అన్వేషించండి

NHAI Issues Public Advisory: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త! ఆన్‌లైన్ స్కామర్ల కొత్త ఎత్తుగడలు ఇవే!

ఫాస్టాగ్ వార్షిక పాస్ సేవల పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాల పట్ల వాహనదారులను ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరించింది. అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారానే పేమెంట్స్ చేయాలని సూచించింది.

NHAI Issues Public Advisory Against Fraudulent FASTag Annual Pass Websites: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజాగా వాహనదారులకు ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ (FASTag Annual Pass) సేవల పేరుతో అమాయక వినియోగదారులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారిక పోర్టల్స్‌ను పోలి ఉండేలా వెబ్‌సైట్లను సృష్టించి, స్కామర్లు డబ్బులు కాజేస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ గుర్తించింది. ఆర్థిక నష్టాలను నివారించడానికి కేవలం ధృవీకరించబడిన మార్గాల ద్వారానే ఫాస్టాగ్ సేవలను పొందాలని అథారిటీ స్పష్టం చేసింది.

నకిలీ ఫాస్టాగ్ స్కామ్ ఎలా జరుగుతుంది?
స్కామర్లు అసలైన ఫాస్టాగ్ పోర్టల్స్‌ను తలపించేలా నకిలీ వెబ్‌సైట్లను రూపొందిస్తున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్లలో పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్స్, ఎస్‌ఈఓ (SEO) టెక్నిక్స్ ఉపయోగించి ఈ ఫేక్ సైట్లు అగ్రస్థానంలో కనిపించేలా చేస్తున్నారు. వినియోగదారులు పొరపాటున ఈ వెబ్‌సైట్లను ఓపెన్ చేయగానే మొబైల్ నంబర్, వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, పేమెంట్ సమాచారాన్ని నమోదు చేయాలని అడుగుతారు. ఆ ఇంటర్‌ఫేస్ చూడటానికి అచ్చం ప్రభుత్వం వెబ్‌సైట్‌లాగే ఉండటంతో చాలామంది నమ్ముతున్నారు. అక్కడ చెల్లింపు చేసిన వెంటనే ఆ డబ్బు మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. యూజర్లకు ఎటువంటి ఫాస్టాగ్ పాస్ జారీ కాకపోగా, ఒక్కోసారి ఫేక్ రశీదులు ఇచ్చి నమ్మిస్తున్నారు.

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ప్రభుత్వ హెచ్చరిక - సైబర్ క్రైమ్ అలర్ట్..
గతంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ మోసాలపై వాహనదారులను హెచ్చరించింది. హైవే యూజర్లను టార్గెట్ చేసేందుకు స్కామర్లు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను అడ్డం పెట్టుకుంటున్నారు. ఈ వెబ్‌సైట్లు చాలా పక్కాగా రూపొందుతుండటం వల్ల అసలైన వెబ్‌సైట్‌కు, నకిలీ దానికి మధ్య తేడాను గుర్తించడం సామాన్యులకు కష్టంగా మారుతోంది. సెర్చ్ ఇంజిన్లలో వచ్చే స్పాన్సర్డ్ లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సురక్షితంగా ఉండటానికి సూచనలు:

ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఎన్‌హెచ్‌ఏఐ కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ సేవల కోసం ఎల్లప్పుడూ 'రాజ్ మార్గ్ యాత్ర' (Rajmargyatra) వంటి అధికారిక ప్రభుత్వ యాప్‌లను మాత్రమే వాడాలి. ఆన్‌లైన్ సెర్చ్ చేసేటప్పుడు అపరిచిత ప్రకటనలు లేదా స్పాన్సర్డ్ లింక్‌లను క్లిక్ చేయడం మానుకోవాలి. ఏదైనా వెబ్‌సైట్‌లో పేమెంట్ చేసే ముందు దాని యూఆర్ఎల్ (URL) స్పెల్లింగ్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. మీ ఓటీపీ (OTP), కార్డ్ వివరాలు లేదా లాగిన్ క్రెడెన్షియల్స్‌ను ఎవరితోనూ షేర్ చేయకూడదు. ఏదైనా వెబ్‌సైట్ అనుమానాస్పదంగా కనిపించినా లేదా అసాధారణ పర్మిషన్లు అడిగినా వెంటనే దాని నుండి బయటకు రావాలి. డిజిటల్ పేమెంట్ మోసాలు పెరుగుతున్న తరుణంలో, ప్రాథమిక ఆన్‌లైన్ భద్రతా నియమాలు పాటించడం వల్ల మీ కష్టార్జితాన్ని కాపాడుకోవచ్చు. హైవేలపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు పాటిస్తే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండవచ్చు. 

మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

టాప్ హెడ్ లైన్స్

BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget