అన్వేషించండి

Mini Countryman C Pre-Bookings Open: ఇండియాలో మినీ కంట్రీమ్యాన్ సి సందడి.. ప్రీ-బుకింగ్స్ షురూ! చెన్నై ప్లాంట్‌లోనే తయారీ.. ధర ఎంతంటే?

మినీ ఇండియా తన కొత్త కంట్రీమ్యాన్ సి ఎస్‌యూవీ కోసం అధికారికంగా ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. చెన్నైలోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌లో తయారయ్యే ఈ కారు ధర తక్కువగా ఉండే అవకాశం ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మినీ కంట్రీమ్యాన్ సి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం, భారత్ లోనే తయారీ.
  • స్థానిక తయారీతో ధర తగ్గి, మార్కెట్ లో పోటీ పెంచుతుంది.
  • పెట్రోల్ వేరియంట్లలో బడ్జెట్ ఆప్షన్, కస్టమర్లకు మరిన్ని ఎంపికలు.
  • ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన స్పేస్, సౌకర్యవంతమైన ప్రయాణం.

Mini Countryman C Pre-Bookings Open in India: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ (Mini), భారత మార్కెట్లో తన ఉనికిని మరింత చాటుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తన సరికొత్త మోడల్ 'మినీ కంట్రీమ్యాన్ సి' (Mini Countryman C) కోసం అధికారికంగా ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే, దీన్ని మన దేశంలోనే లోకల్ గా తయారు చేయనున్నారు. దీనివల్ల విదేశాల నుండి దిగుమతి చేసుకునే కార్ల కంటే దీని ధర చాలా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రీమియం ఎస్‌యూవీ (SUV) కావాలనుకునే మధ్యతరగతి, ధనిక వర్గాలకు ఇది ఒక గొప్ప ఆప్షన్ కానుంది. స్టైల్ తో పాటు రోజువారీ అవసరాలకు తగ్గట్లుగా దీని డిజైన్ ఉంటుంది.

స్థానిక తయారీతో తగ్గుతున్న ధర..
మినీ ఇండియా తన దేశవ్యాప్త డీలర్‌షిప్‌ల వద్ద ఈ కొత్త మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరిస్తోంది. ఆసక్తి గల కస్టమర్లు తమ సమీప షోరూమ్‌ను సందర్శించి ఈ లగ్జరీ ఎస్‌యూవీని రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ కారును చెన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్ ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు. విదేశాల నుండి నేరుగా ఇంపోర్ట్ చేసుకునే మోడళ్లతో పోలిస్తే, ఇండియాలోనే తయారవడం వల్ల కస్టమర్లపై ట్యాక్స్ భారం తగ్గుతుంది. ఇది మార్కెట్లో ఇతర లగ్జరీ బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

పెట్రోల్ వేరియంట్లలో బెస్ట్ ఆప్షన్..
మినీ ఇండియా లైన్-అప్ లో ఈ కంట్రీమ్యాన్ సి ఒక బడ్జెట్ పెట్రోల్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న హై-పర్ఫార్మెన్స్ జేసీడబ్ల్యూ (JCW) కంట్రీమ్యాన్ కంటే తక్కువ ధరలో ఇది లభిస్తుంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ కార్లయిన కంట్రీమ్యాన్ E, SE మోడళ్లతో పాటు పెట్రోల్ వెర్షన్ కూడా అందుబాటులోకి రావడం వల్ల కస్టమర్లకు నచ్చిన కారును ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. పెట్రోల్, ఎలక్ట్రిక్ విభాగాల్లో మినీ ఇప్పుడు బలమైన పట్టు సాధించేలా కనిపిస్తోంది.

మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

డిజైన్ - టెక్నాలజీ విశేషాలు..
కొత్త కంట్రీమ్యాన్ సి డిజైన్ విషయంలో మినీ తన సిగ్నేచర్ స్టైల్‌ను కొనసాగించింది. రౌండెడ్ హెడ్‌ల్యాంప్స్, మోడరన్ లుక్ తో పాటు కొంచెం రగ్డ్ ఎలిమెంట్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. పాత మోడళ్లతో పోలిస్తే ఈ కొత్త ఎస్‌యూవీ లోపల స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సీటింగ్, అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సిటీ ట్రాఫిక్ లో నడపడానికే కాకుండా లాంగ్ జర్నీలకు కూడా ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యత ఇస్తూనే తనదైన స్టైల్ కోల్పోకుండా మినీ ఈ కారును రూపొందించింది.

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇంజిన్ సామర్థ్యం..
ఈ కారు స్పెసిఫికేషన్లపై కంపెనీ ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇందులో టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండే అవకాశం ఉంది. బీఎండబ్ల్యూ ఎక్స్ 1 (BMW X1) తరహాలోనే 1.5 లీటర్ పవర్‌మిల్ ఇంజిన్‌ను దీనికి వాడే ఛాన్స్ ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. లాంచ్ సమయానికి దీని పర్ఫార్మెన్స్ గణాంకాలను అధికారికంగా వెల్లడిస్తారు. లగ్జరీ ఎస్‌యూవీ రంగంలో తనదైన ముద్ర వేయడానికి మినీ ఇప్పుడు పక్కా ప్లాన్ తో సిద్ధమైంది.

Frequently Asked Questions

మినీ కంట్రీమ్యాన్ సి ప్రీ-బుకింగ్స్ ఎక్కడ చేసుకోవచ్చు?

మినీ ఇండియా తన దేశవ్యాప్త డీలర్‌షిప్‌ల వద్ద ఈ కొత్త మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరిస్తోంది. ఆసక్తి గల కస్టమర్లు తమ సమీప షోరూమ్‌ను సందర్శించి ఈ లగ్జరీ ఎస్‌యూవీని రిజర్వ్ చేసుకోవచ్చు.

భారతదేశంలో మినీ కంట్రీమ్యాన్ సి ఎక్కడ తయారవుతుంది?

ఈ కారును చెన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్ ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు. భారతదేశంలో తయారవడం వల్ల విదేశాల నుండి దిగుమతి చేసుకునే కార్ల కంటే దీని ధర చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

మినీ కంట్రీమ్యాన్ సి ఏ వేరియంట్లలో లభిస్తుంది?

మినీ కంట్రీమ్యాన్ సి ఒక బడ్జెట్ పెట్రోల్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న హై-పర్ఫార్మెన్స్ జేసీడబ్ల్యూ (JCW) కంట్రీమ్యాన్ కంటే తక్కువ ధరలో ఇది లభిస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ కంట్రీమ్యాన్ E, SE మోడళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మినీ కంట్రీమ్యాన్ సి డిజైన్ ఎలా ఉంటుంది?

కొత్త కంట్రీమ్యాన్ సి డిజైన్‌లో మినీ తన సిగ్నేచర్ స్టైల్‌ను కొనసాగించింది. రౌండెడ్ హెడ్‌ల్యాంప్స్, మోడరన్ లుక్ తో పాటు కొంచెం రగ్డ్ ఎలిమెంట్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. లోపల స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Italjet Scooters: ఇండియన్ మార్కెట్లోకి 3 ఇటాల్‌జెట్‌ స్కూటర్లు.. బ్రెంబో బ్రేక్స్, ట్విన్ సిలిండర్ ఇంజిన్లతో రంగప్రవేశం!
భారత్‌లోకి పవర్‌ఫుల్ ఇటలీ స్కూటర్లు.. 700cc భారీ ఇంజిన్‌తో రచ్చ చేయనున్న డ్రాగ్‌స్టర్
Off-road SUVs: ఆఫ్‌రోడింగ్‌ ఎస్‌యూవీల కోసం భారీగా ఖర్చు పెట్టే పనే లేదు! రూ.12.59 లక్షల నుంచే 5 సూపర్‌ మోడళ్లు!
వరదైనా, బురదైనా, రాళ్ల దారైనా.. ఈజీగా దూసుకెళ్లే 5 SUVలు, రూ.12.59 లక్షల నుంచే!
పెట్రోల్ పవర్‌తో CNG మైలేజీ! Mahindra XUV 3XO CNGలో ఇన్ని ప్రత్యేకతలా? బుక్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
CNGలోనూ టర్బో పవర్! మహీంద్రా XUV 3XO ZNG కొనే ముందు మీకు తెలియాల్సిన విషయాలు!
Volkswagen Virtus Facelift టీజర్ లాంచ్‌.. LED లైట్లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో అదిరిపోయే డిజైన్!
Volkswagen Virtus Facelift టీజర్‌ వచ్చేసింది బ్రో.. లుక్‌ అదిరిపోలా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Vizag ODI :  ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Dolis For Vote: రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
Tirumala Laddu Case: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Regena Cassandra : ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
Embed widget