Top Headlines: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు - తెలంగాణ సీఎం సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దేశంలో జమిలి ఎన్నికలు (Jamili Elections) వచ్చినా రాష్ట్రంలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే సాధారణ ఎన్నికలు ఉంటాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. ముందస్తు ఎన్నికలేవీ ఉండవని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో తన కార్యాలయం వద్ద మీడియాతో ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. 'విజన్ డాక్యుమెంట్ - 2047 అమలుపై నిరంతర పర్యవేక్షణ, సమీక్ష ఉంటుంది. ఆ లక్ష్యాలను సాధించేందుకు నెలవారీ, త్రైమాసిక ప్రణాళికలు రూపొందించుకుని వాటిని పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేస్తాం. 'విజన్' లక్ష్యసాధన కోసం ఆర్థిక వనరుల సమీకరణకు కూడా కొత్త పంథా అమలు చేయబోతున్నాం.' అని తెలిపారు. ఇంకా చదవండి.
2. వైసీపీకి మరో బిగ్ షాక్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.ఆ పార్టీకి , ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీకి చేసిన రాజీనామా లేఖను జగన్‌కు..ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుకు పంపించారు. తన రాజీనామాలను ఆమోదించాలని ఆయన లేఖల్లో కోరారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కైకలూరు నియోజకవర్గానికిచెందిన జయమంగళ వెంకటరమణ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి ఓడిపోయారు. ఓ సారి పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయిస్తే పని చేశారు. ఇంకా చదవండి.
3. తెలంగాణ సీఎం సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య
సీఎం రేవంత్ స్వగ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో లభ్యమైన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'సీఎం సోదరుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నా.' అని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా వంగూరు మండలంలో సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లికి (Kondareddy Pally) చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి (85) కల్వకుర్తిలో శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంకా చదవండి.
4. న్యూడ్ వీడియో కాల్‌తో కొంపముంచింది
డబ్బులు దండుకునేందుకు నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయ మాటలతో బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకుని ఖాతా ఖాళీ చేసే వారు కొందరైతే.. మోసపూరిత లింకులు పంపి డబ్బులు దోచుకునేవారు మరికొందరు. ఇంకొందరు న్యూడ్ వీడియో కాల్స్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. ఓ విద్యార్థి అలాంటి మోసానికే గురయ్యాడు. ఓ కిలాడీ లేడీ విద్యార్థికి ఫోన్ చేసి న్యూడ్‌గా దర్శనమిచ్చింది. అనంతరం బెదిరింపులకు పాల్పడి డబ్బు కాజేసింది. అయినా, వేధింపులు ఆగకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. ఇంకా చదవండి.
5. వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఘన విజయం
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఘన విజయం సాధించారు. కేరళ వయనాడ్ (Wayanad) లోక్ సభ ఉప ఎన్నికలో ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ నేత, సమీప అభ్యర్థి నవ్య హరిదాస్‌పై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఇంకా చదవండి.