అన్వేషించండి

Bike Reserve: రిజర్వ్‌ పడ్డాక మీ బైక్‌ ఎంత దూరం వెళ్తుంది.. దీనివల్ల ఇంజిన్‌‌కు నష్టమా ?

Bike Reserve Situation | రిజర్వ్‌లో పడ్డాక బైక్ ఎంత దూరం ప్రయాణిస్తుంది, తరచుగా రిజర్వ్‌లో ప్రయాణించడం ఇంజిన్‌ను ప్రభావితం చేస్తుందో లేదో వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రిజర్వ్ ఇంధనం ట్యాంక్ తక్కువైందని, రీఫ్యూయల్ చేయమని సూచిస్తుంది.
  • సాధారణంగా 1-2.5 లీటర్ల రిజర్వ్, 50-80 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.
  • పదేపదే రిజర్వ్ వాడకం ఇంజిన్‌కు హానికరం, అత్యవసరాలకే ఉపయోగించాలి.

Motorcycle Reserve Fuel | కారు అయినా, బైక్ అయినా ప్రతి వాహనంలోనూ పెట్రోల్ లేదా డీజిల్ రిజర్వ్ చేయడానికి ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. వెహికల్ నడుస్తున్నప్పుడు ఫ్యూయల్ ఖర్చవుతూ ఉంటుంది. బైక్ నడుపుతుండగా చాలాసార్లు హఠాత్తుగా పెట్రోల్ తగ్గిపోయి, బైక్ రిజర్వ్‌లోకి వస్తుంది. నిజానికి, రిజర్వ్ అనేది మీ వాహనంలో పెట్రోల్ అయిపో వచ్చిందని, వెంటనే రీఫ్యూయల్ చేయించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది. ఇలాంటప్పుడు చాలా మంది మనస్సులో ఒక ప్రశ్న వస్తుంది. అయితే రిజర్వ్‌లో ఎంత పెట్రోల్ మిగిలి ఉంటుంది? బైక్ ఎంత దూరం వరకు వెళ్లగలదు? రిజర్వ్ అనేది వేరే ప్రత్యేక ట్యాంక్ ఏమీ కాదు, అది మెయిన్ ఫ్యూయల్ ట్యాంక్‌లో ఒక భాగమే. 

టూవీలర్లో ఉండే రిజర్వ్ పెట్రోల్ సైజ్ ఆ బైక్ మోడల్, దాని మొత్తం ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇది 1 లీటర్ నుండి 2.5 లీటర్ల వరకు ఉంటుంది. ట్యాంక్‌లో పెట్రోల్ ఒక లిమిట్ కంటే కిందకు పడిపోయినప్పుడు, బైక్ రిజర్వ్ ఫ్యూయల్ వాడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. రైడర్ సేఫ్‌గా సమీపంలోని పెట్రోల్ బంకుకు చేరుకునేందుకు వీలుంటుంది. అందుకే రిజర్వ్‌ను ఎల్లప్పుడూ ఒక ఎమర్జెన్సీ ఆప్షన్‌గా వినియోగించుకోవాలి. 

Read Also: వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి

రిజర్వ్‌లో బైక్ ఎంత దూరం వెళ్తుంది
మీ బైక్ మోడల్, మైలేజ్, రిజర్వ్ ఫ్యూయల్ కెపాసిటీపై ఎంత దూరం వెళ్తుందనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మొత్తం ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంలో 10 శాతం వరకు రిజర్వ్‌లో ఉంటుంది. వేర్వేరు బైకుల్లో రిజర్వ్ పెట్రోల్ పరిమాణం మారుతూ ఉంటుంది. సాధారణంగా చాలా బైకుల్లో రిజర్వ్ ఫ్యూయల్ దాదాపు 1 నుండి 1.5 లీటర్ల వరకు ఉంటుంది. ఒకవేళ మీ బైక్ లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే, అది రిజర్వ్‌లోకి వచ్చిన తర్వాత దాదాపు 50 నుండి 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అయితే ఈ దూరం రోడ్డు కండీషన్, ట్రాఫిక్, వేగం, బైక్ కండిషన్‌ను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి. కనుక బైక్ రిజర్వ్‌లోకి వచ్చిన తర్వాత ఎక్కువ దూరం వెళ్లకుండా సాధ్యమైనంత త్వరగా పెట్రోల్ కొట్టించాలి. 

రిజర్వ్‌లో నడపితే ఇంజన్‌పై ప్రభావం పడుతుందా?
సాధారణంగా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు రిజర్వ్‌లో బైక్ నడపడం వల్ల ఇంజన్‌కు అంత నష్టం జరగదు. అవసరమైనప్పుడు మీరు పెట్రోల్ బంకుకు చేరుకోవాలనే ఉద్దేశంతోనే కంపెనీ ఈ సిస్టమ్‌ను అందిస్తుంది. కానీ పదే పదే బైక్‌ను రిజర్వ్ స్థాయికి తెచ్చి నడపడం లేదా ట్యాంక్‌ను పూర్తిగా ఖాళీ చేస్తే సమస్యలు రావచ్చు. ట్యాంక్ అడుగు భాగంలో పేరుకుపోయిన మురికి లాంటివి ఫ్యూయల్ సిస్టమ్‌లోకి చేరతాయి. ఫ్యూయల్ పంప్‌పై కూడా అదనపు ఒత్తిడి పడుతుంది. అందుకే రిజర్వ్‌ను కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read: BYD Sealion 6: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ పైగా రేంజ్

ఒకవేళ మీ బైక్ 50 kmpl మైలేజ్ ఇస్తూ, రిజర్వ్‌లో 1.5 లీటర్ల పెట్రోల్ ఉంటే మీరు గరిష్టంగా  65 - 75 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లవచ్చు. బైకులో ఫ్యూయల్ ఇండికేషన్ (ఇంధనం తక్కువగా ఉందని చూపే లైట్) పడగానే మీరు 20-30 కిలోమీటర్ల లోపు పెట్రోల్ కొట్టించడం మంచిది. 

Frequently Asked Questions

బైక్‌లో రిజర్వ్ ఫ్యూయల్ అంటే ఏమిటి?

ఇది మెయిన్ ఫ్యూయల్ ట్యాంక్‌లో ఒక భాగం. ఇంధనం తక్కువగా ఉందని సూచిస్తుంది, రైడర్ సమీప పెట్రోల్ బంకుకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. అత్యవసర సమయాల్లో మాత్రమే దీనిని ఉపయోగించాలి.

బైక్ రిజర్వ్‌లో సాధారణంగా ఎంత పెట్రోల్ ఉంటుంది?

టూవీలర్ రిజర్వ్ పెట్రోల్ సైజ్ బైక్ మోడల్, ట్యాంక్ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 1 నుండి 2.5 లీటర్ల వరకు ఉంటుంది, ఇది మొత్తం ట్యాంక్ సామర్థ్యంలో దాదాపు 10 శాతం.

రిజర్వ్‌లో బైక్ ఎంత దూరం ప్రయాణించగలదు?

బైక్ మోడల్, మైలేజ్, రిజర్వ్ కెపాసిటీపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, 60 kmpl మైలేజ్ ఇచ్చే బైక్ 1 నుండి 1.5 లీటర్ల రిజర్వ్‌తో 50 నుండి 80 కి.మీ. వరకు వెళ్లగలదు.

రిజర్వ్‌లో బైక్ నడపడం వల్ల ఇంజన్‌కు నష్టం కలుగుతుందా?

కొన్ని కిలోమీటర్లు నడపడం వల్ల ఇంజన్‌కు నష్టం జరగదు. కానీ పదేపదే రిజర్వ్‌లో నడిపితే ట్యాంక్ అడుగున ఉన్న మురికి ఫ్యూయల్ సిస్టమ్‌లోకి చేరి, ఫ్యూయల్ పంప్‌పై ఒత్తిడిని పెంచుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Embed widget