అన్వేషించండి

Mahindra Outperforms Toyota and Kia: ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా ప్రభంజనం - ఎస్‌యూవీ అమ్మకాల్లో తిరుగులేని ఆధిక్యం.. దూసుకుపోతున్న స్కార్పియో, థార్!

2026 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా 6.6 లక్షలకు పైగా ఎస్‌యూవీలను విక్రయించి భారీ వృద్ధిని నమోదు చేసింది. టయోటా, కియా ఉమ్మడి అమ్మకాల కంటే మహీంద్రా ఒక్కటే ఎక్కువ వాహనాలను విక్రయించడం విశేషం.

Mahindra Outperforms Toyota and Kia Combined in FY26: ఇండియ‌న్ ఆటోమొబైల్ రంగం లో దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2026 ఆర్థిక సంవత్సరాన్ని (FY26) అత్యంత విజయవంతంగా ముగించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఏకంగా 6.6 లక్షలకు పైగా ఎస్‌యూవీలను (SUV) విక్రయించి మార్కెట్లో తన సత్తా చాటింది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో టయోటా, కియా వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ఉమ్మడి అమ్మకాల కంటే ఎక్కువ వాహనాలను మహీంద్రా ఒక్కటే విక్రయించడం విశేషం. దీనితో దేశంలో మూడవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడమే కాకుండా, మారుతి సుజుకి తర్వాత పరిశ్రమలో రెండవ స్థానానికి చేరువవుతోంది. గత ఏడాదితో పోలిస్తే మహీంద్రా దాదాపు 20 శాతం వృద్ధిని నమోదు చేసింది.

టయోటా, కియా కంటే కూడా..
తాజా గణాంకాల ప్రకారం, ఎఫ్-వై 26 లో మహీంద్రా మొత్తం 6,60,276 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అదే సమయంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ 3,67,152 యూనిట్లు, కియా ఇండియా 2,89,035 యూనిట్ల అమ్మకాలకే పరిమితమయ్యాయి. ఈ రెండు కంపెనీల మొత్తం విక్రయాలను కలిపినా మహీంద్రా అమ్మకాల కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. ప్రస్తుతం భారతీయ కస్టమర్లు సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండే ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతుండటం మహీంద్రాకు బాగా కలిసొచ్చింది.

స్కార్పియో - థార్ హవా..
మహీంద్రా విజయ ప్రస్థానంలో 'స్కార్పియో' బ్రాండ్ కీలక పాత్ర పోషించింది. స్కార్పియో క్లాసిక్, స్కార్పియో-ఎన్ మోడళ్లు కలిపి ఏడాదికి 1,78,800 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 8 శాతం వృద్ధి కావడం విశేషం. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటితో పాటు లైఫ్ స్టైల్ ఆఫ్-రోడర్ 'థార్' ఏకంగా 50 శాతం వృద్ధిని నమోదు చేసి 1.26 లక్షల యూనిట్ల మార్కును అందుకుంది.  థార్ వెయిటింగ్ పీరియడ్ చాలా నెల‌లు ఎక్కువగా ఉన్నప్పటికీ కస్టమర్లు ఈ కారు కోసం వేచి ఉండటం దీని క్రేజ్‌ను తెలియజేస్తోంది.

పోర్ట్‌ఫోలియో మొత్తం వృద్ధి..
కేవలం ఒకటి రెండు మోడళ్లు మాత్రమే కాకుండా మహీంద్రా లోని దాదాపు అన్ని వాహనాలు మంచి ప్రదర్శన కనబరిచాయి. పాత తరం మోడల్ అయిన 'బొలెరో' ఇప్పటికీ 1.1 లక్షల యూనిట్ల అమ్మకాలతో తన బలాన్ని చాటుకుంది. ఇక ఎక్స్‌యూవీ300 స్థానంలో వచ్చిన 'ఎక్స్‌యూవీ 3XO' ఒక లక్ష యూనిట్ల అమ్మకాలతో సబ్-ఫోర్ మీటర్ సెగ్మెంట్‌లో నిలకడగా కొనసాగుతోంది. ఎక్స్‌యూవీ700 అమ్మకాలు స్వల్పంగా తగ్గినా, ఎలక్ట్రిక్ విభాగంలో కొత్తగా వచ్చిన ఎక్స్‌యూవీ 9e (XUV 9e), బీఈ 6 (BE 6)  మోడళ్లు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా మహీంద్రా తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. నాణ్యత, పవర్, స్టైల్ కలగలిసిన వాహనాలను అందిస్తుండటంతో మహీంద్రా ఇప్పుడు భారతీయ రోడ్లపై కింగ్ అనిపించుకుంటోంది. ఏదేమైనా అటు సంప్రదాయ వెహికల్స్ తో పాటు ఇటు ఎలక్టిక్ వాహనాల్లోనే మహీంద్ర రాణించి, సత్తా చాటుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget