అన్వేషించండి

E85 Fuel India: ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..

E85 Fuel India Launch: భారత్2లో E85 ఇంధనం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది అన్ని కార్లు, బైకులలో ఉపయోగించడం కుదరదు. ఏ వాహనాలకు అనుకూలంగా ఉంటుంది, మైలేజీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్ర మంత్రి E85 ఇంధనాన్ని జూన్ 5న అధికారికంగా ప్రారంభించారు.
  • E85 పెట్రోల్ కన్నా లీటరుకు దాదాపు రూ.20 చౌక.
  • ఇది కేవలం ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు మాత్రమే ఉపయోగపడుతుంది.
  • ఇతర వాహనాల్లో వాడితే ఇంజిన్ పాడయ్యే ప్రమాదం ఉంది.

E85 Fuel India Launch: పెరుగుతున్న పెట్రోల్ ధరలు భారత్‌లో వాహనదారులకు ఇబ్బందిగా మారుతున్నాయి. భారత్‌లో పర్యావరణానికి మెరుగైన ప్రత్యామ్నాయం, చౌకైన ఇంధనం వైపు ఒక పెద్ద అడుగు పడింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు జూన్ 5న E85 ఇంధనాన్ని అధికారికంగా లాంచ్ చేశారు. దీనిలో ఢిల్లీలోని ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్‌లో భారత్‌లో మొట్టమొదటి E85 ఫ్యూయల్ డిస్పెన్సర్ అంటే పంప్ మెషీన్‌ను ఆయన ప్రారంభించారు.

భవిష్యత్తులో కాలుష్యాన్ని తగ్గించడంలో,  సామాన్య ప్రజల జేబు ఖర్చులను ఆదా చేయడంలో ఈ అడుగు చాలా సహాయకారిగా మారుతుందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో చాలా మందికి ఈ E85 ఫ్యూయల్‌ను తాము వాడుతున్న కార్ లేదా బైక్‌లో కూడా పోయించవచ్చా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ మీ మనస్సులో ఇదే ప్రశ్న మెదిలితే, సమాధానం తెలుసుకోవాలి. కేవలం చౌకగా ఉందని E85ను ఏ వాహనంలోనైనా పోయిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

మీ బైక్‌కు E85 ఫ్యూయల్ సరైనదేనా?

ప్రస్తుతం ఈ కొత్త E85 ఇంధనం దేశంలోని అన్ని వాహనాలకు అందుబాటులో లేదు. ఇప్పుడు మన దేశంలో కేవలం 3 ప్రత్యేక మోటార్‌సైకిళ్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఈ ఇంధనాన్ని ఉపయోగించవచ్చు.. అంటే కేవలం ఈ 3 బైక్‌లు మాత్రమే E85 ఫ్యూయల్ కంపాటబుల్. ఒకవేళ ఈ ఇంధనం మీ సాధారణ బైక్‌కు సరైనదా కాదా అని మీరు ఆలోచిస్తుంటే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

Read Also: వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి

ధర ఎలా ఉన్నప్పటికీ, మీరు మీ ప్రస్తుత కార్ లేదా బైక్‌లో దీనిని అప్పుడే ఫిల్ చేయించలేరు. ప్రస్తుతం భారత్‌లో కేవలం 3 మోటార్‌సైకిళ్లు మాత్రమే ఈ ఇంధనంతో నడవడానికి అనుకూలంగా ఉన్నాయి. ఆ మోటార్‌సైకిళ్లు ఏంటంటే.. రూ. 82,710 ధర ఉన్న Hero Splendor+ Flex Fuel, రెండవది ఢిల్లీ ఎక్స్-షోరూమ్‌లో రూ. 72,792 ధర కలిగిన Hero HF Deluxe Flex Fuel. ఇవి కాకుండా Suzuki Gixxer SF 250 FFV ఉంది. దీనిని సుజుకి ఇప్పటికే భారత్‌లో ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌గా విక్రయిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.98 లక్షలుగా ఉంది. ఈ మూడింటికంటే భిన్నంగా భారత్‌లో విక్రయించే ఇతర ఏ బైక్ లేదా కార్ కూడా అధికారికంగా E85 ఇంధనంతో నడవలేదు.

మైలేజీపై ప్రభావం చూపుతుంది

ఇక మైలేజీ విషయానికి వస్తే, చౌక ఇంధనం కాబట్టి ఖర్చు కూడా తగ్గుతుందని చాలా మంది భావిస్తారు. కానీ విషయం అంత ఈజీ కాదు. ఇథనాల్ ఇంధన సామర్థ్యం (ఎనర్జీ కెపాసిటీ) పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుంది. దీని అర్థం దూరాన్ని అధిగమించడానికి ఇంజిన్‌కు ఎక్కువ ఇంధనం అవసరం. ఈ కారణంతో E85 తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలలో మైలేజీ సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే కొంత తక్కువగా ఉండవచ్చు. పెట్రోల్ కంటే E85 ధర తక్కువగా ఉన్నందున, చాలా సందర్భాలలో మొత్తం రన్నింగ్ కాస్ట్ ఇప్పటికీ తక్కువగానే ఉంటుంది. కానీ ఈ ప్రయోజనం కేవలం E85 కోసం డిజైన్ చేసిన వాహనాలకు సెట్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా సాధారణ బైక్ లేదా కార్‌ను E85 పై నడపడానికి ప్రయత్నిస్తే, మైలేజీ మెరుగవ్వడానికి బదులుగా ఇంజిన్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. 

Read Also: Splendor Plus Flex Fuel Bike EMI: హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ తో పనిలేకుండా ఇథనాల్ తో నడిచే సరికొత్త మోడల్..  నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో పూర్తి డీటెయిల్స్

పెట్రోల్ కంటే రూ. 20 చౌక

నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా కొత్త E85 ఇంధనం సామాన్య ప్రజలకు ఉపశమనం లాంటిది. దీని ధర విషయానికి వస్తే, ఢిల్లీలో లీటరుకు రూ. 82.12 అత్యంత తక్కువ ధరకే లాంచ్ చేశారు. ప్రస్తుతం లభిస్తున్న సాధారణ పెట్రోల్‌తో దీనిని పోల్చి చూస్తే, వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీలో ఇప్పుడు రెగ్యులర్ పెట్రోల్ ధర లీటరుకు దాదాపు రూ. 102.12గా ఉంది. కొత్త E85 ఇంధనం మీ రెగ్యులర్ పెట్రోల్ కంటే లీటరుకు రూ. 20 చౌక. ఈ మూడింటికంటే భిన్నంగా భారత్‌లో విక్రయించే ఏ బైక్, కార్ కూడా E85 ఇంధనంతో నడవవు.

Frequently Asked Questions

భారత్‌లో E85 ఇంధనాన్ని ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు?

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ జూన్ 5న (ప్రపంచ పర్యావరణ దినోత్సవం) E85 ఇంధనాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో మొదటి E85 ఫ్యూయల్ పంప్‌ను కూడా ఆవిష్కరించారు. ఇది కాలుష్యాన్ని తగ్గించి, ఇంధన ఖర్చులను ఆదా చేయడంలో సహాయపడుతుంది.

నేను నా సాధారణ కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని ఉపయోగించవచ్చా?

లేదు, ప్రస్తుతం E85 ఇంధనం దేశంలోని అన్ని వాహనాలకు అందుబాటులో లేదు. మీ వాహనం E85 అనుకూలమైనది కాకపోతే, దానిని ఉపయోగించడం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

ప్రస్తుతం భారత్‌లో E85 ఇంధనానికి అనుకూలమైన వాహనాలు ఏవి?

ప్రస్తుతం, హీరో స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్, హీరో HF డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్, మరియు సుజుకి జిక్సర్ SF 250 FFV అనే 3 మోటార్‌సైకిళ్లు మాత్రమే E85కి అనుకూలంగా ఉన్నాయి.

E85 ఇంధనం సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఎంత చౌకగా ఉంటుంది?

E85 ఇంధనం ఢిల్లీలో లీటరుకు ₹82.12 చొప్పున ప్రారంభించబడింది. సాధారణ పెట్రోల్ (₹102.12) కంటే లీటరుకు ₹20 చౌకగా ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget