అన్వేషించండి

దేశంలో అత్యంత చవకైన MG Comet EVపై 80 వేలు డిస్కౌంట్.. ఫుల్ ఛార్జ్‌తో 230 KM రేంజ్‌

MG Comet EVపై జూన్ నెలలో క్యాష్ డిస్కౌంట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో సహా అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఓవరాల్‌గా 80 వేల వరకు బెనిఫిట్స్ లభిస్తాయని కంపెనీ పేర్కొంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • MG కామెట్ EVపై రూ. 80,000 ప్రయోజనాలు జూన్‌లో ప్రకటించింది.
  • నగర ప్రయాణాలు, సులభ పార్కింగ్‌కు అనువైన మైక్రో EV.
  • 230 కి.మీ రేంజ్, అధునాతన డిజిటల్ ఫీచర్లతో లభిస్తుంది.
  • టాటా టియాగో EVతో నగర మార్కెట్లో పోటీపడుతుంది.

మీరు తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, అయితే ఇది మీకు మంచి అవకాశం. MG మోటార్స్ కంపెనీ జూన్ 2026లో తన పాపులర్ ఎలక్ట్రిక్ కారు MG Comet EVపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ నెలలో కంపెనీ కస్టమర్లకు రూ. 80,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. దీంతో ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు మరింత తక్కువ ధరకు లభిస్తుంది. తొలిసారి EV కొనుగోలు చేసే వారికి బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది.

MG Comet EV ప్రత్యేకంగా సిటీలో రోజువారీ ఆఫీసు జర్నీ, బిజినెస్ పనుల కోసం రూపొందించారు. పెరుగుతున్న ఇంధన ధరలు, ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ కారు విక్రయాల్లో దూసుకెళ్తోంది. ఆకర్షించే కాంపాక్ట్ సైజు, తక్కువ రన్నింగ్ కాస్ట్, మోడ్రన్ ఫీచర్ల కారణంగా, ఇది యువతకు బెస్ట్ ఛాయిస్‌గా మారుతోంది. 

కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది?

MG కంపెనీ జూన్ 2026లో Comet EVపై అనేక రకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ ఆఫర్‌లు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి కస్టమర్లకు మొత్తం 60,000 రూపాయల వరకు ప్రయోజనం పొందవచ్చు. భారత్‌లోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో అదనపు ప్రయోజనాలతో మొత్తంగా రూ. 80,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ తమ పాత కారును ఎక్స్‌చేంజ్ లేదా ఇప్పటికే MG కారును ఉపయోగిస్తున్న కస్టమర్లకు ప్రత్యేకం. అలాంటి కస్టమర్లకు అదనపు బోనస్ ప్రయోజనం పొందవచ్చు.

Also Read: Bike Reserve: రిజర్వ్‌ పడ్డాక మీ బైక్‌ ఎంత దూరం వెళ్తుంది.. దీనివల్ల ఇంజిన్‌‌కు నష్టమా ?

పూర్తి ఛార్జ్‌పై ఎంత దూరం నడుస్తుంది?

MG Comet EV అతిపెద్ద ఆకర్షణ దాని చిన్న సైజ్. ఇది 3 మీటర్ల కంటే తక్కువ పొడవున్న మైక్రో ఎలక్ట్రిక్ కారు కావడంతో రద్దీగా ఉండే రోడ్లు,  ఇరుకైన సందులలో దీనిని డ్రైవింగ్ చేయడం ఈజీ. చిన్న పార్కింగ్ స్థలాలలో దీనిని ఈజీగా పార్క్ చేయవచ్చు. కారు టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ. ఇది యూటర్న్ తీసుకోవడం మరియు ట్రాఫిక్‌లో కారును తిప్పడం సులభతరం చేస్తుంది. అందుకే ఈ కారు ముఖ్యంగా పెద్ద నగరాలకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది.

MG Comet EVలో 17.3 kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఈ కారు ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే దాదాపు 230 కిలోమీటర్ల  రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. చిన్న కారు అయినప్పటికీ MG ఇందులో పలు ప్రీమియం ఫీచర్లను అందించింది. కారులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, వాయిస్ కమాండ్, రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఏ కార్లతో పోటీ పడుతోంది?

భారత ఆటో మార్కెట్‌లో Comet EV అనేది Tata Tiago EV వంటి ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడుతుంది. వీటిలో Tata Tiago EV ఒక  ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్, కాగా ఎంజీ Comet EV సిటీ మొబిలిటీ, తక్కువ దూర ప్రయాణాల కోసం ఉంచుకుని రూపొందించారు.

Read Also: Best Mileage CNG Cars India 2026:లీటరుకు 25 కిలోమీటర్లకుపైగా మైలేజ్ ఇచ్చే టాప్ 5 బెస్ట్ సిఎన్‌జి కార్లు ! ధర,ఫీచర్ల పూర్తి వివరాలు ఇవే!

 

Frequently Asked Questions

MG Comet EVపై ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి?

MG Comet EVపై జూన్ 2026లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి ప్రయోజనాలతో రూ. 60,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఇది రూ. 80,000 వరకు ఉండవచ్చు.

MG Comet EV పూర్తి ఛార్జ్‌పై ఎంత దూరం ప్రయాణిస్తుంది?

MG Comet EV 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే దాదాపు 230 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

MG Comet EV ముఖ్యంగా ఎవరి కోసం రూపొందించబడింది?

MG Comet EV సిటీలో రోజువారీ ఆఫీసు జర్నీ, బిజినెస్ పనుల కోసం రూపొందించారు. ఇది కాంపాక్ట్ సైజు, తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో యువతకు బెస్ట్ ఛాయిస్.

MG Comet EVలో ఎలాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి?

ఈ కారులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget