అన్వేషించండి

కొత్త Tata Tiago EV Faceliftను ఏ ధరకు బుక్ చేసుకోవచ్చు? బుకింగ్ ప్రాసెస్ ఇదే

Tata Tiago EV Facelift: కొత్త టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగం మునుపటి కంటే మరింత స్టైలిష్‌గా రూపొందించారు. కొత్త గ్రిల్, ఆకర్షణీయమైన బంపర్, షార్ప్ లైట్లు ఈ కారుకు మరింత ప్రీమియం లుక్ ఇచ్చాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు రూ.11వేలతో ప్రారంభమయ్యాయి.
  • కొత్త స్టైలిష్ లుక్, మోడ్రన్ ఫీచర్లు, టెక్నాలజీతో కారు విడుదల.
  • మెరుగైన భద్రత, సమర్థవంతమైన బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

మీరు కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే మీకు ఓ గుడ్ న్యూస్. టాటా మోటార్స్ (Tata Motors) తన పాపులర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ఈవీ (Tiago EV) ఫేస్‌లిఫ్ట్ మోడల్ బుకింగ్స్‌ ప్రారంభించింది. కంపెనీ ఈ కారును సరికొత్త లుక్, మోడరన్ ఫీచర్స్, మెరుగైన సాంకేతికతతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. టియాగో ఈవీ ఇప్పటికే భారత్‌లో అత్యంత ఆదరణ పొందిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ప్రస్తుతం ఈ కొత్త అప్‌డేట్‌ల తర్వాత టియాగో ఈవీ కస్టమర్లను మరింతగా ఆకర్షించనుంది. మీరు ఈ వాహనాన్ని కేవలం రూ. 11 వేలు టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.

 మారిన కారు లుక్, డిజైన్
కొత్త టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Tiago EV Facelift) ముందు భాగాన్ని గతంలో కంటే మరింత స్టైలిష్‌గా మార్చారు. కొత్త డిజైన్‌తో కూడిన గ్రిల్, ఆకర్షణీయమైన బంపర్, షార్ప్ లుక్ ఉన్న లైట్లు ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఇవి కాకుండా, కొత్త డిజైన్ వీల్స్, కొన్ని కాస్మెటిక్ మార్పులు కూడా చేశారు. ఈ మార్పుల తరువాత రోడ్డుపై టియాగో ఈవీ కారు గతంలో కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కారు కేబిన్‌ను మునుపటి కంటే మోడ్రన్‌గా, కంఫర్ట‌బుల్‌గా తయారు చేశారు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు.  దీనివల్ల పాటలు వినడం, నావిగేషన్ ఉపయోగించడం, స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేయడం చాలా సులభం కానుంది. దీనితో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పలు స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లు కూడా యాడ్ చేశారు. ఈ ఫీచర్ల వల్ల కారణంగా డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ గతంలో కంటే ఎంతో మెరుగ్గా అనిపిస్తుంది. 

Read Also: Top EV Sales In India: ఇంధన ధరల సమస్యతో ఎలక్ట్రిక్ కార్లకు పెరిగిన డిమాండ్.. టాప్ కంపెనీలు ఇవే

కారు సేఫ్టీ ఎలా ఉంది?

కొత్త టియాగో ఈవీలో ప్రయాణికుల సేప్టీ మెరుగుపరిచేలా పలు అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లను ఇచ్చారు. ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, ఇతర అవసరమైన సేఫ్టీ సౌకర్యాలు ఉన్నాయి. అందుకే ఈ కారు ఫ్యామిలీ జర్నీకి కూడా ఒక మంచి ఆప్షన్‌గా భావిస్తున్నారు. 

బ్యాటరీ, రేంజ్ విషయానికి వస్తే, కంపెనీ దీని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను గతంలోలాగే ఉంచింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఈ కారు సిటీ రోడ్లపై మీ రోజువారీ ప్రయాణానికి సరిపోతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సహాయంతో బ్యాటరీని చాలా తక్కువ సమయంలోనే ఛార్జింగ్ కూడా చేయవచ్చు. దీనివల్ల లాంగ్ జర్నీ సమయంలో కూడా అంతగా ఇబ్బంది ఉండదు.

Read Also: Honda Activa 7G vs TVS Jupiter: హోండా యాక్టివా 7G vs టీవీఎస్‌ జుపిటర్! ఫీచర్లు, ధర, పనితీరు మధ్య వ్యత్యాసాలు!

టాటా టియాగో బుకింగ్ ప్రక్రియను కూడా ఈజీ చేశారు. కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ https://ev.tatamotors.com/tiago/ev.html ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. దాంతో పాటు తమకు దగ్గరలోని టాటా డీలర్‌షిప్‌ను కలిసి కూడా కారును బుక్ చేసుకోవచ్చు. కారు బుకింగ్ పూర్తయిన తర్వాత, కంపెనీ కస్టమర్లకు డెలివరీ, కారు అందుబాటుకు సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియజేస్తారు. 

 

Frequently Asked Questions

టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు ఎలా చేయాలి మరియు ఎంత టోకెన్ అమౌంట్ చెల్లించాలి?

టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు కంపెనీ వెబ్‌సైట్ (https://ev.tatamotors.com/tiago/ev.html) ద్వారా లేదా దగ్గరలోని టాటా డీలర్‌షిప్ వద్ద చేయవచ్చు. దీనికి రూ. 11,000 టోకెన్ అమౌంట్ చెల్లించాలి.

కొత్త టియాగో ఈవీలో ఎలాంటి ప్రధాన మార్పులు చేశారు?

కొత్త డిజైన్ గ్రిల్, బంపర్, షార్ప్ లైట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో వచ్చింది.

కొత్త టియాగో ఈవీలో భద్రతా ఫీచర్లు ఏమున్నాయి?

ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ భద్రతా సౌకర్యాలు ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget