అన్వేషించండి

Autonomous Driving Technology: స్వయం చాలిత సాంకేతికతకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్.. త్వరలో కార్లు వాటంతట అవే నడుస్తాయా?

అటానమస్ వాహనాల టెక్నాలజీ సంబంధించి ఆమోదాలు లభించడంతో భారత్ లో స్వయంచాలక కార్లు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. ఈ నిర్ణయం ఆటో పరిశ్రమలో భారీ మార్పులు తీసుకురానుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత ఆటో రంగానికి కేంద్రం ఆధునిక భద్రతా సాంకేతికతలకు ఆమోదం.
  • రోడ్డు ప్రమాదాలు తగ్గించి, స్వయం చాలిత డ్రైవింగ్‌కు మార్గం సుగమం.
  • ADAS వంటి అధునాతన ఫీచర్లు ఇప్పుడు మాస్ మార్కెట్‌కు విస్తరిస్తాయి.

భారత ఆటోమొబైల్ రంగం ఒక సరికొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. దేశంలో డ్రైవింగ్ భద్రతను పెంపొందించేందుకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మోడ్రన్ వాహన భద్రతా సాంకేతికతలకు (Advanced Safety Technologies) ఇటీవల ఆమోదం తెలిపింది.

భారత ఆటో పరిశ్రమ ఒక కొత్త విధానం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు కేవలం విదేశీ మార్కెట్లలో లేదా భవిష్యత్తుకు సంబంధించిన టెక్నాలజీని చూశారు. భారత్‌లోనూ ఈ రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆటానమస్ (స్వయం చాలిత), స్మార్ట్ డ్రైవింగ్ సిస్టమ్స్ దిశగా ఒక పెద్ద అడుగుగా భావించే మోడ్రన్ వెహికల్ సేఫ్టీ టెక్నాలజీకి ఆమోదం తెలిపింది. దీని తర్వాత, రాబోయే కాలంలో భారత్‌లో రోడ్లపై స్వయంగా నడిచే కార్లు కనిపించవచ్చా అని హాట్ టాపిక్ అవుతోంది. 

పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కాలం ఇంకా చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఈ కొత్త ఆమోదం ఆ దిశగా రూట్ క్లియర్ చేసింది. ఆధునిక భద్రతా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపడటమే కాకుండా, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం భారత ఆటో రంగానికి అత్యంత కీలకమైనదిగా భావించవచ్చు. 

Also Read: Best Scooters: రోజూ ఆఫీసుకు వెళ్లే వారికి ఈ 4 స్కూటర్లు బెస్ట్, మీకు ఏది సెట్ అవుతుంది

అటానమస్ వెహికల్ సాంకేతికత అంటే ఏమిటి? 
ఆటోనమస్ వెహికల్ (Autonomous Vehicle) సాంకేతికత అనేది అనేక సెన్సార్లు, కెమెరాలు, రాడార్, సాఫ్ట్‌వేర్ సహాయంతో కారు తన చుట్టుపక్కల వాతావరణాన్ని అర్థం చేసుకునే వ్యవస్థ. ఈ సాంకేతికత వాహనాన్ని నిర్ణీత లేన్‌లో ఉంచడానికి, ముందు వెళ్తున్న వాహనం నుండి సురక్షితమైన దూరాన్ని మెయింటైన్ చేయడానికి, ముందుగా ప్రమాదాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం భారత్‌లో ఆమోదం పొందుతున్న టెక్నాలజీ పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ కానప్పటికీ, అవి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (Advanced Driver Assistance System) అంటే ADAS లో భాగం.

వీటిలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉండవచ్చు. ఈ టెక్నాలజీల ముఖ్య ఉద్దేశం డ్రైవర్‌కు సహాయం చేయడం, అదే సమయంలో ప్రమాదాల ముప్పును తగ్గించడం. ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ సాంకేతికత అందుబాటులోకి తెచ్చారు. భారత్ కూడా ఈ దిశగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

వినియోగదారుల కోసం ఏం మారవచ్చు?
కేంద్రం ఈ కొత్త ఆమోదం తర్వాత, వాహన తయారీ సంస్థలు దేశంలో మరిన్ని సాంకేతికత కలిగిన కార్లను పరిచయం చేయడానికి ఉత్సాహంగా ఉంటాయి. రాబోయే సంవత్సరాల్లో వినియోగదారులు మునుపెన్నడూ లేనంత ఎక్కువ భద్రత,  సౌకర్యవంతమైన వాహనాలను చూడవచ్చు. ADAS వంటి సాంకేతికత ఇప్పుడు కేవలం లగ్జరీ కార్లకే పరిమితం కాలేదు. అనేక కంపెనీలు దీనిని మాస్ మార్కెట్ మోడల్స్‌లో కూడా చేర్చడం ప్రారంభించాయి. దీనివల్ల సామాన్య వినియోగదారులకు సైతం ఆధునిక సేఫ్టీ ఫీచర్ల ప్రయోజనం చేకూరనుంది.

Also Read: మారుతి ఫ్రాంక్స్‌ జోరు మామూలుగా లేదుగా.. కేవలం 3 సంవత్సరాల్లోనే 5 లక్షల అమ్మకాలు!

భవిష్యత్తులో స్మార్ట్ మొబిలిటీ, కనెక్టెడ్ కార్లు, ఆటోనమస్ డ్రైవింగ్ టెక్నాలజీ భారత ఆటో మార్కెట్ ను నడిపిస్తాయని  నిపుణులు భావిస్తున్నారు. అయితే, పూర్తిగా స్వయంగా నడిచే కార్ల కోసం ఇంకా మౌలిక సదుపాయాలు, రూల్స్,  టెక్నాలజీ సన్నద్ధతపై చాలా పని చేయాలి. ఈ నిర్ణయం భారత భవిష్యత్తు మొబిలిటీ దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసేందుకు అవకాశంగా మలుచుకుంటారు.

Frequently Asked Questions

కేంద్ర ప్రభుత్వం ఏ సాంకేతికతకు ఆమోదం తెలిపింది?

డ్రైవింగ్ భద్రతను పెంచడానికి, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధునిక వాహన భద్రతా సాంకేతికతలకు (Advanced Safety Technologies) ఆమోదం తెలిపింది. ఇది స్వయం చాలిత డ్రైవింగ్ సిస్టమ్స్ దిశగా ఒక ముందడుగు.

అటానమస్ వెహికల్ సాంకేతికత అంటే ఏమిటి?

ఇది సెన్సార్లు, కెమెరాలు, సాఫ్ట్‌వేర్ సహాయంతో కారు పరిసరాలను అర్థం చేసుకునే వ్యవస్థ. వాహనాన్ని నిర్ణీత లేన్‌లో ఉంచడానికి, సురక్షితమైన దూరం మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

ఈ కొత్త టెక్నాలజీల వల్ల వినియోగదారులకు లాభం ఏమిటి?

ఈ ఆమోదంతో, వినియోగదారులకు మరింత భద్రత, సౌకర్యం గల వాహనాలు లభిస్తాయి. ADAS వంటి సాంకేతికతలు ఇప్పుడు లగ్జరీ కార్లకే కాకుండా మాస్ మార్కెట్ మోడల్స్‌లోనూ అందుబాటులోకి వస్తాయి.

భారత రోడ్లపై స్వయంగా నడిచే కార్లు ఎప్పుడు కనిపిస్తాయి?

పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కాలం ఇంకా దూరంలో ఉంది. వాటి కోసం మౌలిక సదుపాయాలు, నిబంధనలు, సాంకేతిక సన్నద్ధతపై ఇంకా చాలా పని చేయాల్సి ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget