అన్వేషించండి

వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి

చిన్న కార్ల కంటే SUVలు మెరుగైన ఎంపికగా మారాయి. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల వర్షాకాలంలో డ్రైవింగ్ తేలిక అవుతుందని ఎస్‌యూవీ వాహనదారులు చెబుతున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వర్షాకాలంలో పాడైన రోడ్లు, నీరు నిలవడంతో డ్రైవింగ్ సవాలుగా.
  • అధిక గ్రౌండ్ క్లియరెన్స్ గల SUVలు ఈ పరిస్థితులకు చాలా అనుకూలం.
  • టాటా నెక్సాన్, కియా సోనెట్ బడ్జెట్‌లో మంచి SUV ఎంపికలు.
  • కైగర్, మాగ్నైట్, XUV3XO వంటివి కూడా ఉత్తమ ప్రత్యామ్నాయాలని.

Best SUVs in Monsoon | వర్షాకాలం సీజన్ ప్రారంభం కాగానే కార్ డ్రైవింగ్ కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. సమ్మర్‌లో డ్రైవింగ్‌తో పోల్చితే కొంచెం సవాలుగా మారుతుంది. చాలా నగరాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయి గుంతలు సరిగ్గా కనిపించవు. చాలా చోట్ల రోడ్లు కూడా పాడైపోతాయి. ఈ పరిస్థితుల్లో చిన్న కార్లతో పోలిస్తే SUVలు చాలా మెరుగైన ఆప్షన్‌గా ఉంటాయి. వీటిలో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే కారు కింది భాగం నేల నుండి ఎక్కువ ఎత్తులో ఉండటంతో నీళ్లు నిలిచిన రోడ్లపై, అధ్వాన్నమైన మార్గాల్లో జర్నీ తేలిక అవుతుంది. ఇదే కారణంతో వర్షాకాలంలో SUVలకు డిమాండ్ పెరుగుతుంది.

టాటా నెక్సాన్ (Tata Nexon)
 వర్షాకాలంలో ఎక్కువ ఇబ్బంది లేకుండా మీరు తక్కువ బడ్జెట్‌లో SUVని కొనుగోలు చేయాలనుకుంటే, మార్కెట్లో చాలా మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యంత పాపులర్ అయిన వాహనాలలో టాటా నెక్సాన్ ఒకటి. ఈ కారు తన స్ట్రాంగ్ బాడీ, అద్భుతమైన సేఫ్టీ, హై గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఫేమస్ అయింది. వర్షాల సమయంలో రోడ్డుపై నీరు నిలిచినా లేదా గుంతలు వచ్చినా కారు ఈజీగా దూసుకెళ్తుంది. ఇందులో అనేక మోడ్రన్  ఫీచర్లు, సౌకర్యవంతమైన క్యాబిన్ లభిస్తాయి, దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాలు సైతం సులువవుతాయి.

Read Also: WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే

కియా సోనెట్ (Kia Sonet)
కియా సోనెట్ కూడా వర్షకాలంలో ఒక అద్భుతమైన SUVగా భావిస్తారు. దీని డిజైన్ ఆకర్షణీయంగా ఉండటంతో పాటు ఇందులో అనేక మోడ్రన్ ఫీచర్లు అందించారు. హై గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా ఇది చిన్న గుంతల రోడ్లపై కూడా సులభంగా వెళ్తుంది.  అలాగే దీని క్యాబిన్ చాలా ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దీనివల్ల ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. 

రెనాల్ట్ కైగర్ (Renault Kiger)
తక్కువ ధరలో SUV ఫీల్‌ని కోరుకునే వారికి రెనాల్ట్ కైగర్ ఒక మంచి ఆప్షన్. దీని ఎత్తైన బాడీ, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ వర్షాకాలంలో డ్రైవింగ్ చేసే వారికి హెల్ప్ అవుతుంది. సిటీ రోడ్లపై రోజువారీ వాడకంతో పాటు, ఈ కారు అధ్వాన్నమైన మార్గాల్లో కూడా మంచి పనితీరుతో ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, దీని ధర కూడా చాలా వాహనాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అందువల్ల రెనాల్ట్ కైగర్ బడ్జెట్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.

Read Also: Hero HF Deluxe Flex Fuel Bike Emi: హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ ఖర్చులు తగ్గించే సరికొత్త టెక్నాలజీ.. ఎంత ఈఎంఐ కట్టాలో తెలుసా?

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)
నిస్సాన్ మాగ్నైట్ కూడా తక్కువ బడ్జెట్ గల పాపులర్ SUV. దీని డిజైన్ మోడ్రన్‌గా ఉంటుంది. ఇందులో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. వర్షాకాలంలో నీరు నిలిచిన రోడ్లపై ఈ కారు డ్రైవింగ్ చేయడం ఇబ్బంది అనిపించదు. దీంతో పాటు ఇందులో లభించే ఫీచర్లు, సౌకర్యవంతమైన ఇంటీరియర్ నిస్సాన్ మాగ్నైట్‌ను ఒక మంచి ఫ్యామిలీ ఆప్షన్‌గా మారుస్తాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (Mahindra XUV 3XO)
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కూడా ఈ జాబితాలో నిలుస్తుంది. మహీంద్రాకు చెందిన ఈ SUV స్ట్రాంగ్ బాడీ, సేఫ్టీ, అద్భుతమైన రోడ్ ప్రెజెన్స్‌కు పేరుగాంచింది. ఎత్తైన సీటింగ్ పొజిషన్ వల్ల డ్రైవర్‌కు రోడ్డు బాగా కనిపిస్తుంది. ఇది వర్షం పడే సమయంలో డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో అనేక అడ్వాన్స్డ్ ఫీచర్లు, మోడ్రన్ టెక్నాలజీ కూడా లభిస్తాయి.

Frequently Asked Questions

వర్షాకాలంలో SUVలు ఎందుకు మెరుగైన ఎంపిక?

వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచి గుంతలు ఏర్పడతాయి. SUVలకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల నీరు నిలిచిన రోడ్లపై, అధ్వాన్నమైన మార్గాల్లో ప్రయాణం సులువవుతుంది.

వర్షాకాలానికి అనువైన కొన్ని తక్కువ బడ్జెట్ SUVలు ఏవి?

వర్షాకాలంలో మంచి పనితీరు కనబరిచే కొన్ని తక్కువ బడ్జెట్ SUVలు టాటా నెక్సాన్, కియా సోనెట్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ.

టాటా నెక్సాన్ వర్షాకాల డ్రైవింగ్‌కు ఎలా ఉపయోగపడుతుంది?

టాటా నెక్సాన్ తన స్ట్రాంగ్ బాడీ, అద్భుతమైన సేఫ్టీ మరియు హై గ్రౌండ్ క్లియరెన్స్‌కు ప్రసిద్ధి చెందింది. వర్షాల సమయంలో రోడ్డుపై నీరు నిలిచినా లేదా గుంతలు వచ్చినా ఈ కారు సులభంగా దూసుకెళ్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
తెలుగు రాష్ట్రాల్లో టాటా సియెర్రా EV ఫైనల్‌గా ఎంతకు వస్తుంది? ఆన్‌రోడ్‌ ధరలు, EMI వివరాలు ఇవిగో
హైదరాబాద్‌లో టాటా సియెర్రా EV ఆన్‌రోడ్‌ ధర ఎంత? 10 శాతం డౌన్‌పేమెంట్‌తో EMI ఎంతవుతుంది?
టెక్టాన్ వర్సెస్ డస్టర్ - ఒకే రూపంతో ఉన్న కవల SUVలు; డిజైన్‌ నుంచి ధర వరకు పూర్తి కంపారిజన్
రెనాల్ట్ డస్టర్ డిజైన్‌తో తయారైన నిస్సాన్ టెక్టాన్ - రెండింటి మధ్య తేడాలేంటి? ఏది బెస్ట్?
భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌
కేవలం రూ.10.49 లక్షలకే కొత్త నిస్సాన్ టెక్టాన్ - క్రెటా, సెల్టోస్‌కు కొత్త సవాల్
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War Latest Updates: ట్రంప్ హత్య కుట్ర జరిగిందన్న ఇజ్రాయెల్! రెచ్చిపోయిన అమెరికా! ఇరాన్‌పై దాడికి అసలు కారణం ఇదే! 
ట్రంప్ హత్య కుట్ర జరిగిందన్న ఇజ్రాయెల్! రెచ్చిపోయిన అమెరికా! ఇరాన్‌పై దాడికి అసలు కారణం ఇదే! 
Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
Dulquer Salmaan Pooja Hegde : దుల్కర్‌తో అందాల బుట్టబొమ్మ - క్యూట్ కపుల్ లవ్ స్టోరీకి క్రేజీ టైటిల్
దుల్కర్‌తో అందాల బుట్టబొమ్మ - క్యూట్ కపుల్ లవ్ స్టోరీకి క్రేజీ టైటిల్
Kylian Mbappe Record Goal : ఎంబాప్పే హిస్టారికల్ వరల్డ్ రికార్డ్.. మొరాకోను చిత్తు చేసి సెమీస్ లోకి ఫ్రాన్స్, మెస్సితో గోల్డెన్ బూట్ మైండ్ బ్లోయింగ్ ఫైట్!
ఎంబాప్పే హిస్టారికల్ వరల్డ్ రికార్డ్.. మొరాకోను చిత్తు చేసి సెమీస్ లోకి ఫ్రాన్స్, మెస్సితో గోల్డెన్ బూట్ మైండ్ బ్లోయింగ్ ఫైట్!
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
Embed widget