పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు.
Top EV Sales In India: ఇంధన ధరల సమస్యతో ఎలక్ట్రిక్ కార్లకు పెరిగిన డిమాండ్.. టాప్ కంపెనీలు ఇవే
EV Sales in May 2026: వాటి తక్కువ మెయింటనెన్స్ ఖర్చుల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లా అధిక ఖర్చు చేయాల్సిన పనిలేదు.

- పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది.
- మే 2026లో 26,221 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి, రికార్డు స్థాయిలో వృద్ధి.
- టాటా మోటార్స్ 10,000 కంటే ఎక్కువ యూనిట్లతో అమ్మకాలలో అగ్రస్థానంలో ఉంది.
- మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ, విన్‌ఫాస్ట్‌లు కూడా మంచి అమ్మకాలు నమోదు చేశాయి.
Electric Vehicles In India | భారత్‌లో మే నెలలో పెట్రోల్, డీజిల్ నాలుగుసార్లు పెరిగాయి. సిఎన్‌జి (CNG) ధరలు సైతం భారీగానే పెరగడం వాహనదారులపై ప్రభావం చూపుతోంది. ఇంధన ధరల ప్రభావం ఇప్పుడు ఆటోమొబైల్ మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన ఖర్చులు పెరిగిపోతుండటంతో కస్టమర్లు ఇప్పుడు రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉండే, పెద్దగా ఖర్చు కాని ప్రత్యామ్నాయాల కోసం సెర్చ్ చేస్తున్నారు. అందువల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. తక్కువ ఖర్చు, మెరుగైన పనితీరు, పర్యావరణ అనుకూలమైనవి కావడంతో ప్రజలు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. మే 2026 లో దేశంలో మొత్తం 26,221 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద మంత్లీ రికార్డు ఇది. ఏప్రిల్ 2026 లో 25,250 యూనిట్లు విక్రయించారు. కేవలం ఒక్క నెలలోనే అమ్మకాల సరికొత్త రికార్డు నమోదైంది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో 80 శాతం వృద్ధి నమోదైంది.
ఈవీ (EV) కొనడానికి కారణం ఏమిటి?
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం తక్కువ నిర్వహణ ఖర్చు. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. మరోవైపు ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఎలక్ట్రిక్ కార్లలో ఇంజిన్‌కు బదులుగా మోటార్ ఉపయోగిస్తారు. దీనివల్ల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత స్మూత్‌గా ఉంటుంది.
టాటా మోటార్స్ (Tata Motors)
అమ్మకాల పరంగా టాటా మోటార్స్ మరోసారి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. భారత మార్కెట్లో ఈ కంపెనీ భారీ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. మే నెలలో కంపెనీ 10,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లను అమ్మింది. టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, సరికొత్త హారియర్ ఈవీ వంటి వాహనాలకు ఉన్న డిమాండ్ కారణంగా కంపెనీ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిపింది.
మహీంద్రా కంపెనీ (Mahindra)
మహీంద్రా కంపెనీ 6,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కంపెనీకి చెందిన కొత్త తరం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఎక్స్‌ఈవీ 9ఈ (XEV 9e), 9ఎస్ (9S) లకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, లాంగ్ డ్రైవింగ్ రేంజ్, మోడ్రన్ టెక్నాలజీ కారణంగా ఈ మోడళ్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.
జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా
జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ దాదాపు 5,000 ఎలక్ట్రిక్ కార్లను అమ్మింది. ఎంజీ విండ్సర్ ఈవీ కంపెనీలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. అమ్మకాల్లో ఇది ప్లస్ అయింది. కస్టమర్లలో ఈ మోడల్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో కొనుగోళ్లు పెరిగాయి.
మారుతి సుజుకి (Maruti Suzuki)
ఎలక్ట్రిక్ మార్కెట్లో మారుతి సుజుకి కూడా బలమైన ముద్ర వేస్తోంది. కంపెనీ వద్ద కేవలం 'ఈ విటారా' (e Vitara) అనే ఒకే ఒక్క ఎలక్ట్రిక్ మోడల్ మాత్రమే ఉంది. అయినప్పటికీ మే నెలలో కంపెనీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నెలగా నిలిచింది. ఈ విటారా 1,500 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
విన్‌ఫాస్ట్ (VinFast)
వియత్నాంకు చెందిన ఆటో మొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్ కూడా భారత మార్కెట్లో నెమ్మదిగా గుర్తింపును చాటుకుంటోంది. విన్ ఫాస్ట్ కంపెనీ మే నెలలో 1,200 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గత కొన్ని నెలలుగా కంపెనీ స్థిరంగా ఇదే స్థాయిలో అమ్మకాలు చేస్తోంది. ఇవి కాకుండా బివైడి (BYD), హ్యుందాయ్, కియా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్ల భారీ అమ్మకాలను నమోదు చేశాయి. విన్‌ఫాస్ట్ త్వరలో భారత్‌లో ఎలక్ట్రిక్ క్యాబ్‌లను తక్కువ ధరలో అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.
Before You Go
Auto Expo 2023 Day 1 Highlights: ఎంతో హైప్ తో మొదలైన ఆటో ఎక్స్ పో మొదటి రోజు హైలైట్స్
Frequently Asked Questions
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఎందుకు పెరుగుతున్నాయి?
మే 2026లో భారతదేశంలో ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి?
మే 2026లో భారతదేశంలో మొత్తం 26,221 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద నెలవారీ రికార్డు.
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి?
తక్కువ నిర్వహణ ఖర్చు, తక్కువ ఛార్జింగ్ ఖర్చు, మరియు స్మూత్ డ్రైవింగ్ అనుభవం దీనికి ప్రధాన కారణాలు.
ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో టాటా మోటార్స్ స్థానం ఏమిటి?
అమ్మకాల పరంగా టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. మే నెలలో కంపెనీ 10,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఏ కంపెనీలు ఉన్నాయి?
టాటా మోటార్స్, మహీంద్రా, జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, మారుతి సుజుకి, విన్‌ఫాస్ట్, బివైడి, హ్యుందాయ్, కియా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు






















