Today Top Headlines: ఇస్రో వందో ప్రయోగం సక్సెస్ - తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
![Today Top Headlines: ఇస్రో వందో ప్రయోగం సక్సెస్ - తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM 29th january 3 pm top headlines in ap and telangana Today Top Headlines: ఇస్రో వందో ప్రయోగం సక్సెస్ - తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/4b069b472a1eeab5a741ff3b9023b2d51738139936764876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Today Top Headlines In AP And Telangana:
1. సెంచరీ కొట్టిన ఇస్రో
ఇస్రో (ISRO) వందో రాకెట్ ప్రయోగం తిరుపతిలోని శ్రీహరికోట వేదికగా బుధవారం ఉదయం జరిగింది. షార్ నుంచి ఉదయం 6:23 గంటలకు శాస్త్రవేత్తలు జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15 (GSLV F15) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ ఈ రాకెట్... ఎన్‌వీఎస్ - 02 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ శాటిలైట్ స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250 కిలోలు. కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఇది రెండోది. ఇంకా చదవండి.
2. ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
రాజధాని అమరావతిని.. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో కచ్చితంగా శంకుస్థాపన చేసేలా ఎంపీలు కృషి చేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) సూచించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం (TDP Parliamentary Meeting) నిర్వహించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా కృషి చేయాలన్నారు. ఇంకా చదవండి.
3. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ (MLC Election Schedule) విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా - గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇంకా చదవండి.
4. అట్టహాసంగా ఆదివాసీ నాగోబా జాతర
అడవి బిడ్డల సంబురం నాగోబా జాతర (Nagoba Jatara) ప్రారంభమైంది. పుష్య అమావాస్య రోజున అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి మెస్రం వంశీయులు నాగోబా మహాపూజ ప్రారంభించారు. తెల్లటి తలపాగాలు, తెల్లని వస్త్రాలు ధరించి మహాపూజలో పాల్గొన్న మెస్రం వంశీయులు నాగోబాను దర్శించుకున్నారు. వారితో పాటు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధులు మహపూజలో పాల్గొని నాగోబాను దర్శించుకున్నారు. మరి ఈ సంబురం వెనుక ఉన్న ఆచార సంప్రదాయాలు, వేడుక ఎలా నిర్వహిస్తారో ఓసారి చూస్తే.. ఇంకా చదవండి.
5. మహా కుంభమేళాలో ఘోర విషాదం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో (Maha Kumbhmela 2025) బుధవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలిరాగా.. విపరీతమైన రద్దీ నెలకొని సెక్టార్ 2 వద్ద బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇంకా చదవండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)