Trains Cancel List: అలర్ట్! ఈ తేదీల్లో ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు, ఇంకొన్ని దారి మళ్లింపు - పూర్తి వివరాలు
రైలు పట్టాల మరమ్మతులు, కొత్త పట్టాల నిర్మాణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో నేటి నుంచి కొన్ని తేదీల్లో రైళ్ల రాకపోకల విషయంలో భారీ మార్పులు జరగనున్నాయి. నిర్దేశిత మార్గంలో రైలు పట్టాల మరమ్మతులు, కొత్త పట్టాల నిర్మాణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఇంకొన్ని రైళ్ల గమ్యస్థానాన్ని కుదించింది. ఈ మేరకు విశాఖపట్నంలోని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఆదివారం వెల్లడించారు.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో లఖోలి - రాయపూర్ మధ్య రెండో లైన్ పనులు, నయా రాయపూర్ స్టేషన్, యార్డు ఆధునీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరి కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి వెల్లడించారు.
రద్దు అయిన రైళ్ల వివరాలు ఇవీ
* ఈనెల 11న విశాఖ - కోర్బా(18518), 12న కోర్బా-విశాఖ(18517), 6 నుంచి 12 వరకు విశాఖ-దుర్గ్(18530), 7 నుంచి 13 వరకు దుర్గ్-విశాఖ(18529) రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు.
* ఈ నెల 6 నుంచి 12 వరకు విశాఖ - రాయపూర్(08528), 7 నుంచి 13 వరకు రాయపూర్ - విశాఖ(08527) రైళ్లను మహాసముండ-రాయపూర్-మహాసముండ స్టేషన్ల మధ్య రద్దు చేశారు.
దారి మళ్లింపు రైళ్లు ఇవీ..
* ఈ నెల 8, 11 తేదీల్లో తిరుపతి - బిలాస్‌పూర్ (17482), 10, 13 తేదీల్లో బిలాస్‌పూర్ - తిరుపతి(17481), ఈ నెల 6, 8, 9, 10, 13, 15 తేదీల్లో పూరీ-అహ్మదాబాద్ (12843), 8, 10, 11, 12, 15 తేదీల్లో అహ్మదాబాద్ - పూరీ(12844) రైళ్లను దారి మళ్లించారు. అ రైలు సర్వీసులను టిట్లాఘర్, సంబల్‌పూర్, జార్సుగూడ మీదుగా దారి మళ్లించారు.
ఆలస్యంగా బయలుదేరే రైళ్లు ఇవీ..
* ఈ నెల 12న విశాఖ - కోర్బా (18518) ఎక్స్‌ప్రెస్ 5 గంటలు, 8, 15 తేదీల్లో విశాఖ - నిజాముద్దీన్ (12897) సమతా ఎక్స్‌ప్రెస్ 2 గంటలు, 12న హజ్రత్ నిజాముద్దీన్ -విశాఖ (12808) సమతా ఎక్స్‌ప్రెస్ 5 గంటలు, 15న తిరుపతి - బిలాస్‌పూర్ (17482) 4 గంటలు, విశాఖ - భగత్ కీ - కోఠి (18573) 5 గంటలు లేటుగా బయలు దేరతాయి. సదరు రైళ్లలో ప్రయాణించాల్సిన ప్రయాణికులు ఈ విషయం గమనించి సహకరించాలని సీనియర్ డీసీఎం కోరారు.
రైల్వే ఉద్యోగులకు షాక్!
మరోవైపు, రైల్వే ఉద్యోగులకు ఆ శాఖ షాక్ ఇవ్వనుంది. విపరీంగా పెరిగిపోతున్న ఖర్చులను నియంత్రించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగులకు చెల్లించే అలవెన్సులను తగ్గించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులు ఏడు జోన్‌లలో రివ్వ్యూ నిర్వహించారు. మీటింగ్‌లో ఈ ఏడు జోన్లకు సంబంధించి ఓవర్ టైం చేస్తున్న రైల్వే ఉద్యోగులకు చెల్లించే అలవెన్స్‌లు, నైట్ డ్యూటీ, ట్రావెల్, ఇంధన వినియోగం, నిర్వహణ ఖర్చులను ఆరా తీసినట్లు సమాచారం. ఖర్చులు దాదాపు 26 శాతం పెరిగినందున వ్యయ నియంత్రణ, నిర్వహణపై రైల్వే బోర్డు మార్గదర్శకాలను జారీ చేసినటు తెలుస్తోంది.