అన్వేషించండి

ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్‌ ఫ్యామిలీ కారు ఇదే! - మంటల్లోనూ కాలని బ్యాటరీలతో 'కోనిగ్‌సెగ్‌ జెమెరా' సంచలనం

2300 hp పవర్‌తో కోనిగ్‌సెగ్‌ జెమెరా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఫ్యామిలీ కారుగా నిలిచింది. యూరోపియన్‌ భద్రత, ఎమిషన్స్‌, బ్యాటరీ పరీక్షలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కోనిగ్‌సెగ్‌ జెమెరా: కుటుంబంతో ప్రయాణించే శక్తిమంతమైన హైపర్‌కార్‌
  • 2300 hp శక్తి, 1.9 సెకన్లలో 100 km వేగం.
  • యూరోపియన్‌ భద్రతా పరీక్షల్లో, బ్యాటరీ భద్రతలో కొత్త ప్రమాణాలు.
  • పరిమిత ఉత్పత్తి, గ్రిల్‌ టెస్ట్‌లో అద్భుత బ్యాటరీ భద్రత ప్రదర్శన.

Koenigsegg Gemera Car Specifications Telugu: హైపర్‌కార్‌ అనగానే కేవలం రెండు సీట్లు, అత్యంత వేగం, ట్రాక్‌ మీద మాత్రమే వినియోగం అనే ఆలోచనే గుర్తుకు వస్తుంది. కానీ, స్వీడన్‌కు చెందిన ప్రీమియం కార్‌ తయారీ సంస్థ 'కోనిగ్‌సెగ్‌', ఈ ఆలోచనలన్నింటినీ మార్చేసింది. నాలుగురు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించగలిగేలా రూపొందించిన 'కోనిగ్‌సెగ్‌ జెమెరా', ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఫ్యామిలీ కారుగా గుర్తింపు సాధించింది. అంతే కాదు... అత్యంత భద్రత కలిగిన హైపర్‌కార్‌గా కూడా గుర్తింపు పొందింది.

ఏకంగా 2300 hp శక్తితో ‘మెగా జీటీ’

కోనిగ్‌సెగ్‌ జెమెరాను ఈ కంపెనీ ప్రపంచంలోనే తొలి “మెగా జీటీ”గా పరిచయం చేస్తోంది. ఇందులో 5.0 లీటర్ల ట్విన్‌ టర్బో V8 ఇంజిన్‌తో పాటు “డార్క్‌ మ్యాటర్‌” అనే శక్తిమంతమైన ఎలక్ట్రిక్‌ మోటార్‌ను ఉపయోగించారు. ఈ హైబ్రిడ్‌ సెటప్‌ కలిపి 2300 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఇది 9-స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, ఆల్‌ వీల్‌ డ్రైవ్‌, ఆల్‌ వీల్‌ స్టీరింగ్‌ వంటి ఆధునిక టెక్నాలజీలతో వస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 1.9 సెకన్లలో చేరుకోవడం దీని ప్రత్యేకత. అంటే, స్టార్ట్‌ చేసి 2 సెకన్లు కూడా కాకముందే 100km స్పీడ్‌ అందుకుని, మన కంటికి కూడా కనిపించనంత దూరం దూసుకెళ్తుంది. ఇంత పవర్‌ ఉన్నా కూడా, నాలుగు సీట్ల లేఅవుట్‌, లగ్జరీ ఇంటీరియర్స్‌తో కుటుంబ వినియోగానికి అనుకూలంగా రూపొందించారు.

యూరోపియన్‌ భద్రతా పరీక్షల్లో పూర్తి విజయం

ఇంత శక్తిమంతమైన కారు భద్రత విషయంలో ఎలా ఉంటుందన్న సందేహాలకు కోనిగ్‌సెగ్‌ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. జెమెరా యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన అన్ని భద్రత, ఎమిషన్స్‌, కంప్లయన్స్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది.

ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాల్లో కీలకమైన బ్యాటరీ భద్రతలో జెమెరా కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసిన హై ఓల్టేజ్‌ బ్యాటరీ సిస్టమ్‌, ప్రస్తుతం అమల్లో ఉన్న ECE R100.3 నిబంధనలతో పాటు, 2027 నుంచి అమల్లోకి రానున్న మరింత కఠినమైన ECE R100.5 థర్మల్‌ ప్రొపగేషన్‌ టెస్ట్‌కు కూడా పూర్తిగా సరిపోతుందని నిరూపించింది.

బ్యాటరీ భద్రతలోనూ రికార్డ్‌

కోనిగ్‌సెగ్‌ దీన్ని EV భద్రతలో ఒక పెద్ద మైలురాయిగా చెబుతోంది. ప్రత్యేకంగా నిర్వహించిన కఠిన పరీక్షల్లో బ్యాటరీలో ఒక సెల్‌లో థర్మల్‌ రన్‌వే పరిస్థితిని సృష్టించినా, అది అక్కడికే పరిమితమైంది. మంటలు లేదా వేడి మిగతా సెల్స్‌కు వ్యాపించకుండా, బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ కొన్ని సెకన్లలోనే పరిస్థితిని నియంత్రించింది.

ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత భద్రతా ప్రమాణాలను మించిన ఫలితమని ఆటో రంగ నిపుణులు అంటున్నారు.

‘షేక్‌ చేస్తున్న ‘గ్రిల్‌ టెస్ట్‌’ వీడియో

కోనిగ్‌సెగ్‌ విడుదల చేసిన ‘గ్రిల్‌ టెస్ట్‌’ వీడియో ఈ బ్యాటరీ బలాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. ఈ పరీక్షలో బ్యాటరీ ప్యాక్‌ను రెండు నిమిషాలకు పైగా నేరుగా మంటల్లో ఉంచారు. అయినా లోపల ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రయాణీకుల భద్రతకు కంపెనీ ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చెప్పే ఉదాహరణగా ఇది నిలుస్తోంది.

పరిమిత ఉత్పత్తి, ప్రపంచవ్యాప్త ఆసక్తి

కోనిగ్‌సెగ్‌ జెమెరా ఉత్పత్తి కేవలం 300 యూనిట్లకే పరిమితం. డైహీడ్రల్‌ సిన్క్రో-హెలిక్స్‌ డోర్లు, అత్యాధునిక గల్జరీ ఫీచర్లు దీనిని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ప్రస్తుతం యూరోప్‌ సర్టిఫికేషన్‌ పూర్తవగా, అమెరికా సర్టిఫికేషన్‌ కూడా తుది దశకు చేరిందని కంపెనీ తెలిపింది.

వేగం, శక్తి, లగ్జరీతో పాటు భద్రతను కూడా అత్యున్నత స్థాయిలో అందించే ఫ్యామిలీ హైపర్‌కార్‌ అంటే కోనిగ్‌సెగ్‌ జెమెరానే అని ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

కోనిగ్‌సెగ్‌ జెమెరా అంటే ఏమిటి?

కోనిగ్‌సెగ్‌ జెమెరా ప్రపంచంలోనే తొలి 'మెగా జీటీ'. ఇది నాలుగు సీట్లు, లగ్జరీ ఇంటీరియర్స్‌తో కుటుంబ వినియోగానికి అనుకూలమైన అత్యంత శక్తిమంతమైన హైపర్‌కార్‌.

కోనిగ్‌సెగ్‌ జెమెరా యొక్క ఇంజిన్‌ శక్తి ఎంత?

జెమెరా 5.0 లీటర్ల ట్విన్‌ టర్బో V8 ఇంజిన్‌తో పాటు 'డార్క్‌ మ్యాటర్‌' అనే ఎలక్ట్రిక్‌ మోటార్‌ను కలిగి ఉంది. ఈ హైబ్రిడ్‌ సెటప్‌ కలిపి 2300 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

జెమెరా భద్రతా ప్రమాణాలలో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా?

జెమెరా యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన అన్ని భద్రత, ఎమిషన్స్‌, కంప్లయన్స్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ముఖ్యంగా దాని హై ఓల్టేజ్‌ బ్యాటరీ సిస్టమ్‌ కఠినమైన భద్రతా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది.

జెమెరా యొక్క ఉత్పత్తి పరిమితమా?

అవును, కోనిగ్‌సెగ్‌ జెమెరా ఉత్పత్తి కేవలం 300 యూనిట్లకే పరిమితం.

టాప్ హెడ్ లైన్స్

Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌
కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌ - రూ.68,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించిన రెనాల్ట్‌
Maruti Suzuki Celerio EMI Calculator: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు
యమహా R15 V4, MT-15 మోటోజీపీ ఎడిషన్లు లాంచ్‌.. అచ్చం 'రేస్‌ బైక్‌'ను చూసినట్లే ఉంది
TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌
TVS స్కూటర్‌ కొనేవాళ్లకు షాక్‌! iQube నుంచి Jupiter వరకు వేలల్లో పెరిగిన ధరలు - కొత్త రేట్లు ఇవే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget