అన్వేషించండి

Maruti Swift vs Baleno 2026 Comparison:హైదరాబాద్‌లో మారుతి స్విఫ్ట్‌ vs బలెనో: ఏ కారు కొంటే గిట్టుబాటు అవుతుంది? లేటెస్ట్ ధరలు, EMI ఆప్షన్లు ఇవే!

Maruti Swift vs Baleno 2026 Comparison:2026 జూన్ నాటికి హైదరాబాద్‌లో మారుతి స్విఫ్ట్‌, బలెనో కార్ల ధరలు, మైలేజీ, ఫైనాన్స్‌ వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి స్విఫ్ట్ యువతకు, వేగవంతమైన మైలేజీకి ఉత్తమం.
  • బలెనో ప్రీమియం లక్షణాలు, విశాలమైన స్థలం అందిస్తుంది.
  • హైదరాబాద్‌లో రెండు మోడళ్ల ఆన్-రోడ్ ధరలు, ఈఎంఐలు.
  • మీ ప్రాధాన్యతలు, అవసరాలను బట్టి సరైనది ఎంచుకోండి.

Maruti Swift vs Baleno 2026 Comparison:భారతీయ రోడ్లపై మారుతి సుజుకి కనిపించని, వినిపించని రోజు ఉండదు. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్‌ విభాగాంలో స్విఫ్ట్‌, బలెనో రెండు దిగ్గజాలు పోటీ పడుతుంటాయి. 2026 జూన్ నాటికి హైదరాబాద్, తెలంగాణ మార్కెట్‌లో ఈ కార్ల ధరలు, ఫైనాన్సింగ్‌ ఆప్షన్లు ఎలా ఉన్నాయో, అసలు మీరు ఏ కారును ఎంచుకోవాలో విశ్లేషణాత్మంగా తెలుసుకోండి. 

వేగంతోపాటు పొదుపు కావాలంటే మారుతి స్విఫ్ట్‌ మంచి ఆప్షన్

మారుతి స్విఫ్ట్ ఎప్పుడూ యువత కారుగానే గుర్తింపు పొందింది. దీని స్పోర్టీ లుక్, డ్రైవింగ్ డైనమిక్స్ దీనికి ప్రధాన బలాలు. స్విఫ్ట్ ఎక్స్‌ షోరూమ్‌ ధరలు 5.79లక్షల నుంచి 8.80 లక్షల వరకు ఉన్నాయి. అయితే రోడ్‌ ట్యాక్స్‌, ఇన్సూరెన్స్‌ కలిపి హైదరాబాద్‌లో ధరలు ఇలా ఉంటాయి. బేస్‌ వేరియంట్‌ LXi 6.90 లక్షల నుంచి 7.10 లక్షల వరకు ఉంది. అత్యధికంగా అమ్ముడయ్యే VXi 7.80 లక్షల నుంచి 8.05 లక్షల వరకు ఉంది. ఆటోమేటిక్‌ VXi AMT 8.35 లక్షల నుంచి 8.60 లక్షల వరకు ధర కలిగి ఉంది. ఇందులో టాప్‌ ఎండ కారు ZXi 9.80 లక్ష నుంచి 10.50 లక్షల వరకు ఉంది. 

స్విఫ్ట్‌ ఉంటే నగరంలో సులభంగా డ్రైవ్ చేయవచ్చు. పార్కింగ్‌ చేయడం కూడా సులభం. ట్రాఫిక్‌లో కూడా 25 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇది పెట్రోల్‌, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. 

విలాసవంతమైన ప్రయాణాలకు మారుతి బలెనో

బలెనో అనేది మారుతి నుంచి వస్తున్న ప్రీమియం హ్యాచ్‌ యాక్‌. ఇది స్విఫ్ట్‌ కంటే కాస్త ఎక్కువ స్పేస్‌, లగ్జరీ ఫీచర్లను అందిస్తుంది. బలెనో ఎక్స్‌ షోరూమ్‌ ధర 5.99 లక్షల నుంచి 9.10 లక్షల మధ్య ఉంటుంది. ఆన్‌రోడ్ ధర పరిశీలిస్తే.... బేస్‌ మోడల్ సిగ్మా 7.18 లక్షల నుంచి 7.50 లక్షల వరకు ఉంటుంది. బాగా పాపులర్ అయిన డెల్టా కారు 8.10 నుంచి 8.54 లక్షల మధ్య ధర కలిగి ఉంది. ఆటోమేటిక్ కారు డెల్టా AMT 8.70 లక్షల నుంచి 9 లక్షల వరకు ఉంది. టాప్‌ ఎండ్‌ కారు అయిన జెటా, ఆల్ఫా 9.20 లక్షల నుంచి 10.80 లక్షల మధ్య ధర కలిగి ఉన్నాయి. 

బలెనోలో లభించే హెడ్స్‌ అప్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు హై ఎండ్ కార్లను తలపిస్తాయి. దీని మైలేజీ పెట్రోల్‌పై సుమారు 22-23 కిలోమీటర్లు ఇస్తుంది.

ఫైనాన్స్‌ ప్లాన్, ఈఎంఐ గురించి చూస్తే...

చాలా మంది కారును లోన్‌ ద్వారా కొనుగోలు చేస్తారు. సాధారణంగా బ్యాంకులు 8.5 శాతం నుంచి 9.5 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఇక్కడ మనం 9 శాతం వడ్డీతో 5 ఏళ్ల లోన్ ప్లాన్ ఒకసారి చూస్తే... 

ఈ ధరతో మారుతి స్విఫ్ట్ VXi కొనుగోలు చేస్తే... ఆన్‌ రోడ్డు ధర 8 లక్షలు ఇందులో 1.6 లక్షలు డౌన్‌పేమెంట్ చేస్తే మిగతా 6.4 లక్షల రూపాయల కోసం లోన్‌కు వెళ్లొచ్చు. దీని కోసం నెలకు 13,285 రూపాయలు ఈఎంఐ చెల్లించాలి. ఐదేళ్లలో చెల్లించే మొత్తం వడ్డీ 1.57 లక్షల రూపాయలు. 

అదే మారుతి బలెనో డెల్టా తీసుకుంటే... ఈ వాహనం ఆన్‌రోడ్‌ ప్రైస్‌ 8.2 నుంచి 8.5 లక్షలు ఉంది. దీనికి డౌన్‌పేమెంట్‌ 1.65 లక్షలు చెల్లించాలి. మిగతా మొత్తం 6.56 లోన్‌కు వెళ్లొచ్చు. దీని కోసం నెలకు 13,617 రూపాయలు ఈఎంఐ చెల్లించాలి. ఐదేళ్లలో చెల్లించే మొత్తం వడ్డీ 1.61 లక్షలు. సిబిల్ స్కోర్‌ 750 కంటే ఎక్కువ ఉంటే మీకు తక్కువ వడ్డీకే లోన్ లభించే ఛాన్స్‌ ఉంది.  

మారుతి స్విప్ట్, బలెనో రెండూ భారతీయ రోడ్లకు సరిపోయే కార్లు, మీ ప్రాధాన్యత మైలేజీ, స్టైల్ అయితే స్విఫ్ట్‌, అదే కంఫర్ట్‌, స్పేస్ అయితే బలెనోను ఎంచుకోండి.  

Frequently Asked Questions

మారుతి స్విఫ్ట్, బాలెనోలలో దేనిని ఎంచుకోవాలి?

మైలేజీ, స్టైల్‌కు ప్రాధాన్యత ఇస్తే స్విఫ్ట్ మంచిది. కంఫర్ట్, స్పేస్ కావాలంటే బాలెనోను ఎంచుకోవచ్చు.

హైదరాబాద్‌లో మారుతి స్విఫ్ట్ ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయి?

హైదరాబాద్‌లో స్విఫ్ట్ LXi ఆన్-రోడ్ ధర 6.90 లక్షల నుంచి 7.10 లక్షల వరకు, ZXi 9.80 లక్షల నుంచి 10.50 లక్షల వరకు ఉన్నాయి. ఇది నగరంలో 25 కి.మీ.ల మైలేజీని అందిస్తుంది.

మారుతి బాలెనోలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి మరియు హైదరాబాద్‌లో దాని ధర ఎంత?

బాలెనోలో హెడ్స్‌ అప్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో సిగ్మా ఆన్‌రోడ్ ధర 7.18 లక్షల నుంచి 7.50 లక్షల వరకు, టాప్‌ ఎండ్‌ మోడల్స్ 10.80 లక్షల వరకు ఉంటాయి.

కారు కొనుగోలుకు ఫైనాన్స్ ప్లాన్, ఈఎంఐ వివరాలు ఏమిటి?

బ్యాంకులు సాధారణంగా 8.5% నుంచి 9.5% వడ్డీ వసూలు చేస్తాయి. స్విఫ్ట్ VXi కోసం నెలకు 13,285 రూపాయలు, బాలెనో డెల్టా కోసం 13,617 రూపాయలు EMI చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
Advertisement

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget