అన్వేషించండి

KTM Launches 350cc Duke and Adventure: కేటీఎమ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన డ్యూక్, అడ్వెంచర్ ధరలు! కొత్త 350cc ఇంజిన్ తో బడ్జెట్ రేట్లోకి!

తక్కువ జీఎస్‌టీ ప్రయోజనాల కోసం కేటీఎమ్ తన 390 సిరీస్ లో 350cc ఇంజిన్ వేరియంట్లను విడుదల చేసింది. దీనివల్ల డ్యూక్, అడ్వెంచర్ బైక్ ల ధరలు భారీగా తగ్గాయి.

KTM Launches 350cc Duke and Adventure Models in India: బజాజ్ ఆధీనంలోని ప్రముఖ మోటార్ సైకిల్ బ్రాండ్ కేటీఎమ్ (KTM), భారత మార్కెట్లో తన పట్టును మరింత పెంచు కోవడానికి ఒక తెలివైన ఎత్తుగడ వేసింది. తన పాపులర్ మోడల్స్ అయిన కేటీఎమ్ 390 డ్యూక్, కేటీఎమ్ 390 అడ్వెంచర్ లలో సరికొత్త 350cc వెర్షన్లను ప్రవేశపెట్టింది. మన దేశంలో 350cc లేదా అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఇంజిన్లపై జీఎస్‌టీ (GST) కేవలం 18 శాతమే ఉంటుంది. ఈ ట్యాక్స్ బెనిఫిట్ ను వినియోగదారులకు అందించడం ద్వారా, ఈ పవర్‌ఫుల్ బైక్‌లను మరింత అందుబాటు ధరలోకి కేటీఎమ్ తీసుకొచ్చింది. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండానే తక్కువ ధరకే ప్రీమియం బైక్ అనుభూతిని అందించడం ఈ మార్పు ముఖ్య ఉద్దేశం అని కంపెనీ వ‌ర్గాలు తెలిపాయి. 

పవర్ - పర్ఫార్మెన్స్ వివరాలు..
ఈ కొత్త 350cc ఇంజిన్ గరిష్టంగా 41.5 hp పవర్, 33.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. వేగంగా దూసుకుపోవడానికి, అలాగే లాంగ్ రైడ్స్ లో మంచి పికప్ ఇవ్వడానికి ఈ ఇంజిన్ పక్కాగా సరిపోతుంది. డిజైన్ విషయానికి వస్తే, కేటీఎమ్ 390 డ్యూక్ తన అగ్రెసివ్ లుక్ తో యువతను కట్టిపడేస్తోంది. దీని యాంగులర్ హెడ్‌ల్యాంప్స్, స్ట్రీమ్‌లైన్డ్ బాడీ వర్క్ అలాగే కొనసాగుతున్నాయి. మరోవైపు కేటీఎమ్ 390 అడ్వెంచర్ తన పెద్ద మోడల్స్ అయిన 890, 1290 అడ్వెంచర్ ల నుండి స్ఫూర్తి పొంది డిజైన్ చేయబడింది. ఇందులో సర్దుబాటు చేసుకునే సదుపాయం ఉన్న ఫ్రంట్ యూఎస్‌డీ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి.

ధరల వివరాలు..
కొత్త 350cc ఇంజిన్ తో వచ్చిన కేటీఎమ్ 390 డ్యూక్ ధర రూ. 2,77,268 (ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. అలాగే కేటీఎమ్ 390 అడ్వెంచర్ ధర రూ. 2,80,905 గా నిర్ణయించారు. పాత 399cc వేరియంట్లు అయిన డ్యూక్ ఆర్, అడ్వెంచర్ ఎస్, ఎక్స్, ఆర్ మోడళ్లు ఎటువంటి మార్పు లేకుండా మునుపటి ధరలకే అందుబాటులో ఉంటాయి. 350cc పరిమితి వల్ల కలిగే ట్యాక్స్ ప్రయోజనం కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి చాలా కలిసొచ్చే అంశం.

కేటీఎమ్ పోర్ట్‌ఫోలియో (కొత్త ధరలు)..
కేటీఎమ్ డ్యూక్ శ్రేణిలో 160cc మోడల్ రూ. 1.82 లక్షల నుండి ప్రారంభమవుతుండగా, 200cc, 250cc మోడళ్లు వరుసగా రూ. 1.98 లక్షలు, రూ. 2.17 లక్షల ధర కలిగి ఉన్నాయి. అడ్వెంచర్ శ్రేణిలో కూడా 250cc మోడల్ రూ. 2.45 లక్షల ధరతో అందుబాటులో ఉంది. మీరు కూడా మీ పాత  బైకుని అప్‌గ్రేడ్ చేసి ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బైక్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, తక్కువ ధరలో లభిస్తున్న ఈ కొత్త 350cc కేటీఎమ్ మోడళ్లు ఒక బెస్ట్ ఆప్షన్ కావచ్చు.  లాంగ్ డ్రైవ్స్ కు ఈ బైక్ పర్ఫెక్ట్ గా ఉంటుందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఏదేమైనా కంపెనీ న్యూ పాలసీ కారణంగా తక్కువ ధరలోనే అత్యాధునిక కేటీఎం బైకులు అందుబాటు లోకి వస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget