Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు
Telangana MLAs Case: తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్ తగిలింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది.
Telangana High Court: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్‌కు ఊరట ఇచ్చే తీర్పును హైకోర్టు వెల్లడించింది. ఈ కేసు విషయంలో పోరాడుతున్న బీఆర్‌ఎస్‌కు ఇదో పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది.
తెలంగాణలో కారు గుర్తుపై పోటీ చేసి విజయం సాధించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చట్టాలను ఉల్లంఘించి కాంగ్రెస్‌లో చేరినట్టు బీఆర్‌ఎస్ కోర్టుకు వెళ్లింది. ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితోపాటు మరికొందరు కోర్టులో పిటిషన్ వేశారు. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని అభ్యర్థించారు.
ఈ విషయంలో పలుమార్లు స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చామని ఆయన చర్యలు తీసుకోలేదని బీఆర్‌ఎస్ కోర్టుకు తెలిపింది. ఆయన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ నాలుగు వారాల్లో ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని తీర్పు వెల్లడించింది. ఓ కార్యాచరణ ప్రకటించాలని పేర్కొంది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి వీ.నర్సింహాచార్యులు హైకోర్టును ఆశ్రయించింది.
అసెంబ్లీ కార్యదర్శి వీ.నర్సింహాచార్యులు దాఖలు చేసిన పిటిష్ విచారణకు స్వీకరించిన హైకోర్టు డివిజన్ బెంజ్ ఇరు వర్గాల వాదనలు విన్నది. విన్న తర్వాత ఇవాళ(శుక్రవారం) తీర్పు వెల్లడించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టి వేసింది. రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై ఓ నిర్ణయం ప్రకటించాలని ఆదేశించింది. స్పీకర్ కు ఏలాంటి టైం బౌండ్ లేదని పేర్కొంది.