అన్వేషించండి

Crime News: గన్ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ - అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

Hyderabad News: అమెరికాలో గన్ మిస్ ఫైర్ అయ్యి హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 13న ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Hyderabad Young Man Died Due To Gun Misfired In America: హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఓ యువకుడు తన సొంత తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యి మృతి చెందిన ఘటన అమెరికాలో (America) చోటు చేసుకుంది. ఈ నెల 13న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌లోని (Uppal) ధర్మపురికాలనీలో నివసించే పాల్వాయి సుదర్శన్ రెడ్డి, గీత దంపతుల ఏకైక కుమారుడు ఆర్యన్ రెడ్డి (23) గతేడాది డిసెంబరులో ఉన్నత చదువులకు అమెరికా వెళ్లాడు. జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్శిటీలో ఎంఎస్ రెండో ఏడాది చదువుతున్నాడు.

ఈ నెల 13న స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నాడు. అదే రోజు ఆర్యన్ ఉండే గది నుంచి తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. ఆందోళనతో స్నేహితులు వెళ్లి చూసేసరికే అతను విగతజీవిగా పడి ఉన్నాడు. తూటా ఛాతీ లోపలికి దూసుకుపోవడంతో అక్కడికక్కడే ఆర్యన్ మృతి చెందాడు. పుట్టినరోజు వేడుకలో భాగంగా కొత్తగా కొనుగోలు చేసిన తుపాకీని బయటకు తీసి శుభ్రం చేస్తుండగా ట్రిగ్గర్ నొక్కుకుపోయి ఈ దుర్ఘటన జరిగినట్లు స్నేహితులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. భువనగిరి జిల్లాలోని పెద్దరావుపల్లి గ్రామానికి చెందిన ఆర్యన్ కుటుంబం ప్రస్తుతం ఉప్పల్‌లో నివసిస్తోంది. తమ కుమారుడి మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 

'గన్ కల్చర్ వల్లే..'

అమెరికాలో గన్ కల్చరే తమ కుమారుడిని పొట్టన పెట్టుకుందని ఆర్యన్ తండ్రి సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ విద్యార్థులకు కూడా గన్ లైసెన్స్ ఇస్తారని తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. దేశ సేవ అంటే ఆర్యన్ చాలా ఆసక్తి చూపేవాడని.. ఆర్మీలో చేరతానంటే తానే వద్దని వారించినట్లు చెప్పారు. కాగా, ఆర్యన్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టులోనే హంటింగ్ గన్‌కు లైసెన్స్ తీసుకున్నారు. ఇందుకోసం ఓ పరీక్ష కూడా రాసినట్లు తెలుస్తోంది.

Also Read: Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Drug Racket: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
US Exit Bonus: అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Free Charging For EVs: మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Embed widget