అన్వేషించండి

Petrol Excise Duty: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇథనాల్ పెట్రోల్‌పై ఎక్సైజ్ టాక్స్ రద్దు, ధర ఎంత తగ్గుతుందంటే

Ethanol Petrol Excise Duty News: ఇథనాల్ మిశ్రమం కలిపి ఉండే పెట్రోల్ ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు తాజాగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్రం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రద్దు.
  • ముడిచమురు దిగుమతులు తగ్గించి, రూపాయి విలువ పెంచడమే లక్ష్యం.
  • ఈ నిర్ణయం ప్రజలకు, రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని అంచనా.
  • బీఐఎస్ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

Petrol Excise Duty News | కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని (Excise Duty) రద్దు చేసింది. అంటే ఇకపై 22 శాతం నుండి 30 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ విధించదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇథనాల్‌తో కూడిన చౌక పెట్రోల్‌కు డిమాండ్ పెరిగితే, సామాన్య ప్రజలతో పాటు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యం నుంచి ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఎంతగానో పెరుగుతోందని, ప్రస్తుతం ఇది బ్యారెల్‌కు 114 డాలర్లకు చేరుకుందని గమనించాలి. దీని ప్రభావం వల్ల దిగుమతి బిల్లు పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌లోకి ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, రూపాయి విలువను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఫోకస్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రకటనలతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏమిటి?
ఎక్సైజ్ డ్యూటీ అనేది ఒక పరోక్ష పన్ను. ఇది దేశం లోపల తయారయ్యే లేదా ఉత్పత్తి చేసే వస్తువులపై విధిస్తారు. ఈ ఎక్సైజ్ డ్యూటీని ప్రత్యేకంగా మద్యం, పొగాకు, పెట్రోలియం వంటి ఉత్పత్తులపైనే విధిస్తారు.

Also Read: దేశంలో అత్యంత చవకైన MG Comet EVపై 80 వేలు డిస్కౌంట్.. ఫుల్ ఛార్జ్‌తో 230 KM రేంజ్‌

ఎక్సైజ్ డ్యూటీని తగ్గించేందుకు నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం ఇకనుంచి 22 శాతం, 25%, 27%, 30 శాతం (E22, E25, E27, E30) ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేశారు. అయితే ఈ నిర్ణయంలో ఉన్న ఏకైక నిబంధన ఏమిటంటే, ఈ ఇంధనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి ఉండాలి.

ఏ ఇంధనం చౌకైనది.. E85 లేదా E20?
భారత్2లో E20 అంటే 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను కేంద్రం ప్రోత్సహిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదొడుకుల మధ్య దేశంలో ఆర్థిక పరిస్థితిని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం E85 ఇంధనాన్ని కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. E85 ఇంధనంలో 85 శాతం ఇథనాల్, మిగతా 15 శాతం పెట్రోల్ ఉంటుంది. E85 ఇంధనం, E20 కంటే లీటరుకు రూ. 20 చౌకగా లభిస్తుంది. 

Also Read: Bike Reserve: రిజర్వ్‌ పడ్డాక మీ బైక్‌ ఎంత దూరం వెళ్తుంది.. దీనివల్ల ఇంజిన్‌‌కు నష్టమా ? 

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఒకనొక దశలో ముడి చమురు ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. సీజ్ ఫైర్ ప్రకటించిన తరువాత సైతం అమెరికా, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌తో మళ్లీ గిల్లిగజ్జాలు మొదలుపెట్టడంతో ప్రతీకార దాడులు చేస్తోంది. హర్మూజ్ జలసంధి మూసివేత, నౌకల రాకపోకలకు ఇరాన్ అంతరాయం కలిగించడంతో ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోవడం పలు దేశాలపై ప్రతికూలా ప్రభావం చూపుతున్నాయి. 

Frequently Asked Questions

ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం 22% నుండి 30% ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేసింది. దీనివల్ల ఈ పెట్రోల్ చౌకగా లభిస్తుంది.

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రద్దు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

దీనివల్ల సామాన్య ప్రజలకు చౌక పెట్రోల్ లభిస్తుంది, రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దేశం ముడి చమురు దిగుమతులను తగ్గించి, రూపాయి విలువను మెరుగుపరచుకోవచ్చు.

ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏమిటి?

ఇది దేశం లోపల తయారయ్యే లేదా ఉత్పత్తి చేసే వస్తువులపై విధించే పరోక్ష పన్ను. మద్యం, పొగాకు, పెట్రోలియం వంటి ఉత్పత్తులపై ప్రత్యేకంగా విధిస్తారు.

ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రద్దుకు ఉన్న నిబంధనలు ఏమిటి?

22% నుండి 30% ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్‌పై మాత్రమే రద్దు వర్తిస్తుంది. ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget