Crime News: గుర్తు తెలియని యువతి నుంచి వీడియో కాల్ - కూల్‌గా మాట్లాడి కొంపముంచింది, చివరకు!
Hyderabad News: ఘటకేసర్‌కు చెందిన ఓ విద్యార్థికి ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసింది. వేధింపులు కొనసాగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Engineering Student Trapped By A Woman With Video Call: డబ్బులు దండుకునేందుకు నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయ మాటలతో బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకుని ఖాతా ఖాళీ చేసే వారు కొందరైతే.. మోసపూరిత లింకులు పంపి డబ్బులు దోచుకునేవారు మరికొందరు. ఇంకొందరు న్యూడ్ వీడియో కాల్స్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. ఓ విద్యార్థి అలాంటి మోసానికే గురయ్యాడు. ఓ కిలాడీ లేడీ విద్యార్థికి ఫోన్ చేసి న్యూడ్‌గా దర్శనమిచ్చింది. అనంతరం బెదిరింపులకు పాల్పడి డబ్బు కాజేసింది. అయినా, వేధింపులు ఆగకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ (Adilabad) సంజయ్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థి (22) ఘట్‌కేసర్‌లోని (Ghatkesar) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ చౌదరిగూడ మల్లమ్మకాలనీలో అద్దెకు ఉంటున్నాడు.
వీడియో కాల్‌లో మాట్లాడుతూ..
గురువారం రాత్రి సదరు విద్యార్థి వాట్సాప్‌నకు దీక్షికా అగర్వాల్ పేరిట ఓ వీడియో కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసిన అతను యువతితో మాట్లాడాడు. ఎలా ఉన్నారు.?. బాగున్నావా.?.. ఎలా చదువుతున్నావు. పరీక్షలు ఎప్పుడు..? అంటూ కూల్‌గా మాట్లాడింది. ఆమె అడిగిన ప్రశ్నలకు అతను సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో ఆమె హఠాత్తుగా నగ్నంగా మారింది. ఈ వీడియోను రికార్డు చేసింది. కొన్ని నిమిషాల తర్వాత ఆ విద్యార్థికి నగ్నంగా ఉన్న వీడియోను పంపించి డబ్బులు డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించింది. దీంతో బెదిరిపోయిన సదరు విద్యార్థి 3 విడతల్లో రూ.20 వేలు ఆన్‌లైన్‌లో పంపించాడు. అయినా, ఆ మహిళ నుంచి బెదిరింపులు ఆగలేదు. మరిన్ని డబ్బులు పంపించాలని బెదిరించడంతో భయపడిన విద్యార్థి పోచారం ఐటీ కారిడార్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.?, డబ్బులు ఎవరి అకౌంట్‌లో పడ్డాయనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చెయ్యొద్దని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- ముఖ్యంగా అన్ నోన్, స్పామ్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చెయ్యకుండా ఉండడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
- ఒకవేళ ఎవరని తెలుసుకోవాలనిపిస్తే.. ఫ్రంట్ కెమెరాకు వేలు అడ్డుపెట్టి లిఫ్ట్ చేయాలని చెబుతున్నారు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత విషయాలు షేర్ చేయకూడదు.
- అలాగే అన్‌నోన్ నెంబర్స్ యాడ్ చేసే వాట్సాప్ గ్రూపుల్లో చేరకూడదు. ఇందుకోసం ప్రైవసీలో ఉండే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Crime News: గన్ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ - అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి