అన్వేషించండి

BYD Sealion 6: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ పైగా రేంజ్

BYD Plug-in Hybrid SUV: 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ADAS, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, అలాగే ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి భద్రతా ఫీచర్లు BYD Sealion 6 లో రానున్నాయి.

BYD Hybrid SUV | భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దాంతో హైబ్రిడ్ కార్ల డిమాండ్ పుంజుకుంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థ BYD దేశంలో తన మొట్టమొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVని లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. బీవైడీ కంపెనీ జూన్ 9న కొత్త BYD Sealion 6 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటివరకు BYD భారత్‌లో కేవలం ఎలక్ట్రిక్ కార్ల (EVs) ద్వారానే గుర్తింపు తెచ్చుకుంది. ఈ Sealion 6 ద్వారా కంపెనీ తొలిసారిగా భారత వినియోగదారులకు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ (PHEV) ఆప్షన్‌ను అందించనుంది. 

BYD Sealion 6లో కంపెనీకి చెందిన ప్రత్యేకమైన DM-i హైబ్రిడ్ టెక్నాలజీని వాడారు. ఈ సిస్టమ్ "ఎలక్ట్రిక్ ఫస్ట్" అనే ఫార్మూలాపై పనిచేస్తుంది. అంటే, నగరాల్లో డ్రైవింగ్ సమయంలో ఈ కారు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ సహాయంతోనే నడుస్తుంది. దీనివల్ల పెట్రోల్ వినియోగం తగ్గడంతో పాటు రన్నింగ్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే పెట్రోల్ ఇంజన్ పనిచేస్తుంది. తద్వారా లాంగ్ జర్నీ చేయడం సులువవుతుంది.

Also Read: E85 Fuel India: ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..

కారు డిజైన్ ఎలా ఉంది?
డిజైన్ విషయానికి వస్తే.. Sealion 6 లుక్ చాలా మోడ్రన్, ప్రీమియంగా ఉంటుంది. ఈ SUV పొడవు దాదాపు 4.77 మీటర్లు ఉండటంతో దీని రోడ్ ప్రెజెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో స్లీక్ ఎల్‌ఈడీ (LED) హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు, స్పోర్టీ బంపర్ అందించారు. అలాగే వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, లైట్ బార్, రూఫ్ స్పాయిలర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ దీనికి మరింత అట్రాక్షన్ ఇస్తాయి. బీవైడీ కంపెనీ ఇందులో స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చింది.

ఈ SUV క్యాబిన్ లోపల సాఫ్ట్-టచ్ మెటీరియల్, ప్రీమియం ఫినిషింగ్, అట్రాక్టివ్ కలర్ థీమ్‌ను ఉపయోగించారు. ఇందులో లెదరెట్ సీట్లు, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, 15.6 అంగుళాల భారీ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఇస్తారు. ఈ ఫీచర్లతో సాంకేతికత, ఫీచర్ల పరంగానూ ఈ SUV చాలా కార్లతో పోల్చితే ముందంజలో కనిపిస్తుంది.

Read Also: వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి

భద్రత, స్పెషల్ ఫీచర్లు
సేఫ్టీ విషయంలో కూడా కంపెనీ ఎక్కడా రాజీ పడలేదు. బీవైడీ Sealion 6 మోడల్‌లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), ఫ్రంట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు, పనోరమిక్ సన్రూఫ్, 10 స్పీకర్ల ఆడియో సిస్టమ్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫీచర్లన్నీ కలిసి దీనిని అత్యంత సురక్షితమైన, హైటెక్ SUVగా మారుస్తాయి.

BYD Sealion 6 అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ SUV 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజన్, బ్యాటరీ కాంబినేషన్‌తో వస్తోంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేసి, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేస్తే ఈ SUV 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. లాంగ్ జర్నీల సమయంలో పదే పదే ఛార్జింగ్ పెట్టాలనే లేదా ట్యాంక్ ఫుల్ చేపించాలనే టెన్షన్ ఉండదు. 

ధర ఎంత ఉండవచ్చు?
భారత్‌లో కంపెనీ దీని ఏ పవర్‌ట్రెయిన్ (ఇంజన్/బ్యాటరీ) వేరియంట్‌ లాంచింగ్ వివరాలు తెలియలేదు. అయినప్పటికీ, దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 35 లక్షల నుండి రూ. 45 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఒకవేళ ఇదే ధరతో వస్తే.. ఎలక్ట్రిక్ కారు లాంటి తక్కువ రన్నింగ్ కాస్ట్ కోరుకుంటూనే, లాంగ్ జర్నీ కోసం పెట్రోల్ ఇంజన్ వదులుకోవడానికి ఇష్టపడని కస్టమర్లకు ఈ SUV ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది.

Frequently Asked Questions

BYD Sealion 6 అంటే ఏమిటి?

ఇది BYD భారతదేశంలో విడుదల చేస్తున్న మొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV. ఈ మోడల్ జూన్ 9న భారత మార్కెట్లోకి రానుంది.

Sealion 6లో ఏ హైబ్రిడ్ సాంకేతికతను ఉపయోగిస్తారు?

Sealion 6లో BYD యొక్క ప్రత్యేకమైన DM-i హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది 'ఎలక్ట్రిక్ ఫస్ట్' సూత్రంపై పనిచేస్తుంది, నగరాల్లో ఎలక్ట్రిక్ మోటారుతో నడుస్తుంది.

BYD Sealion 6 డ్రైవింగ్ రేంజ్ ఎంత?

బ్యాటరీ పూర్తి ఛార్జ్‌తో, పెట్రోల్ ట్యాంక్ నింపినప్పుడు, ఈ SUV 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.

BYD Sealion 6 అంచనా ధర ఎంత?

భారతదేశంలో దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 35 లక్షల నుండి రూ. 45 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget