అన్వేషించండి

Bajaj NS400Z vs KTM 390 Duke: మిడ్ సైజ్ బైక్ సెగ్మెంట్‌లో బిగ్ ఫైట్ - బజాజ్ ఎన్ఎస్400జెడ్ వర్సెస్ కేటీఎమ్ 390 డ్యూక్.. ఫీచర్లు, ధరల మధ్య భారీ తేడా!

కొత్త జీఎస్‌టీ నిబంధనల నేపథ్యంలో బజాజ్, కేటీఎమ్ తమ ఇంజిన్ సైజును తగ్గించాయి. ఈ రెండు పవర్‌ఫుల్ బైక్‌లలో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది ఈరోజు ప‌రిశీలిద్దాం.

Bajaj NS400Z vs KTM 390 Duke A Detailed Comparison: ఇండియ‌న్ మోటార్ సైకిల్ మార్కెట్లో ప్రస్తుతం 350 సీసీ లోపు బైక్‌లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం 350 సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం ఉన్న వాహనాలపై జీఎస్‌టీ (GST) రేటును 18 శాతానికి తగ్గించడమే. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి బజాజ్ ఆటో తన పాపులర్ మోడల్స్ ఇంజిన్ సైజును మారుస్తోంది. ఇటీవలే బజాజ్ తన సరికొత్త 'ఎన్ఎస్400జెడ్' (NS400Z) ను మార్కెట్లోకి తీసుకురాగా, కేటీఎమ్ కూడా తన 390 డ్యూక్ లో 350 సీసీ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. మీరు ఈ రెండు బైక్‌లలో ఏదో ఒకటి కొనాలని ఆలోచిస్తుంటే, వాటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు తెలుసుకోవడం చాలా అవసరం.

ఇంజిన్ - పర్ఫార్మెన్స్..
బజాజ్ ఎన్ఎస్ 400జెడ్ ఇప్పుడు 349.13 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది గతంలో ఉన్న 373 సీసీ యూనిట్ స్థానంలో వచ్చింది. ఈ ఇంజిన్ 9,000 rpm వద్ద 40 hp పవర్, 7,500 rpm వద్ద 33.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, కొత్త 350 సీసీ ఇంజిన్‌తో వస్తున్న కేటీఎమ్ 390 డ్యూక్ గరిష్టంగా 41.5 hp పవర్, 33.5 Nm టార్క్‌ను అందిస్తుంది. పవర్ విషయంలో కేటీఎమ్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

అత్యాధునిక ఫీచర్లు..
ఫీచర్ల పరంగా చూస్తే బజాజ్ ఎన్ఎస్ 400జెడ్ లో రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ అనే నాలుగు ఏబీఎస్ రైడ్ మోడ్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ ఫోర్-వే సెలక్షన్ స్విచ్ వంటి ఫీచర్లు దీని సొంతం. కేటీఎమ్ 390 డ్యూక్ విషయానికి వస్తే, ఇందులో 5-అంగుళాల టీఎఫ్‌టీ డ్యాష్ డిస్‌ప్లే ఉంటుంది. మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ (MTC), లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, రైడ్-బై-వైర్, క్విక్‌షిఫ్టర్+, సూపర్‌మోటో ఏబీఎస్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. ఫీచర్ల పరంగా కేటీఎమ్ కొంచెం ఎక్కువ అడ్వాన్స్‌డ్‌గా ఉంది.

హార్డ్‌వేర్ - బాడీ డిజైన్..
బజాజ్ బైక్ 43 మిమీ యూఎస్‌డీ ఫ్రంట్ సస్పెన్షన్, ఆరు రకాల అడ్జస్ట్‌మెంట్ ఉన్న రియర్ మోనోషాక్ కలిగి ఉంటుంది. దీని బరువు 174 కిలోలు కాగా, సీటు ఎత్తు 807 మిమీ ఉంటుంది. 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ దీనికి అదనపు బలం. కేటీఎమ్ 390 డ్యూక్ లో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 240 మిమీ రియర్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 183 మిమీ ఉండటం వల్ల గుంతల రోడ్లపై కూడా సులభంగా వెళ్లవచ్చు. దీని బరువు కేవలం 168.3 కిలోలు మాత్రమే ఉండటం వల్ల డ్రైవింగ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. 15 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉండటం వల్ల లాంగ్ రైడ్స్ కు ఇది అనుకూలంగా ఉంటుంది.

ప్రైస్ వేరియేష‌న్..
ఈ రెండు బైక్‌ల మధ్య అసలైన తేడా ధర దగ్గరే కనిపిస్తుంది. బజాజ్ ఎన్ఎస్ 400జెడ్ ప్రారంభ ధర రూ. 1.94 లక్షలు (ఎక్స్‌షోరూమ్) గా ఉంది. అదే సమయంలో కేటీఎమ్ 390 డ్యూక్ 350 సీసీ వేరియంట్ ధర రూ. 2.77 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అంటే కేటీఎమ్ తో పోలిస్తే బజాజ్ బైక్ దాదాపు రూ. 83,000 తక్కువ ధరకే లభిస్తోంది. కేటీఎమ్ తన 399 సీసీ మోడల్ కంటే ఈ కొత్త వెర్షన్ ధరను రూ. 62,000 వరకు తగ్గించడం విశేషం. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పవర్ కావాలనుకునే వారికి బజాజ్ ఎన్ఎస్400జెడ్ బెస్ట్ ఆప్షన్ కాగా, ప్రీమియం ఫీచర్లు, బ్రాండ్ వాల్యూ కోరుకునే వారికి కేటీఎమ్ 390 డ్యూక్ సరైన ఎంపిక అని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
కొత్త SUVల దెబ్బకు పడిపోతుందన్నారు.. కానీ ఈ కారు జోరు తగ్గలేదు, ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
Maruti Wagon R CNG నిజంగా ఎంత మైలేజ్ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఇదే!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Hero Xpulse 210 రియల్‌ రివ్యూ - 5,600km తిరిగిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget