అన్వేషించండి

ఫ్యామిలీ ట్రిప్‌లకు బెస్ట్‌ SUV ఏది? లగేజ్‌ స్పేస్‌ ఆధారంగా టాప్‌ 10 లిస్ట్‌

మన మార్కెట్‌లో ఉన్న మిడ్‌సైజ్‌ SUVలలో ఏ కారులో బూట్‌ స్పేస్‌ ఎక్కువ? టాప్‌ 10 SUVలను లగేజ్‌ సామర్థ్యం ఆధారంగా ర్యాంక్‌ చేసి వివరాలు తెలుసుకోండి.

Top 10 Midsize SUVs India: భారత కార్‌ మార్కెట్‌లో మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌ అంటేనే గట్టి పోటీకి మరో పేరు. రోజువారీ వాడకంలో సులభంగా నడపగల సైజ్‌, ఐదుగురు కుటుంబ సభ్యులు కంఫర్ట్‌గా కూర్చునే స్పేస్‌, ఎప్పుడైనా ట్రిప్‌లకు సరిపడా లగేజ్‌ సామర్థ్యం - ఇవన్నీ ఒకే కారులో ఒకేసారి అందించడమే ఈ సెగ్మెంట్‌ ప్రత్యేకత. ముఖ్యంగా ఫ్యామిలీ యూజర్లకు బూట్‌ స్పేస్‌ చాలా కీలక అంశం. అందుకే, మిడ్‌సైజ్‌ SUVలలో బూట్‌ స్పేస్‌ ఆధారంగా టాప్‌ 10 కార్లను ర్యాంక్‌ చేశాం.

ఈ ర్యాంకింగ్‌లో బూట్‌ స్పేస్‌ను పార్సెల్‌ ట్రే వరకు మాత్రమే లెక్కించాం, రూఫ్‌ వరకు కాదు.

10. హ్యుందాయ్‌ క్రెటా - 433 లీటర్లు

సేల్స్‌లో నంబర్‌ వన్‌ అయినా, బూట్‌ స్పేస్‌లో క్రెటా చివరి స్థానంలో నిలిచింది. 433 లీటర్ల సామర్థ్యం సరిపడే స్థాయిలో ఉన్నా, వీల్‌ ఆర్చ్‌ కొద్దిగా లగేజ్‌ స్పేస్‌ను తగ్గిస్తుంది. అయితే 60:40 స్ప్లిట్‌ రియర్‌ సీట్లు ఉండటం ప్లస్‌ పాయింట్‌.

9. సిట్రోయెన్‌ ఎయిర్‌క్రాస్‌ X - 444 లీటర్లు

5 సీటర్‌ వేరియంట్‌లో 444 లీటర్ల బూట్‌ స్పేస్‌ ఇస్తుంది. బూట్‌ లోతుగా ఉన్నా, టెయిల్‌గేట్‌ ఓపెనింగ్‌ కొంచెం ఇరుకుగా ఉంటుంది. రియర్‌ సీట్లకు స్ప్లిట్‌ ఫోల్డ్‌ ఆప్షన్‌ లేకపోవడం లోపం.

8. మహీంద్రా థార్‌ రాక్స్‌ - 447 లీటర్లు

రగ్డ్‌ లుక్‌ చూసి ఎక్కువ స్పేస్‌ ఉంటుందని అనుకుంటే ఆశ్చర్యమే. బూట్‌ స్పేస్‌ 447 లీటర్లే. స్ప్లిట్‌ ఓపెనింగ్‌ టెయిల్‌గేట్‌ చూడటానికి బాగున్నా, వాడకంలో కొంత ఇబ్బంది ఉంది.

7. కియా సెల్టోస్‌ - 447 లీటర్లు

2026లో వచ్చిన సెకండ్‌ జనరేషన్‌ సెల్టోస్‌ బూట్‌ స్పేస్‌ను పెంచుకుంది. ఫ్లాట్‌ ఫ్లోర్‌ ఉండటం వల్ల లగేజ్‌ పెట్టడం సులభం. అయితే లోడింగ్‌ లిప్‌ కొంచెం ఎత్తుగా ఉంటుంది.

6. MG ఆస్టర్‌ - 448 లీటర్లు

చతురస్రాకార బూట్‌, ఫ్లాట్‌ ఫ్లోర్‌తో ఆస్టర్‌ వాడకానికి సులభంగా ఉంటుంది. అయితే రియర్‌ వీల్‌ ఆర్చ్‌లు వెడల్పును కొద్దిగా తగ్గిస్తాయి. 60:40 స్ప్లిట్‌ సీట్లు సహాయపడతాయి.

5. టాటా సియెర్రా - 450 లీటర్లు

టాటా చెప్పే 622 లీటర్లు రూఫ్‌ వరకు లెక్క. పార్సెల్‌ ట్రే వరకు చూస్తే 450 లీటర్లు ఉంటుంది. బూట్‌ ఓపెనింగ్‌ వెడల్పుగా, లోడింగ్‌ లిప్‌ తక్కువగా ఉండటం దీని బలం.

4. హోండా ఎలివేట్‌ - 458 లీటర్లు

సరైన ఆకారంలో ఉన్న బూట్‌ ఎలివేట్‌కు పెద్ద ప్లస్‌. ఫ్యామిలీ ట్రిప్‌కు సరిపడా లగేజ్‌ ఇట్టే పడుతుంది. పార్సెల్‌ ట్రే కూడా బాగా కవర్‌ చేస్తుంది.

3. సిట్రోయెన్‌ బసాల్ట్‌ X - 470 లీటర్లు

కూపే SUV లుక్‌ అందరికీ నచ్చకపోయినా, బూట్‌ స్పేస్‌ మాత్రం ఆకట్టుకుంటుంది. అయితే లోడింగ్‌ లిప్‌ ఎత్తుగా ఉండటం కొంత ఇబ్బంది.

2. టాటా కర్వ్‌ - 500 లీటర్లు

బసాల్ట్‌తో పోలిస్తే 30 లీటర్లు ఎక్కువ. వెడల్పు, లోతు రెండూ బాగా ఉన్నాయి. హయ్యర్‌ వేరియంట్లలో ఎలక్ట్రిక్‌ టెయిల్‌గేట్‌ కూడా ఉంటుంది.

1. రెనాల్ట్‌ డస్టర్‌ - 518 లీటర్లు

కొత్త అవతార్‌లో రాబోతున్న డస్టర్‌ ఈ లిస్ట్‌లో నంబర్‌ వన్‌. సెగ్మెంట్‌లోనే అత్యధిక బూట్‌ స్పేస్‌ ఇవ్వడం విశేషం. సైజ్‌లో పెద్దది కాకపోయినా, లోపల స్పేస్‌ను అద్భుతంగా వినియోగించారు.

మీరు ఫ్యామిలీ ట్రిప్‌లకు ఎక్కువగా వెళ్తుంటే, ఎక్కువ లగేజ్‌ వాడకం ఉంటే, ఈ ర్యాంకింగ్‌ మీకు స్పష్టమైన ఐడియా ఇస్తుంది. లుక్‌, మైలేజ్‌తో పాటు బూట్‌ స్పేస్‌ కూడా SUV ఎంపికలో ఎంత ముఖ్యమో ఈ జాబితా చెబుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 మారుతి బలెనోలో ఏం మారింది? ఇంజిన్ పవర్‌, మైలేజ్‌, ఫీచర్లు పెరిగాయా, తగ్గాయా?
పాత బలెనోకు కొత్త బలెనోకు తేడా ఇదే.. కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
నెలకు కేవలం రూ.10 వేలతో ఎలక్ట్రిక్‌ కారు సొంతం - పెట్రోల్ భారం నుండి విముక్తి పొందే ఐడియా
కేవలం రూ.10,000 EMIతో కొనగలిగే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు! పెట్రోల్‌ బిల్లుకు చెప్పండి గుడ్‌బై!
రూ.లక్ష లోపులో వచ్చే బజాజ్ బైక్‌లు, స్కూటర్లు.. ఈ 8 టూవీలర్లలో ఒకటి ఎంచుకోవచ్చు!
డైలీ జర్నీ నుంచి స్పోర్టీ రైడ్ వరకు.. రూ.లక్షలోపే వచ్చే ఈ బజాజ్ బైక్స్‌పై ఓ లుక్కేయండి!
398cc Triumph Scrambler 400 X: నెలకు రూ.6600 కడితే ఈ బైక్ మీదే! డౌన్‌పేమెంట్‌, ఈజీ EMI ప్లాన్స్‌ ఇవే!
Triumph Scrambler 400 X: రూ.3.15 లక్షల అడ్వెంచర్ బైక్‌ కేవలం రూ.6600 EMIతో మీ సొంతమవుతుంది!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
18th BRICS Summit: ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
Tirumala Latest News: తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
Indonesia Ship Missing: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Vijay Trisha: త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
Embed widget