అన్వేషించండి

Best SUV Sales In May 2026: ఎస్‌యూవీ కొనుగోళ్లలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా నెంబర్ వన్.. టాప్ 5 కార్ల లిస్ట్ చూశారా

Compact SUV Sales: కొత్త రెనాల్ట్ డస్టర్ పై మార్కెట్‌లో భారీ అంచనాలు ఉండేవి. అయితే మే 2026లో దాని అమ్మకాలు అంచనాల కంటే చాలా తక్కువగా నమోదయ్యాయి. గత నెలలో అధికంగా అమ్ముడైన SUV లు జాబితా ఇలా ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మైలేజ్, ఫీచర్ల డిమాండ్‌తో, డస్టర్ అమ్మకాలు నిరాశపరిచాయి.
  • టాటా సియెర్రా పుంజుకోగా, గ్రాండ్ విటారా అధిక యూనిట్లు అమ్మింది.
  • స్కార్పియో, క్రెటాలు 15,000 యూనిట్లు దాటి ఆధిపత్యం చాటాయి.

భారత్‌లో ఎస్‌యూవీ మార్కెట్‌లో పోటీ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం కస్టమర్లు కేవలం మంచి డిజైన్ లేదా కొత్త లాంచ్‌లను చూసి మాత్రమే అట్రాక్ట్ కావడం లేదు. మెరుగైన మైలేజ్, మోడ్రన్ ఫీచర్లు, సీఎన్‌జీ (CNG), హైబ్రిడ్ వంటి ఇంధన ఆప్షన్లపై సైతం ఫోకస్ చేస్తున్నారు. మే 2026 నాటి కార్ల విక్రయాల లెక్కలను పరిశీలిస్తే... కేవలం హైప్, ముందస్తు అంచనాల వల్లే ఏ ఎస్‌యూవీ కూడా మార్కెట్‌లో సక్సెస్ సాధించలేదని స్పష్టమవుతోంది. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం, సరైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇవ్వడం నేడు అత్యంత కీలకంగా మారింది.

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster) పై మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మే 2026లో డస్టర్ కార్ల అమ్మకాలు కంపెనీని తీవ్ర నిరాశను మిగిల్చాయి. కొత్తగా లాంచ్ అయినప్పటికీ డస్టర్ కేవలం 1,267 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ఈ మోడల్‌లోని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేకపోవడమే విక్రయాల్లో జోరు తగ్గడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో మిగిలిన కంపెనీలు డ్రైవింగ్ సౌలభ్యం కోసం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తున్నాయి. దీనికి తోడు రెనాల్ట్ డస్టర్‌లో ప్రస్తుతం హైబ్రిడ్ వెర్షన్ అందుబాటులో లేకపోవడం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది.

Also Read: దేశంలో అత్యంత చవకైన MG Comet EVపై 80 వేలు డిస్కౌంట్.. ఫుల్ ఛార్జ్‌తో 230 KM రేంజ్‌

టాటా సియెర్రా అమ్మకాలు ఎలా ఉన్నాయి?
సరికొత్త టాటా సియెర్రా (Tata Sierra) మార్కెట్‌లో తన పట్టును పెంచుకుంటోంది. మే 2026 నెలలో సియెర్రా ఏకంగా 6,606 యూనిట్ల విక్రయాలతో సత్తా చాటింది. రాబోయే రోజుల్లో సియెర్రా ఈవీ (Tata Sierra EV) కూడా లాంచ్ కానుండటంతో ఈ కారు మొత్తం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ తో టాటా మోటార్స్ ఈ ఈవీ వెర్షన్‌పై భారీగా ఆశలు పెట్టుకుంది.

ఏ కార్లు ఎన్ని అమ్ముడయ్యాయి ?
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ హవాను కొనసాగిస్తున్నాయి. మే నెలలో గ్రాండ్ విటారా 10,853 యూనిట్లు అమ్ముడవ్వగా, కియా సెల్టోస్ 10,597 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గ్రాండ్ విటారా విజయానికి అందులోని సీఎన్‌జీ, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లు ఎంతగానో దోహదం చేశాయి. పెరుగుతున్న ఇంధన ధరల పెరుగుదలతో మెరుగైన మైలేజ్, తక్కువ మెయింటనెన్స్, రన్నింగ్ కాస్ట్ వాహనాల వైపే కస్టమర్లు ఫోకస్ చేస్తున్నారు. 

Also Read: Bike Reserve: రిజర్వ్‌ పడ్డాక మీ బైక్‌ ఎంత దూరం వెళ్తుంది.. దీనివల్ల ఇంజిన్‌‌కు నష్టమా ?

ఇక మిడ్-సైజ్, లార్జ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio), హ్యుందాయ్ క్రెటా తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. ఈ 2 మోడళ్లు నెలవారీ అమ్మకాల్లో 15,000 యూనిట్ల మార్కును దాటాయి. స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్, ఎక్కువ ఇంజన్ ఆప్షన్లు, విస్తృతమైన డీలర్ నెట్‌వర్క్ వీరి విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ (XUV 7XO) సైతం 9,338 యూనిట్ల అమ్మకాలతో అద్భుత ప్రదర్శన చేసింది. కాగా గ్రాండ్ విటారా మరోసారి 9,366 యూనిట్లతో తన పాపులారిటీని నిరూపించుకుంది. ఈ లెక్కలు  చూస్తే.. స్టైల్‌తో పాటు తక్కువ ఇంధన ఖర్చు, ఎక్కువ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇచ్చే SUV లకు భారత కస్టమర్లు ప్రియారిటీ ఇస్తున్నారని స్పష్టమవుతోంది.

Frequently Asked Questions

రెనాల్ట్ డస్టర్ కార్ల విక్రయాలు మే 2026లో ఎలా ఉన్నాయి?

మే 2026లో రెనాల్ట్ డస్టర్ కేవలం 1,267 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు హైబ్రిడ్ వెర్షన్ లేకపోవడం అమ్మకాలపై ప్రభావం చూపింది.

భారత ఎస్‌యూవీ మార్కెట్లో అమ్మకాలను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?

కస్టమర్లు మెరుగైన మైలేజ్, మోడ్రన్ ఫీచర్లు, CNG, హైబ్రిడ్ వంటి ఇంధన ఆప్షన్లపై దృష్టి సారిస్తున్నారు. సరైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇవ్వడం అమ్మకాలకు కీలకం.

టాటా సియెర్రా మే 2026లో ఎన్ని యూనిట్లు విక్రయించింది?

మే 2026 నెలలో టాటా సియెర్రా ఏకంగా 6,606 యూనిట్ల విక్రయాలతో సత్తా చాటింది. రాబోయే రోజుల్లో సియెర్రా ఈవీ కూడా లాంచ్ కానుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా అమ్మకాలకు ప్రధాన కారణాలు ఏమిటి?

గ్రాండ్ విటారా విజయానికి అందులోని సీఎన్‌జీ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లు దోహదం చేశాయి. మెరుగైన మైలేజ్, తక్కువ రన్నింగ్ కాస్ట్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో పాటు BaaS ఆఫర్ - నిజంగా మంచి ఆఫర్‌!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌.. అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో రీసేల్‌ చాలా ఈజీ!
2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ - పానోరమిక్ సన్‌రూఫ్‌, భారీ టచ్‌స్క్రీన్‌, 540 డిగ్రీ కెమెరా, కొత్త ఫీచర్లతో లాంచ్‌
రూ.13.69 లక్షలకే కొత్త మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌.. పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget