Today Top Headlines: మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు - వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. మత్స్యకారుల మధ్య ముదురుతోన్న రింగు వలల వివాదం
చేపల వేటలో రింగువల వినియోగించడాన్ని ప్రభుత్వం నిషేధించినా శ్రీకాకుళం (Srikakulam) జిల్లా మత్స్యశాఖ డీడీ శ్రీనివాస్ నిర్వాకం వల్ల జిల్లా వ్యాప్తంగా వీటిని వినియోగించి సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడమే ఇందుకు సాక్ష్యం. రింగు వలలు వినియోగిస్తున్న మరబోట్ల యజమాన్యాలు పెద్ద మొత్తంలో మంత్లీలు ముట్టజెప్పడం వల్లే డీడీ శ్రీనివాసరావు కళ్లు మూసుకున్నారని సంప్రదాయ మత్స్యకారుల నుంచి విమర్శలు ఉన్నాయి. రింగు వలలో చిక్కిన ఏ చేప కూడా మళ్లీ సముద్రంలోకి పోలేదు. ఇంకా చదవండి.
2. మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
ఏపీలో గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మంత్రుల పనితీరుపై ఫోకస్ చేసింది. గత ఏడు నెలల్లో మంత్రుల పనితీరుపై నివేదిక పంపాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. గత ఏడాది జులై నుంచి డిసెంబరు వరకు మంత్రుల పనితీరుపై నివేదికలు పంపాలని ఆదేశాలిచ్చారు. కూటమి ప్రభుత్వంలో మంత్రుల అధికారిక కార్యక్రమాలతో పాటు, వారికి కేటాయించిన శాఖాపరంగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలపై రిపోర్ట్ చేయనున్నారు. మంత్రులు తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుతో పాటు పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు లాంటి ముఖ్య సమాచారాన్ని ఆరు నమూనాల ద్వారా ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇంకా చదవండి.
3. విజయవాడలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
ఆంధ్రప్రదేశ్‌లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించింది. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. అంతకుముందు పరేడ్ లో పాల్గొని గవర్నర్ అబ్దుల్ నజీర్ పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ రిపబ్లిక్ డే వేడుకలలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇంకా చదవండి.
4. వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మామునూరులో ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. పక్కనే వెళ్తున్న కారు, రెండు ఆటోలపై లారీ బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా చదవండి.
5. మహిళ ఇంటి ముందు బ్యాంక్ అధికారుల నిరసన
ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్న వ్యక్తులు సమయానికి అప్పు కట్టకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అధికారులు ఇంటికి వెళ్లి నిలదీయడంతోపాటు ఒత్తిడి చేస్తారు. కానీ బ్యాంకు అధికారులు సైతం మొండి బకాయిలను వసూలు చేసుకోవడానికి అప్పుతీసుకున్న వారి ఇంటికి వెళ్లి లోన్ బకాయిలు కట్టాలని ఒత్తిడి పెంచడంతో పాటు వినూత్న ఆందోళనలు దిగుతున్నారు. ఇలాంటి సంఘటనే జనగామ జిల్లాలో జరిగింది. ఇంకా చదవండి.





















