అన్వేషించండి

VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్

మీరు సౌకర్యవంతమైన, VIP లాంటి ప్రయాణాన్ని కోరుకుంటే Toyota Vellfire, కియా కార్నివాల్ (Kia Carnival), Lexus LM వంటి లగ్జరీ MPVలు అద్భుతమైన ఎంపికలుగా ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత మార్కెట్‌లో లగ్జరీ MPVలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
  • టయోటా వెల్‌ఫైర్ సౌకర్యవంతమైన సీట్లతో ప్రీమియం అనుభూతినిస్తుంది.
  • కియా కార్నివాల్ విశాలమైన స్థలం, ఆధునిక సాంకేతికతను అందిస్తుంది.
  • లెక్సస్ ఎల్ఎమ్ అత్యంత విలాసవంతమైన క్యాబిన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది.

Luxury MPV India: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVలకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. అధిక ఫీచర్లు, స్థలం (స్పేస్), ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ విషయానికి వస్తే లగ్జరీ MPVలతో పోటీ పడటం అంత ఈజీ కాదు. పెద్ద కుటుంబాలు, బిజినెస్ ట్రావెల్, VIPల రాకపోకల కోసం ఇలాంటి వాహనాలను ఇష్టపడతారు. ఈ వాహనాలలో కేవలం కూర్చోవడానికి స్థలం మాత్రమే కాకుండా, అద్భుతమైన సౌకర్యాలు, అనేక ఆధునిక వసతులు కూడా లభిస్తాయి.

అందుకే చాలా మంది వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, డబ్బున్న కుటుంబాలు లగ్జరీ MPVలకే ప్రాధాన్యత ఇస్తారు. భారత్‌లో ప్రస్తుతం సేఫ్టీతో పాటు సౌకర్యాలు, టెక్నాలజీ పరంగా ముందంజలో కొన్ని ప్రీమియం MPVలు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ ఎక్కువగా ఉండి, మీ జర్నీని ప్రత్యేకంగా మార్చుకోవాలనుకుంటే, ఈ వాహనాలు మీకు సరిపోతాయి. ఆటో మార్కెట్‌లో అత్యధికంగా చర్చ జరిగే ఆ మూడు లగ్జరీ MPVల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

టయోటా వెల్‌ఫైర్ (Toyota Vellfire), కియా కార్నివాల్ (Kia Carnival) ప్రత్యేక గుర్తింపు 
టయోటా వెల్‌ఫైర్‌ను దేశంలోని అత్యంత విలాసవంతమైన లగ్జరీ MPVలలో ఒకటిగా భావిస్తారు. ఇందులో రెండవ వరుసలో (సెకండ్ రో) ప్రీమియం సీట్లు, రెక్లైన్ ఫీచర్, వెంటిలేషన్, పలు లగ్జరీ వసతులు ఉన్నాయి. లాంగ్ జర్నీ సమయంలో దీని క్యాబిన్ బిజినెస్ క్లాస్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. దీనితో పాటు పలు అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందించారు. 

Also Read: వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి

మరోవైపు, కియా కార్నివాల్ కూడా భారత వినియోగదారులలో వేగంగా ప్రజాదరణ పొందింది. పెద్ద కుటుంబాలకు ఈ MPV బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది. ఇందులో తగినంత స్థలం, ప్రీమియం ఇంటీరియర్, మోడ్రన్ టెక్నాలజీ లభిస్తాయి. కార్నివాల్‌లో పలు ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. లగ్జరీ, రెండింటినీ కోరుకునే వారికి ఇది నచ్చుతుంది. ఈ రెండు MPVలు తమ తమ సెగ్మెంట్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. 

లెక్సస్ ఎల్ఎమ్ (Lexus LM) ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ 

ఎక్కువ లగ్జరీ విషయానికి వస్తే లెక్సస్ ఎల్ఎమ్ మిగతా కార్ల కంటే ముందు వరుసలో ఉంటుంది. ప్రయాణంలో అత్యున్నత సౌకర్యాన్ని కోరుకునే వినియోగదారుల కోసమే ఈ MPV ప్రత్యేకంగా రూపొందించారు. దీని క్యాబిన్‌లో ప్రైవేట్ లాంజ్ లాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. పెద్ద, సౌకర్యవంతమైన సీట్లు, ప్రీమియం మెటీరియల్స్, అనేక మోడ్రన్ వసతులు దీనిని ఎంతో ప్రత్యేకంగా మారుస్తాయి. సేఫ్టీ విషయంలో కూడా లెక్సస్ ఎల్ఎమ్ ఏ కారుకు తీసిపోదు.

Read Also: WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే

ఇందులో పలు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు, మోడ్రన్ సేఫ్టీ టెక్నాలజీ అందించారు. దీని ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, అత్యంత ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వినియోగదారులకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక. మొత్తంగా చెప్పాలంటే, టయోటా వెల్‌ఫైర్, కియా కార్నివాల్, లెక్సస్ ఎల్ఎమ్ వాహనాలు సౌకర్యం, సేఫ్టీ, అద్భుతమైన ఫీచర్ల పరంగా భారత మార్కెట్లోని అత్యుత్తమ వాహనాలుగా ఉన్నాయి. 

Frequently Asked Questions

లగ్జరీ MPVలంటే ఏమిటి?

ఇవి పెద్ద కుటుంబాలు, వ్యాపార యాత్రలు, VIPల కోసం రూపొందించిన వాహనాలు. విశాలమైన స్థలం, అద్భుతమైన సౌకర్యాలు, అనేక ఆధునిక వసతులు వీటి ప్రత్యేకతలు.

భారతదేశంలో ప్రస్తుతం లభించే కొన్ని ప్రముఖ లగ్జరీ MPVలు ఏవి?

టయోటా వెల్‌ఫైర్, కియా కార్నివాల్ మరియు లెక్సస్ ఎల్ఎమ్ వంటివి భారతదేశంలో అత్యుత్తమ లగ్జరీ MPVలుగా గుర్తించబడ్డాయి. ఇవి సౌకర్యం, భద్రత, ఆధునిక ఫీచర్లలో ముందున్నాయి.

టయోటా వెల్‌ఫైర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?

ఇది దేశంలోని అత్యంత విలాసవంతమైన MPVలలో ఒకటి. రెండవ వరుసలో ప్రీమియం రెక్లైన్, వెంటిలేషన్ సీట్లు, అధునాతన భద్రతా ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ఇది లాంగ్ జర్నీలలో బిజినెస్ క్లాస్ అనుభవాన్ని ఇస్తుంది.

లెక్సస్ ఎల్ఎమ్ యొక్క ప్రత్యేకత ఏమిటి?

లెక్సస్ ఎల్ఎమ్ అత్యంత ఉన్నతమైన సౌకర్యాన్ని కోరుకునే వారికి ఉద్దేశించబడింది. దీని క్యాబిన్ ప్రైవేట్ లాంజ్ లాంటి అనుభూతినిస్తుంది, పెద్ద సీట్లు, ప్రీమియం మెటీరియల్స్ ఉంటాయి. ఇది సేఫ్టీలో కూడా ముందుంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Renault Triber 7-సీటర్‌ ఫ్యామిలీ కారు.. రూ.1.16 లక్షల డౌన్‌పేమెంట్‌ చాలు, మిగిలింది EMIల్లో చూసుకోవచ్చు
ఏడు సీట్ల కారు ఇంత చౌకగానా? నెలకు కేవలం రూ.8,300 కడితే Renault Triber మీ సొంతం!
Renault Triber కొనేవాళ్ల అసలు ఛాయిస్ ఇదే.. ఈ వేరియంట్‌లో ఫీచర్లు & పవర్ రెండూ పక్కా!
రెనాల్ట్‌ ట్రైబర్‌లో ఏ వేరియంట్ కొనాలి? రూ.8.53 లక్షలకే టర్బో ఇంజిన్‌తో అదిరిపోయే ప్యాకేజీ!
2026 Bajaj Pulsar NS125 కొత్త అవతార్.. ఇక LCD డిస్‌ప్లేతో పాటు మరిన్ని ఫీచర్లు!
లాంచ్‌కు ముందే లీకైన 2026 పల్సర్ NS125 ఫొటోలు.. కొత్త రంగులు, కలర్ డిస్‌ప్లే!
First-Time Car Insurance: మీ కార్ ఇన్సూరెన్స్‌లో ఇవి ఉన్నాయా? పాలసీ తీసుకునే ముందు ఈ చెక్‌లిస్ట్ చూడండి
మొదటిసారి కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Embed widget