అన్వేషించండి

WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే

Flex Fuel Vehicles India: భారత్‌లో ఫ్లెక్స్ ఇంధన టెక్నాలజీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మారుతి వాగన్ఆర్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా ఇతర మోడల్‌లు E85 ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేస్తాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్ గ్రీన్ ఎనర్జీ కోసం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను ప్రోత్సహిస్తోంది.
  • పెట్రోల్ దిగుమతులు తగ్గించడానికి ఇథనాల్ ఇంధనం వాడకం పెరుగుతుంది.
  • మారుతి, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు ప్రదర్శించాయి.
  • ఈ వాహనాలకు ప్రత్యేక ఇంజిన్, ఇంధన వ్యవస్థ అమరుస్తారు.

భారత్ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ హిత ఇంధనాల వైపు ఫోకస్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కాకుండా ఇతర ఇంధనాలతో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్లెక్స్ ఫ్యూయల్ (Flex Fuel) కార్ల గురించిన చర్చ జరుగుతోంది. ఈ వాహనాల ప్రత్యేకత ఏంటంటే, ఇవి కేవలం పెట్రోల్‌తోనే కాకుండా, ఎక్కువ శాతం ఇథనాల్ కలిపిన ఇంధనంతో రోడ్లపై దూసుకెళ్లనున్నాయి. పెట్రోల్, డీజిల్ భారాన్ని తగ్గించి, దేశ దిగుమతి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం కూడా ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.

పలు ప్రముఖ కార్ల కంపెనీలు తమ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను భారత మార్కెట్లో ఇదివరకే ప్రదర్శించాయి. మారుతి వ్యాగన్ఆర్ (WagonR) నుండి హ్యుందాయ్ క్రెటా (Creta) వరకు ఎన్నో ప్రజాదరణ పొందిన మోడళ్లు ఈ కొత్త సాంకేతికతతో ముందుకు వచ్చాయి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఇథనాల్ పంపులు పెరిగినప్పుడు, ఇలాంటి వాహనాలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: Affordable 7 Seater Cars: 10 లక్షల రూపాయల్లో బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే.. ఫ్యామిలీ జర్నీకి తిరుగులేదు

మారుతి నుండి హ్యుందాయ్ వరకు.. గుర్తింపు పొందిన కార్లు
ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్న కంపెనీలలో మారుతి సుజుకి (Maruti Suzuki) పేరు అందరికంటే ముందుంది. ఈ కంపెనీ వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (WagonR Flex Fuel), బ్రెజ్జా ఫ్లెక్స్ ఫ్యూయల్ (Brezza Flex Fuel), గ్రాండ్ విటారా ఫ్లెక్స్ ఫ్యూయల్ (Grand Vitara Flex Fuel) వంటి మోడళ్లను మార్కెట్లోకి తేవడానికి సిద్ధంగా ఉంది. ఈ వాహనాలు E20 నుండి E85 వరకు వివిధ రకాల ఇథనాల్ మిశ్రమాలు గల ఇంధనంతో నడుస్తాయి. మరోవైపు, హ్యుందాయ్ (Hyundai) కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ క్రెటాను ప్రదర్శించి తన ఉనికిని చాటుకుంది.

ఈ వాహనాలలో ప్రత్యేక రకమైన ఇంజన్, ఫ్యూయల్ సిస్టమ్‌ను కంపెనీలు సెట్ చేస్తాయి. ఇది ఎక్కువ ఇథనాల్ శాతం ఉన్న ఇంధనాన్ని వాడుకుని రోడ్లపై పరుగులు తీస్తుంది. ఇదే కారణంతో  సాధారణ పెట్రోల్ కార్లకు, ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కొన్ని సంవత్సరాల్లో మరికొన్ని కంపెనీలు కూడా ఈ సరికొత్త టెక్నాలజీతో కొత్త మోడళ్లను తీసుకువచ్చే అవకాశం ఉంది.

Also Read: Tata Motors Announces Massive Discounts: టాటా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ నెలలో కొంటే ఏకంగా 3.35 లక్షల వరకు లాభం 

 

Frequently Asked Questions

ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు అంటే ఏమిటి?

ఇవి పెట్రోల్‌తో పాటు ఎక్కువ శాతం ఇథనాల్ కలిపిన ఇంధనంతో నడిచే వాహనాలు. పర్యావరణ హిత ఇంధనాలను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోంది?

పెట్రోల్, డీజిల్ భారాన్ని తగ్గించి, దేశ దిగుమతి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలూ దీనికి కారణం.

ఏ కార్ల కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి?

మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను ప్రదర్శించాయి. మారుతి వ్యాగన్ఆర్, బ్రెజ్జా, హ్యుందాయ్ క్రెటా వంటివి ఇందులో ఉన్నాయి.

సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు ఎలా భిన్నంగా ఉంటాయి?

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో ప్రత్యేక రకమైన ఇంజిన్, ఫ్యూయల్ సిస్టమ్ ఉంటాయి. ఇవి ఎక్కువ ఇథనాల్ శాతం ఉన్న ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగిస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Embed widget