అన్వేషించండి

Hyundai, TVS  Joint Venture: EV త్రీ-వీలర్ మార్కెట్లో సంచలనం.. హ్యుందాయ్, టీవీఎస్ మోటార్స్ Joint Venture! దేశీ రోడ్ల కోసం స్పెషల్ ఎలక్ట్రిక్ ఆటోలు

ఇండియ‌న్ మార్కెట్ కోసం ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను తయారు చేసేందుకు హ్యుందాయ్, టీవీఎస్ కంపెనీలు జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఇది దేశీయ ఈవీ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది.

Hyundai and TVS Motor Partner to Develop Next Gen Electric Three Wheelers: ఇండియ‌న్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ, దేశీయ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీతో అధికారికంగా జతకట్టింది.మ‌న దేశం కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను (E3W) అభివృద్ధి చేసి తయారు చేసేందుకు ఇరు సంస్థలు 'జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్' (JDA) పై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్యం కేవలం భారత్‌కే పరిమితం కాకుండా భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్లకు కూడా విస్తరించాలని కంపెనీలు భావిస్తున్నాయి. నిజానికి ఈ ఉమ్మడి ప్రాజెక్టు ఆలోచన 2018 నాటిది. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ, హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ మధ్య జరిగిన చర్చలు ఇప్పుడు 2026 కొరియా-ఇండియా బిజినెస్ ఫోరమ్‌లో కార్యరూపం దాల్చాయి.

భారత్ కోసం స్పెషల్ డిజైన్..
ఈ అగ్రిమెంట్ ప్రకారం, హ్యుందాయ్ సంస్థ తన అంతర్జాతీయ స్థాయి ఆర్‌అండ్‌డీ (R&D) నైపుణ్యంతో ఉత్పత్తి రూపకల్పన, డిజైన్‌ బాధ్యతలు చేపడుతుంది. హ్యుమ‌న్ సెంట‌ర్డ్ డిజైన్ ఫిలాసఫీని ఇక్కడ అమలు చేస్తారు. టీవీఎస్ మోటార్ విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ మొబిలిటీ, త్రీ-వీలర్ ప్లాట్‌ఫారమ్‌లలో తమకున్న అపారమైన అనుభవాన్ని ఈ ప్రాజెక్టు కోసం వెచ్చిస్తుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా తయారీ, సేల్స్ కార్యకలాపాలను కూడా టీవీఎస్ స్వయంగా పర్యవేక్షిస్తుంది. ఈ ఏడాది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించిన ఈ3డబ్ల్యూ కాన్సెప్ట్ ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకోవడం విశేషం.

సరికొత్త టెక్నాలజీ - ఫీచర్లు..
దేశంలోని విభిన్న రహదారి పరిస్థితులు, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను ఇంజనీరింగ్ చేయనున్నారు. వర్షాకాలంలో నీరు నిలిచే రోడ్లను దృష్టిలో ఉంచుకుని ఇందులో 'అడాప్టివ్ గ్రౌండ్ క్లియరెన్స్' అనే ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నారు. మన ఉష్ణమండల శీతోష్ణస్థితికి తగ్గట్లుగా మెరుగైన థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్, అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఇందులో భాగంగా ఉంటాయి. ప్రయాణికుల అవసరాలకే కాకుండా, వస్తువుల రవాణా (Cargo) కోసం కూడా వినియోగించుకునేలా దీని క్యాబిన్ లో మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

లోకలైజేషన్ - స్వదేశీ తయారీ..
ఈ భాగస్వామ్యంలో 'లోకలైజేషన్' అనే అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాన విడిభాగాలన్నింటినీ దేశంలోనే సేకరించి తయారు చేయాలని రెండు కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గడమే కాకుండా, విడిభాగాల లభ్యత పెరిగి కస్టమర్లకు వేగంగా సర్వీస్ అందించడానికి వీలవుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటంతో పాటు దేశీయ ఈవీ ఎకోసిస్టమ్ మరింత శక్తివంతంగా మారుతుంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు డెవలప్‌మెంట్, టెస్టింగ్ దశలోకి ప్రవేశించింది. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. త్వరలోనే అన్ని రకాల అనుమతులు పొంది ఈ కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద త్రీ-వీలర్ మార్కెట్ అయిన భారత్‌లో ముందుగా దీన్ని విడుదల చేసి, ఆ తర్వాత ఇతర దేశాల్లో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా మీ ప్రాంతాల్లో పర్యావరణ హితమైన రవాణా కోసం చూస్తుంటే, ఈ సరికొత్త ఆటోలు ఒక బెస్ట్ ఆప్షన్ కావచ్చని విశ్లేష‌కులు అంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget