీపావళికి ఏ కారు కొనడం ట్రెండీగా ఉంటుంది? ధర, ఫీచర్లు వివరాలు ఇవిగో!
Maruti Baleno & Tata altroz ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన రెండు కార్లు. ఫీచర్లు, ఇంజిన్ & ధర పరంగా మీకు ఏ కారు బెస్టో తెలుసుకుందాం.

Maruti Baleno vs Tata Altroz Comparison: మన మార్కెట్‌లో, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో, మారుతి బాలెనో & టాటా ఆల్ట్రోజ్ అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు. Maruti Baleno & Tata Altroz మధ్య ఒక కారును ఎంపిక చేయాలంటే కాస్త కష్టమే. ఈ దీపావళికి ట్రెండీ లుక్స్, హిట్ అయిన ఫీచర్లు, ధర & భద్రతల పరంగా ఈ రెండు కార్లు కూడా ఇండియన్ యూత్‌తో పాటు కుటుంబాలకు వర్కౌట్ అవుతాయి. మారుతి బాలెనో, దాని రిఫైన్డ్ పెర్ఫార్మెన్స్ & విశ్వసనీయ బ్రాండ్ వాల్యూతో ప్రసిద్ధి చెందింది. టాటా ఆల్ట్రోజ్, దాని బలమైన డిజైన్ & సేఫ్టీ ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది.
మారుతి బాలెనో ఫీచర్లు
మారుతి బాలెనో, స్టైల్ & సౌకర్యాల గొప్ప కలయికను అందిస్తుంది. LED హెడ్‌లైట్లు, DRLs, LED టెయిల్‌ల్యాంప్‌లు, వెనుక వైపు వైపర్ & వాషర్, స్పాయిలర్ & స్కిడ్ ప్లేట్ వంటి ఎక్స్‌టర్నల్ ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. కారు లోపలి భాగంలో ఫాబ్రిక్ సీట్లు, టిల్ట్ & టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ & స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, ఫుట్‌వెల్ ఇల్యూమినేషన్, వెనుక AC వెంట్స్ & Android Auto & Apple CarPlayకి మద్దతు ఇచ్చే 22.86 cm టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఈ కారులో ఉంది.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో చాలా అప్‌డేట్స్ ఉన్నాయి, ఇవి దానిని మరింత మోడ్రన్ కారుగా మార్చాయి. కొత్తగా డిజైన్ చేసిన LED DRLs, కనెక్టెడ్ టెయిల్‌లైట్లు & 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో.. త్రీ-టోన్ డాష్‌బోర్డ్, D-కట్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ & 26.03 సెం.మీ. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ & ఎక్స్‌ప్రెస్ కూల్ AC వంటి లక్షణాలతో కూడా వస్తుంది. భద్రతా లక్షణాలలో రియర్ డీఫాగర్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు & రియర్ వైపర్ ఉన్నాయి. లక్షణాల పరంగా, ఆల్ట్రోజ్ ఇప్పుడు మునుపటి కంటే మరింత అధునాతనంగా ఉంది & బాలెనోకు గట్టి పోటీని ఇస్తుంది.
ఇంజిన్, పనితీరు & మైలేజ్
మారుతి బాలెనో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 66 kW పవర్ & 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది 57 kW పవర్ & 98.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇంధన సామర్థ్యం కలిగిన కారు, దీని పెట్రోల్ వేరియంట్‌లు 22.35 నుంచి 22.94 kmpl మైలేజీని అందిస్తాయి, CNG వేరియంట్ 30.61 km/kg మైలేజీని అందిస్తుంది.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది: పెట్రోల్, డీజిల్ & CNG. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ & CNG ఇంజిన్ వివిధ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ మాన్యువల్, AMT & 6-స్పీడ్ DCA ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల ఎంపికతో వస్తుంది. డీజిల్ & CNG వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఆల్ట్రోజ్ డీజిల్ ఇంజిన్ 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది సుదూర ప్రయాణాలకు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కోసం ARAI సర్టిఫే చేసిన మైలేజ్ 19.33 kmpl (పెట్రోల్) నుంచి 23.64 kmpl (డీజిల్) వరకు ఉంది, CNG వేరియంట్ 26.2 km/kg ని అందిస్తుంది.
ఏ కారు ధర ఎంత?
మారుతి బాలెనో ధర ₹5.99 లక్షల నుంచి ₹9.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండగా, టాటా ఆల్ట్రోజ్ ధర ₹6.30 లక్షల నుండి ₹10.51 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. బాలెనో బేస్ మోడల్ చౌకైనది. కానీ, ఆల్ట్రోజ్ ప్రీమియం ఫీచర్లు & మల్టీ ఇంజిన్ ఆప్షన్ల కారణంగా డబ్బుకు అద్భుతమైన విలువను అందిస్తుంది.





















